options for existing employees; more districts have to be formed after bifurcation - it leads to more vacancies in both the states. so more posts will be notified under group 1&2 in the near future.. Read below for more info.
(హైదరాబాద్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను పార్లమెంట్ ఆమోదించింది. ఇక
రