Ubaid Baig: This blog is useful for the aspirants of the Andhra Pradesh Public Service Commision (APPSC ) and Telangana State Public Service Commission Aspirants. I hope all the aspirants make use of this blog and visit as much as possible for latest updates related to the APPSC , group1 and group2. Thank u all.
Meet Us Here
▼
Pages
▼
Wednesday, February 12, 2014
AFTER MBA&MCA
BE / B.Tech
MBA / MCA
M.Tech / MS
Others
Post Your Question
ఏపీసెట్, యూజీసీ నెట్ల వల్ల లాభాలేమిటి? ఎంబీఏ చేసినవారికి వీటి
ద్వారా వచ్చే ఉద్యోగాలేమిటి?
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వారు బోధన, పరిశోధనలకు కనీస
ప్రమాణాలను కలిగినవారిగా ధ్రువీకరించడానికి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్
(నెట్)ను దేశవ్యాప్తంగా సంవత్సరానికి రెండుసార్లు (జూన్, డిసెంబర్)
నిర్వహిస్తారు. రాత పరీక్షలో హ్యుమానిటీస్ (భాషలతో సహా), సోషల్
సైన్సెస్, ఫోరెన్సిక్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్-
అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సైన్సెస్ వంటి అంశాలుంటాయి. మాస్టర్ డిగ్రీలో
55% మార్కులు (50% మార్కులు- ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ వీహెచ్ వారికి)
ఉండి, 28 సంవత్సరాల వయసు (రిసెర్చ్ ఫెలోషిప్కి మాత్రమే)
దాటనివారు ఈ పరీక్షకు అర్హులు. మీరు మాస్టర్ డిగ్రీ చేసిన
సబ్జెక్టుని ఎంచుకుని దానికి సంబంధించిన పరీక్ష రాయాల్సి ఉంటుంది.
యూజీసీ నెట్ మాదిరిగానే, ఉస్మానియా యూనివర్సిటీ యూజీసీ గుర్తింపుతో
మనరాష్ట్ర పరిధిలో ఉండే లెక్చరర్, రీసెర్చ్ ఫెలోషిప్ ఉద్యోగాల
కోసం ఏపీసెట్ను నిర్వహిస్తోంది. యూజీసీ గురించి మరిన్ని వివరాలకు
http://ugcnetonline.in నూ, ఏపీసెట్ కోసం http://
www.apset.org వెబ్సైట్నూ చూడండి. ఈ రాతపరీక్ష ప్రభుత్వ
కళాశాలలో ఉద్యోగం సంపాదించడానికి కనీస అర్హతగా చెప్పుకోవచ్చు. ఇది
సాధించిన తర్వాత ఆయా ప్రభుత్వ ఎంబీఏ కళాశాలలవారు మేనేజ్మెంట్
సబ్జెక్టుల్లో ఖాళీల గురించి ప్రకటన చేసినపుడు దరఖాస్తు చేసుకుకోవాలి.
వారు నిర్వహించే రాత పరీక్షలు/ ఇతర ఇంటర్వ్యూలో నెగ్గితే
ఉద్యోగం లభిస్తుంది.
ఎంబీఏ (హెచ్ఆర్) చేసి ఉద్యోగం చేస్తున్నాను. ఉన్నత స్థాయికి
చేరడానికి హెచ్ఆర్కు సంబంధించిన ఏ కోర్సులు చేస్తే మేలు?
ఎంబీఏ చేయడం వల్ల ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఆపరేషన్స్ వంటి
వాటి గురించి అవగాహన తెచ్చుకోవడమే కానీ పూర్తి నైపుణ్యం సంపాదించలేము.
మీరు ఇదివరకే ఉద్యోగం చేయడం మొదలు పెట్టారు కాబట్టి కనీసం 2- 3
సంవత్సరాల్లో మీకు నియామకం, శిక్షణ, పారిశ్రామిక సంబంధాలు, చేంజ్
మేనేజ్మెంట్, ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్, పేరోల్/ కాంపెన్సేషన్/బెనిఫిట్స్,
స్టాట్యుటరీ కాంప్లియన్స్, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్/ హెచ్ఆర్ఐఎస్
వంటి వాటిలో ఏది ఎంచుకుంటే మీకు ఎదుగుదల ఉంటుందో గ్రహించవచ్చు. తద్వారా
ఎలాంటి కోర్సులు చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు.
ఉదాహరణకు హెచ్ఆర్ ఆటోమేషన్ కోసం ఒరాకిల్ హెచ్ఆర్ఎమ్ఎస్/
ఎస్ఏపీ- హెచ్ఆర్ వంటి కోర్సులు చేయడం, రిక్రూట్మెంట్ గురించి
www.asktheheadhunter.com ని అనుసరించడం. ఇదివరకే
మీరు మాస్టర్ డిగ్రీ చేశారు కాబట్టి డిప్లొమా/ దూరవిద్య
కోర్సులు చేయడం అంత లాభదాయకం కాదు. దీనికి బదులు http://
Quora.com వంటి ఫోరమ్ల ద్వారా నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు.
బీటెక్ (ఈసీఈ) 2013లో పూర్తిచేశాను. ఎంబీఏ చేయాలనుకుంటున్నాను.
మంచి ఉద్యోగావకాశాలుండే స్పెషలైజేషన్ వివరాలు తెలుపగలరు.
ఎంబీఏలో స్పెషలైజేషన్ తీసుకునేముందు అసలు ఎంబీఏ ఎందుకు చేయాలనుకుంటున్నారో
స్పష్టత ఉండాలి. ఈ కోర్సు చేయడం వల్ల ఉద్యోగావకాశాలు పెరిగే
అవకాశముంది. అంతేకానీ ఎంబీఏ డిగ్రీ పొందిన వెంటనే మంచి జీతంతో కూడిన
ఉద్యోగం సంపాదించవచ్చని ఊహించుకోకండి. అలా జరగాలంటే పరిశ్రమలో
తగిన అనుభవం సంపాదించుకోవాలి. కాబట్టి ముందుగా 2/3 సంవత్సరాల
అనుభవం తెచ్చుకుని ఆ తర్వాత ఆసక్తిని బట్టి ఎంబీఏ చేయాలా వద్దా,
ఎటువంటి స్పెషలైజేషన్ తీసుకోవాలి అనేవి నిర్ణయించుకోవచ్చు.
ఎంసీఏ 2009లో పూర్తిచేశాను. ఆర్థిక మాంద్యం కారణంగా నా వృత్తిని ఐటీ
నుంచి వేరే రంగానికి మార్చాను. ఇప్పుడు మళ్లీ ఐటీ రంగంలోకి
మారాలనుకుంటున్నాను. ఆ అవకాశముందా? కంపెనీలు ఫ్రెషర్లకే
అవకాశమిస్తాయని విన్నాను. అదెంతవరకు నిజం?
ఈ వ్యవధి కాలంలో మీరు పనిచేసిన రంగం గురించి వివరించి ఉంటే బాగుండేది.
ఏదేమైనా http://bit.ly/1lGEUBH చూస్తే ఈ 2014లో సంరక్షణ,
ఎఫ్ఎంసీజీ సహా ఐటీ రంగంలో 8.5 లక్షలకుపైగా కొత్త
ఉద్యోగాలు లభించనున్నాయనే అంచనా తెలుస్తుంది. అందుకని మళ్లీ ఐటీ
రంగంలో ఉద్యోగం కోసం నిశ్చింతగా ప్రయత్నించవచ్చు. ఏ కంపెనీ వారైనా
అభ్యర్థులను తీసుకునేముందు ముఖ్యంగా వారు ఏవిధంగా తమ
సంస్థకు లాభపడతారని పరిశీలిస్తారు.
మీరు ఫ్రెషర్ కాదనే విషయాన్ని మర్చిపోయి మొదట మీకు ఎందులో ఆసక్తి
ఉందో గ్రహించండి. దానికి సరిపడే డొమైన్ని, సంస్థలను ఎంచుకోండి.
ఉదాహరణకు మీకు ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్లో ఆసక్తి ఉంటే ముందుగా
ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి.
www.facebook.com/passion4career లో పొందుపరిచిన
ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ వంటి ఇవెంట్ల ద్వారా ఇతరులతోపాటు ప్రాజెక్ట్
చేస్తూ మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ఆరకంగా మీరు తయారుచేసిన
ఆండ్రాయిడ్ అప్లికేషన్ను గూగుల్ మార్కెట్లో అప్లోడ్ చేయండి. ఇక
ఉద్యోగం కోసం నైపుణ్యాలను కేవలం CVతోనే కాకుండా బ్లాగ్, ఇతర సోషల్
మీడియా లింక్స్ ద్వారా ప్రదర్శించండి. మీ ప్రాజెక్టులను సదరు కంపెనీ
టెక్నికల్ మేనేజర్లకు వివరించి ఉద్యోగ ప్రయత్నం చేయండి.
2010లో 80%తో ఎంసీఏ పూర్తిచేశాను. పెళ్లవడంతో ఉద్యోగంలో చేరలేదు.
ఇప్పుడు చేయాలనుకుంటున్నాను. కానీ ఫ్రెషర్గా చేయలేను. సలహా ఇవ్వండి.
మీకిప్పుడు రెండు దారులున్నాయి. మొదటిది మీరు ఏవైనా కంప్యూటర్
కోర్సులు చేయడం/ ఎంటెక్ చేయడం. ఎంటెక్ కోసం మీరు పీజీసెట్లో అర్హత
పొందాల్సి ఉంటుంది. రెండోది కోచింగ్ తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలకు/
బ్యాంకు ఉద్యోగాలకు ప్రయత్నించడం. ఒకవేళ కంప్యూటర్
కోర్సు చేయదలచుకుంటే ఏదైనా కళాశాలలో ప్రోగ్రామర్గా చేరడం కూడా మంచిది.
ఎంసీఏ 2011లో పూర్తిచేశాను. ప్రస్తుతం పూణేలో ఒక
ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నాను.
పార్ట్టైమ్/ దూరవిద్యలో ఎంబీఏ చేద్దామనుకుంటున్నాను.
ఏ సబ్జెక్టును ఎంచుకోవాలి? ఈ కోర్సును అందించే
విశ్వవిద్యాలయాల వివరాలు తెలుపగలరు.
ఉద్యోగం చేస్తూ ఎంబీఏ పార్ట్టైం చేయాలనుకునేవారు ఇన్స్టిట్యూట్ ఆఫ్
పబ్లిక్ ఎంటర్ప్రైజ్ www.ipeindia.org వారి ఎంబీఏ (పీఈ-
పార్ట్టైం ఈవెనింగ్) 3 సంవత్సరాల/ 6 సెమిస్టర్ల ప్రోగ్రాం;
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ( www.imt.edu ) వారి
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిప్లొమా (పీజీడీఎం- పార్ట్టైమ్) 3
సంవత్సరాల/ 9 టర్మ్స్; జేఎన్టీయూ (http://jntuh.ac.in/ )వారి
6 సెమిస్టర్ల పార్ట్టైం ఎంబీఏ ప్రోగ్రాం చేయవచ్చు. వీటికి డిగ్రీ
పూర్తిచేసి, సుమారు 2 సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉండి, ఐసెట్/
క్యాట్/ మాట్/ జీమాట్/ XATలో అర్హత సాధించి ఉండాలి. ఏఐసీటీఈ/
యూజీసీ వారి గుర్తింపు లేనివాటికి దూరంగా ఉండండి. మీరు కోర్సులో
చేరేముందు ఎంచుకున్న విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల
అభిప్రాయాలను తెలుసుకోండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు కాబట్టి ఐటీ/
సిస్టమ్స్కు సంబంధించిన సబ్జెక్టు తీసుకుంటే మంచిదే. లేదా హెచ్ఆర్,
మార్కెటింగ్, ఫైనాన్స్ల్లో మీ ఇష్టానికి తగ్గ సబ్జెక్టు ఎంచుకోండి.
బీటెక్ కంప్యూటర్ సైన్స్ తరువాత ఎంబీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్
కోర్సు జేఎన్టీయూ ద్వారా చేస్తున్నాను. ఈ కోర్సు ఉద్యోగావకాశాలు ఎలా
ఉంటాయి? ఎటువంటి కోర్సులు చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల్లో
ఉద్యోగం పొందవచ్చు?.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అంటే నెట్వర్క్ డెలివరీ సెంటర్ని భద్రంగా
కాపాడుకోవడం. నెట్వర్క్ సెక్యూరిటీని అర్థం చేసుకుని డేటా బ్యాక్అప్లో
నిపుణులైన వెరిటాస్ వంటి వాటితో పనిచేయండి. డేటా సెంటర్స్ భద్రత గురించి
ఈ www.cisco.com/web/learning/certifications/
index.html#~spec
వెబ్సైట్ను చూడండి. నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ వంటి
పుస్తకాల ద్వారా సొంతంగా నేర్చుకోండి. Akamai/ CtrlS వంటి కంపెనీలలో
మొదట మీ కెరియర్ని ఆరంభించండి. 2- 3 సంవత్సరాల అనుభవం వచ్చాక
కెరియర్లో ఎదుగుదలకు సిస్కో స్పెషలిస్ట్ సర్టిఫికేషన్ కోర్సులు చేయండి.
ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థిని.
చదువు పూర్తయ్యేటప్పటికి ఏ కోర్సులు నేర్చుకుంటే
ఉద్యోగ సాధనకు ఉపయోగమో తెలియజేయగలరు.
ఫలానా కోర్సు చేయడం అని కాకుండా ఇది పూర్తిగా మీ ఇష్టాన్ని బట్టి
ఉంటుంది. ఎంసీఏలో నచ్చిన సబ్జెక్టుపై ఎక్కువ దృష్టి సారించండి. అలాంటి
సబ్జెక్టు బ్యాంకింగ్, టెలికాం, ఐటీ, మాన్యుఫాక్చరింగ్, అగ్రికల్చర్,
ఫార్మసీ, ఇతర రంగాల్లో ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించాలో ఆలోచించండి.
ఏదైనా సరికొత్త పరిష్కారం కనుగొనే అప్లికేషన్ను సాఫ్ట్వేర్
తయారు చేయడానికి ప్రయత్నించండి. ఏదేమైనా కనీస ప్రోగ్రామింగ్
నైపుణ్యాల కోసం C, C++ల్లో పరిణతి సాధించాలి. coursera, ఇతర
వెబ్సైట్ల నుంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ని మెరుగుపరచుకోండి. మీ ఆసక్తిని
ఆనందించతగ్గ కెరియర్లా మార్చుకోవడానికి ప్రేరణ కలిగించే
www.facebook.com/passion4career ని అనుసరిస్తూ ఉండండి.
2012లో ఎంబీఏ పూర్తిచేశాను. లాజిస్టిక్స్ అండ్
సప్త్లె చైన్ మేనేజ్మెంట్ను కెరియర్గా
ఎంచుకోవాలనుకుంటున్నాను. వివరాలు తెలుపగలరు.
ఒకప్పుడు లాజిస్టిక్స్ అండ్ సప్త్లె చైన్ మేనేజ్మెంట్ అనేది ఖర్చుని పెంచే
డిపార్టుమెంటుగా భావించేవాళ్లు. కానీ ఇపుడు అదే విభాగం కంపెనీల్లో అయ్యే
ఖర్చును ఆదా చేయడానికీ, ఉత్పాదక శక్తిని మెరుగుపరచడానికీ ఎంతో
సహకరిస్తోంది. సప్త్లె చైన్ అనేది ఏదైనా ఉత్పత్తి తయారీలో అసెంబ్లీ
ప్లాంట్ నుంచి స్టోర్స్, డిస్పాచ్, డెలివరీ, డిస్ట్రిబ్యూటర్, హోల్సెల్లర్/
రిటైలర్ ఇలా చివరికి వినియోగదారులకు తీసుకెళ్తుంది.
మీరు ఎంబీఏలో ఎలాంటి స్పెషలైజేషన్ తీసుకున్నారో చెప్పలేదు. ఒకవేళ ఎంబీఏ
లాజిస్టిక్స్/ ఎస్సీఎంలో అయితే మీరు ఉద్యోగవేట మొదలుపెట్టవచ్చు.
చిన్న సంస్థల్లో కంటే మధ్యతరహా/ పెద్ద కంపెనీల్లో అవకాశాలు ఎక్కువగా
ఉంటాయి. ఉదాహరణకు: కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/ మేనేజర్,
సప్త్లె చైన్ కన్సల్టెంట్/ ఎనలిస్ట్, పర్చేజింగ్ మేనేజర్, లాజిస్టిక్స్
మేనేజర్, ట్రాన్స్పోర్టేషన్ మేనేజర్, వేర్హౌజ్ ఆపరేషన్స్ మేనేజర్,
సప్త్లె చైన్ సాఫ్ట్వేర్ మేనేజర్, ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ మేనేజర్ నుంచి
వైస్ ప్రెసిడెంట్ (ఎస్సీఎం) వంటి ఎన్నో హోదాలుంటాయి.
వివిధ కోర్సులు, వర్క్షాపుల కోసం http://
www.iimmbangalore.org/ Indian Institute of
Materials Management (IIMM) వారి వెబ్సైట్ని చూడండి.
2011లో ఎంసీఏ పూర్తిచేశాను. డాట్నెట్ కూడా చేశాను. ఓ ఇంజినీరింగ్ కళాశాలలో
ల్యాబ్ ప్రోగ్రామర్గా 18 నెలలు చేశాను. ఐటీ రంగంలో
ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. వివరాలు తెలుపగలరు.
మీకు ల్యాబ్ ప్రోగ్రామర్ అనుభవం ఉంది కాబట్టి ప్రోగ్రామింగ్, అకడమిక్
ప్రాజెక్టుల్లో అవగాహన ఉండి ఉంటుంది. ప్రోగ్రామింగ్
నైపుణ్యం మెరుగుపరచుకోవడానికి ఇంటర్న్షిప్లు చేయండి. ఉదాహరణకు
http:// bit.ly/18g2COG , http://bit.ly/15chMk2 ,
http://bit.ly/1aakNES వంటి వెబ్సైట్లలో మీకు నచ్చినవాటికీ
దరఖాస్తు చేయండి. వీళ్లు ప్రాజెక్టుతోపాటు స్త్టెపెండ్ కూడా అందజేస్తారు.
ఇలా ప్రాజెక్టు అనుభవానికి ల్యాబ్ ప్రోగ్రామర్ అనుభవం జత
చేస్తూ ఉద్యోగం సంపాదించవచ్చు.
ఎంబీఏ ఫైనాన్స్ చదువుతున్నాను. ఈ విభాగంలో ఉపాధి అవకాశాలను తెలపండి.
ఎంబీఏ (ఫైనాన్స్) చేసినవారికి ముఖ్యంగా కింది రంగాల్లో ఉపాధి
అవకాశాలుంటాయి.
కార్పొరేట్ ఫైనాన్స్: ఒక కంపెనీని నడపడానికి కావాల్సిన
డబ్బు కోసం మూలాధారాన్ని వెతకడం, లాభనష్టాలు; ఫైనాన్షియల్ రిస్క్,
వర్కింగ్ కాపిటల్, కాష్ ఫ్లో, మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ లాంటివి
చూసుకోవడం.
కమర్షియల్ బ్యాంకింగ్: ఈ రంగంలో రోజురోజుకీ ఉపాధి అవకాశాలు ప్రభుత్వ,
ప్రైవేటు బ్యాంకుల్లో పెరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకి టెల్లర్స్/
క్యాషియర్, లీజింగ్ ఏజెంట్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ఆఫీసర్స్, బ్రాంచి
మేనేజర్, లోన్ ఆఫీసర్, ట్రేడ్ క్రెడిట్ స్పెషలిస్ట్స్, క్రెడిట్ కార్డ్
బ్యాంకింగ్ స్పెషలిస్ట్స్.
ప్రైవేటు ఈక్విటీ వెంచర్ క్యాపిటల్: చిన్న కంపెనీలు, ఇతరత్రా
కంపెనీలకు క్యాపిటల్ మేనేజ్ చేయడం. ఇవి కాకుండా స్టాక్ బ్రోకింగ్,
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఫోరెక్స్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్,
ఇన్సూరెన్స్, కమోడిటీ ట్రేడింగ్ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు చాలా
ఉన్నాయి. కేవలం ఉద్యోగం పోర్టళ్ళపై ఆధారపడకుండా పైన తెలిపిన రంగానికి
సంబంధించిన కంపెనీలను లింకెడిన్ ద్వారా సంప్రదించండి.
ేను ఎంబీఏ (హెచ్ఆర్) చేయాలనుకుంటున్నాను. నాకు విదేశంలో
అడ్మినిస్ట్రేషన్లో 2 సంవత్సరాల అనుభవం ఉంది. ICET, CAT రాసే
సమయం లేదు.
రెండు సంవత్సరాల అనుభవంతో మీరు ఎంబీఏ చేయాలనుకోవడం మంచి నిర్ణయం.
కానీ కేవలం పేపర్ డిగ్రీ కోసం ఎంబీఏ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.
దూరవిద్య పద్ధతిలో చేయడానికి ఉస్మానియా యూనివర్శిటీ-
పీజీఆర్ఆర్సీడీఈ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఐజీఎన్ఓయూ)
వంటి వాటిలో మీరు ఎంబీఏ చేయవచ్చు. ఎంబీఏ చేసిన పలువురి
అభిప్రాయాలను www.pagalguy.com/news/tag/why-mba
సైట్ద్వారా తెలుసుకోండి.
ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాను. మేము ప్రాజెక్టు వర్క్
చేయబోతున్నాము. ఏ అంశంపై చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వగలరు.
ఎంబీఏ చేసే ప్రతి విద్యార్థీ మొదటి సంవత్సరంలో ఏదో ఒక కంపెనీని
సందర్శించాలి. విద్యార్థులకూ, పరిశ్రమకూ మధ్య ఉన్న దూరాన్ని
తగ్గించడమే ఈ ప్రాజెక్టుల/ఇంటర్న్షిప్ల ఉద్దేశం. ఈ
ప్రాజెక్టులకు మీరు ఎంచుకోబోయే స్పెషలైజేషన్లకు సంబంధం ఉండొచ్చు..
ఉండకపోవచ్చు. వర్కింగ్ కాపిటల్, అసెట్స్-లయబిలిటీస్, డిప్రిసియేషన్,
ఈక్విటీ అనాలసిస్, సేల్స్ ప్రమోషన్, పర్ఫార్మెన్స్ అప్రిసియేషన్,
ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ వంటివి కొన్ని ప్రధాన అంశాలు. ఇవి కంపెనీ
ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవడానికే కాక మీకూ ఓ అవగాహన
పెంచుకోవడానికి తోడ్పడతాయి.
ఎంబీఏ (ఫైనాన్స్) చదువుతున్నాను. నాకు రిజర్వు బాంకు ఆఫ్
ఇండియాలో పనిచేయాలని ఉంది. వివరాలు తెలపండి.
ఆర్బీఐ వారు అసిస్టెంట్స్, ఆఫీసర్స్ ఇలా పలు రకాల
పోస్టులకు ఎప్పటికపుడు ప్రకటన జారీ చేస్తూ ఉంటారు. మీరు http://
rbi.org.in/scripts/vaccancies.aspx లింక్లో నోటిఫికేషన్
వివరాలు పొందొచ్చు. జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్
ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఫైనాన్స్ వాటిపై పరీక్ష నిర్వహించి అందులో
అర్హత సాధించినవారిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకుంటారు. ముందుగా
ఆర్బీఐలో సమ్మర్ ప్లేస్మెంట్కు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ
లింక్ http://bit.ly/11Yg5VUని చూడండి.
ఎంబీఏ ఫైనాన్సు పూర్తిచేశాను. ఈ మధ్య SAP-FICO కూడా
నేర్చుకున్నాను. మా స్నేహితులు నన్ను కన్సల్టెన్సీలను సంప్రదించమని
సలహా ఇచ్చారు. కానీ ఎలాంటి ఫలితమూ లేదు.
చాలామంది ఎంబీఏ అయిన వెంటనే SAP/ Oracle ERP కోర్సులను ఏదో
ఒక ఇన్స్టిట్యూట్లో పూర్తిచేస్తే మంచి ఉద్యోగం సంపాదించొచ్చని
ఊహించుకుంటారు. కానీ ఎలాంటి అనుభవం లేకుండా ఈఆర్పీ
సాఫ్ట్వేర్లు అందరూ నేర్చుకుని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఇంకా
కొందరు నకిలీ అనుభవ ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగానికి ప్రయత్నిస్తారు.
ఇలాంటివి చేయకుండా ముందుగా మీకు నచ్చిన కంపెనీలో మీ స్పెషలైజేషన్కు తగిన
ఉద్యోగాన్ని 3 సంవత్సరాలు చేయండి. అలా చేస్తూనే ఈఆర్పీ సాఫ్ట్వేర్
కంపెనీల్లో ఎలా వాడుతారో, అలాంటి కంపెనీలు ఏవో తెలుసుకుని సంప్రదించండి.
మా అమ్మాయి ఎంబీఏ పూర్తి చేసింది. మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాలంటే
ఎటువంటి కంప్యూటర్ ప్రోగ్రాములు నేర్చుకోవాలి? హైదరాబాద్లో ఆయా
కోర్సులపై శిక్షణనిచ్చే సంస్థల వివరాలు తెలపండి.
విద్యార్థి ఎంబీఏలో చేసిన స్పెషలైజేషన్, ఏ రంగంపై ఆసక్తి ఉందో అనేవి
ఇలాంటి సందర్భంలో పరిగణనలోకి తీసుకోవాలి. ఎలాంటివారికైనా కనీసం కంప్యూటర్
ఆపరేట్ చేయడం, MS Office తెలిసి ఉండడం అవసరం. ఇక
ఫైనాన్సు వారికి Tally లాంటి అకౌంటింగ్ పాకేజెస్ అవసరం. పైన తెలిపిన విధంగా
చాలామంది ఎంబీఏ అయిన వెంటనే అనుభవం సంపాదించకుండానే SAP, ERP
Oracle కోర్సులు చేస్తుంటారు. పరిశ్రమలో అనుభవం లేకుండా ఇలాంటి
కోర్సులు చేయడం వృథా. ముందుగా Connect The Dots అనే పుస్తకాన్ని
చదవమని చెప్పండి. ఎలాంటి శిక్షణ లేకుండా తమ ప్రతిభను నమ్ముకుని
స్వతహాగా ఎంతోమంది ఎలా కెరియర్లో ఎదిగారో తెలుస్తుంది.
ఎంబీఏ ఫైనాన్స్ చదువుతున్నాను. నాకు సర్టిఫైడ్
ఫైనాన్షియల్ ప్లానర్ కావాలనివుంది. దీనికి సంబంధించిన కోర్సు, అవకాశాలు ఎలా
ఉంటాయో తెలుపగలరు.
దీనికి ముఖ్యంగా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, 3-5 సంవత్సరాల
అనుభవం అవసరం. నిజాయతీగా ఉండేవారు అర్హులు. ఫైనాన్షియల్ ప్లానింగ్
స్టాండర్డ్స్ బోర్డ్ ఇండియా అనే ప్రభుత్వ- ప్రైవేటు సంయుక్త సంస్థ
సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ లాంటి కోర్సులను నిర్వహిస్తోంది.
కోర్సు వివరాలకు www.fpsbindia.org/ వెబ్సైట్ చూడండి. దీనిద్వారా
దేశవిదేశాల్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల్లో అంతర్జాతీయ
ప్రమాణాలకు దీటుగా కెరియర్ మొదలుపెట్టవచ్చు.
నా ఎంసీఏ ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈ మధ్యే
పూర్తయ్యాయి. ఇప్పుడు చివరి సంవత్సరంలో ప్రాజెక్టు చేయాల్సి ఉంది.
ఎలాంటి కోర్సులు ఏ సంస్థలో చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వండి.
ప్రాజెక్టు వర్క్ ఎంత ఇష్టంతో చేస్తే అంత మంచి ఫలితం! మీ నిర్వహణ/
పనితనం బాగుంటే అదే కంపెనీలో మీరు ఉద్యోగం సంపాదించుకునే అవకాశం పుష్కలంగా
ఉంటుంది. ప్రాజెక్టును ఏదో శిక్షణసంస్థలో చేసి ఆ చక్కటి అవకాశాన్ని వృథా
చేసుకోకండి.
ఐఐటీ, ముంబాయిలో చదివి ప్రాజెక్టు/ఇంటర్న్షిప్ల కోసం చాలా కష్టపడిన
అనుభవంతో మొదలుపెట్టిన http://www.hellointern.com
వెబ్సైటును చూస్తే ఏ కంపెనీ వాళ్లు ఎలాంటి ప్రాజెక్టులు/
ఇంటర్న్షిప్లకు అవకాశం ఇస్తున్నారో తెలుస్తుంది. మీకు ఇష్టమైన
సబ్జెక్టుకు అవకాశం ఉంటే INKONIQ, IPintentio,
Knowlarityలాంటి చిన్నచిన్న లేదా ఎదుగుతున్న కంపెనీల్లో
ప్రాజెక్టు చేయడం చాలా మంచిది.
ఎంబీఏ ఫైనాన్స్ రెండో సంవత్సరం చదువుతున్నాను. స్టాక్
మార్కెట్పై ఆసక్తి. దీనికి తగ్గట్టుగా
నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవాలి?
స్టాక్ మార్కెట్పై http://www.stock-trading-
infocentre.com/లాంటి ఫోరమ్స్ లేదా బ్లాగుల ద్వారా ఉచితంగా మరిన్ని
విషయాలు తెలుసుకోవచ్చు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి (http://
www.nseindia.com/education/content/
education.htm), బాంబే స్టాక్ ఎక్స్చేంచి (http://
www.bseindia.com/#training)వాళ్లు స్టాక్ మార్కెట్లపై
వివిధ కోర్సులను నిర్వహిస్తున్నారు.
B.Tech. ECE 2012 లో పూర్తిచేశాను. నాకు MBAచేయాలని ఉంది.
చాలామంది Executive MBA చేయమని చెబుతున్నారు. నాకు తగిన
MBA ఎక్కడ, ఎప్పుడు చేయాలో చెప్పండి.
ఎంబీఏ చేసేముందు 2/3 సంవత్సరాలు మీకిష్టమయిన రంగంలో
అనుభవం తెచ్చుకోండి. ISB, IIM, Great Lakes, SP jain , XLRI
లాంటి ఇన్స్టిట్యూట్లలో Executive MBA చేయొచ్చు.
ఉద్యోగం చేస్తున్నవాళ్లకి 1 సంవత్సర కాలం ఉండే ప్రోగ్రాం మంచిది. ఇలా
చేస్తే మీరు సులభంగా ప్రశ్నలు వేసుకుంటూ, Debateచేస్తూ, ఇతరులతో వాళ్ల
అనుభవాలను academics కు అనుసంధానిస్తూ సరికొత్త
management conceptsని పరిపూర్ణంగా తెలుసుకోవచ్చు. http://
goo.gl/cly2n
ఎంసీఏ 2012లో పూర్తిచేశాను. ఇప్పటివరకూ ఐటీ కంపెనీల్లో చాలా
ఇంటర్వ్యూలకు వెళ్ళాను. కానీ ఇప్పటివరకూ ఉద్యోగం రాలేదు. ఫ్రెషర్గా
ఐటీ సంస్థలో ఎలా ఉద్యోగం సంపాదించాలో సలహా ఇవ్వండి.
కోర్సు పూర్తి చేశాక ఫ్రెషర్ అనే ఆలోచన ఉండకూడదు. కోర్సులో భాగంగా చేసిన,
ప్రాజెక్టు వర్కు లాంటి సదవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. బియటి
సంస్థల్లో కాకుండా పరిశ్రమలో చేసి, వాటిలో ఎలాంటి ప్రావీణ్యం రావాలో
తెలుసుకోవాలి. అలా చేసివుంటే తరగతి సిలబస్ మించి ఇంకా ఏమేం, ఎలా
నేర్చుకోవాలో తెలుస్తుంది. ఏ కంపెనీ అయినా ఎవర్ని తీసుకుంటే ఎలా
ఉపయోగపడతారని ఆలోచించి, ఎంపిక చేసుకుంటుంది. దీనికి
ముందు మీరు చేయాల్సింది ఒక అంశాన్ని (ఏరియా) ఎంచుకుని దానిపై మీ
నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం. కేవలం సి.వి.ని హెచ్ఆర్కి పంపటం వల్ల
ఉపయోగమేమీ ఉండదు. సోషల్ మీడియా సైట్స్లో మీ
ప్రొఫైల్ను ఆకర్షణీయంగా మల్చుకోండి. మీకు నచ్చిన సంస్థల గురించి
తెలుసుకోవడం ఇంటర్వ్యూకు సన్నద్ధం కావడంలో తొలి మెట్టు.
ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ఉన్నాను. తర్వాత ఎంబీఏ చేయాలనుకుంటున్నాను.
ఎంబీఏ మనదేశంలో చేస్తే మంచిదా? విదేశాల్లో మెరుగా?
ఇంజినీరింగ్లో ఇంటర్న్షిప్, ప్రాజెక్టులపై దృష్టిపెట్టండి. శిక్షణ సంస్థల్లో
కాకుండా మంచి స్టార్టప్ కంపెనీల్లో వీటిని చేస్తూ వివిధ
విషయాలు పరిశీలిస్తుండాలి. సాంకేతిక, నిర్వహణ సంబంధ
నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి. ఇంజినీరింగ్ తర్వాత రెండు మూడు సంవత్సరాల
అనుభవంతో ఎంబీఏ చేస్తే చాలా మంచిది. కేవలం థియరీ కాకుండా ప్రాక్టికల్గా
వాటిని ఎక్కడ, ఎలా వినియోగిస్తారో తెలుసుకుంటూ ఉండండి. ఎంబీఏ గురించి
మరికొన్ని విషయాలు తెలుసుకునేందుకు కింది వెబ్సైట్లో ఉన్న కథనాన్ని
చదవండి. http://goo.gl/pDGnM
నా బీఎస్సీ (ఎంపీసీఎస్) 2013లో పూర్తవుతుంది. దీని తర్వాత ఎంబీఏలో
చేరాలనుకుంటున్నాను. కానీ మ్యాథ్స్ వాళ్ళకు ఎంబీఏలోని సబ్జెక్టులు సరిగా
అర్థం కావనీ, ఉద్యోగం త్వరగా రాదనీ విన్నాను. నిజమేనా? ఒకవేళ ఎంబీఏ
చేస్తే ఏది చేయాలి?
మీరు విన్నది అపోహ మాత్రమే. అయితే ఎంబీఏ కేవలం డిగ్రీ కోసమే
కాకుండా మీ కెరియర్కు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి. ఇది పూర్తిగా మీ
ఆసక్తిపై ఆధారపడివుంటుంది. ఎంబీఏపై విభిన్న రకాల విశ్లేషణకూ, తమ
కెరియర్లో కొందరు ఎలా ఎంబీఏను వినియోగించుకుంటున్నారో ఈ లింకులో తెలుసుకోండి.
http://goo.gl/cly2n
ఎంసీఏ 2012లో పాసయ్యాను. ఐటీ కంపెనీల్లో చాలా
ఇంటర్వ్కూ వెళ్ళాను. కానీ ఎలాంటి ఫలితం లేదు. ఫ్రెషర్గా
ఐటీ కంపెనీల్లో ఎలా ఉద్యోగం సంపాదించాలో సూచించండి.
ఏదో ఒక ఉద్యోగం అని కాకుండా ఒక ఏరియాను ఎంచుకుని, దానిపై ధ్యాస
పెట్టండి. సీవీతో మాత్రమే కాకుండా మీరు ఎంచుకున్న దానిపై బ్లాగు రాస్తూ, ఆ
రంగంలో ఉండే అనుభవజ్ఞులూ, కంపెనీల కోసం లింక్డిన్ లాంటి సైట్ల ద్వారా
వెతకండి. వారితో నేరుగా అనుసంధానమై, మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించి,
వాళ్ళకు ఎలాంటి విలువను మీరు తీసుకురాగలుగుతారన్నది వివరించండి. ఈ
ప్రక్రియలో ఉద్యోగ సాధనకు దగ్గరవుతారు.
ఎంసీఏ ఐదో సెమిస్టర్ పూర్తిచేశాను.
ఇప్పుడు హైదరాబాద్లో ప్రాజెక్టు చేయడానికి మంచి
ఇన్స్టిట్యూట్ ఏదో సలహా ఇవ్వండి
ప్రాజెక్టు లేదా ఇంటర్న్షిప్ల కోసం శిక్షణ సంస్థల్లో చేరకండి. ఇలాంటి
'కాపీ- పేస్ట్' ప్రాజెక్టుల వల్ల మీకెలాంటి ఉపయోగమూ ఉండదు. ఏదైనా
స్టార్ట్అప్ లేదా ఎదుగుతున్న కంపెనీలో మీరు ఎంచుకున్న దానిపై
ప్రాజెక్టు కోసం ప్రయత్నించండి. http://
hyderabad.startupweekend.org/, http://
blog.internshala.com/ సైట్లలో మీకు కావలసిన వివరాలు చూడొచ్చు.
నేను ఇపుడు B.Tech. CSE 3వ
సంవత్సరం చేస్తున్నాను. నాకు Finance & Trading
రంగం ఇష్టం. అందుకే
MBAపరీక్షలకు సిద్ధమవుతున్నాను. ఎలా ఈ రంగంలో
మెరుగుపడాలో చెప్పండి.
మీరు http://in.groups. yahoo.com/group/
AlgorithmicTrading Jobs/ లాంటి గ్రూపులో చేరితే Finance &
Trading గురించి చాలా విజయాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు Estee
Advisers Pvt Ltd లాంటి కంపెనీల్లో ఉద్యోగం సంపాదించడానికి
ప్రయత్నించండి. మీరు ఇంకా దీనికి సంబంధించిన కోర్సులు చేయాలంటేhttp://
iomaorissa.ac.in/ongoingprojects.phpని చూసి
కోర్సు వివరాలు పొందండి.
MCA 2011లో పూర్తి చేశాను. కానీ MCAచేసినందుకు ఇపుడు చింతిస్తున్నాను.
ఎందుకంటే నాకు ప్రోగ్రామింగ్ అసలిష్టం లేదు. ఇప్పటికే 2 సంవత్సరాలు వృథా.
దయచేసి ఇపుడు ఏం చేయాలో సలహా ఇవ్వండి.
మీలా చాలామంది విద్యార్థులు కేవలం డిగ్రీ సర్టిఫికేట్ వల్ల జీవన
ప్రగతి ఉంటుంది అని నమ్ముతుంటారు.Connect The Dots by
Rashmi Bansal (http://goo.gl/ncJwp) అనే
పుస్తకం చదవండి. డిగ్రీ, సర్టిఫికేట్ ఎలాంటి CVలేకుండా ఎంతమంది వాళ్ళకి
నచ్చిన రంగంలో విజయాలు సాధిస్తున్నారో తెలుస్తుంది. ఇంతకుముందు చదివినదాని
గురించి ఆలోచిస్తూ మీకు నచ్చింది చేయడం మానకండి. మీ గమ్యస్థానాన్ని
ఒకే ప్రదేశానికి నిర్దేశించుకోవద్దు.Connect The Dots లో
చెప్పినట్టుగా ఒక కుర్రాడు గదులను శుభ్రపరచడం దగ్గర నుంచి పేరుతో
Dosa Plaza అనే 100 restaurantను స్థాపించి న్యూజీలాండ్ దాకా
విస్తరించడం చదివితే మీకే అర్థమవుతుంది.
No comments:
Post a Comment
Type here: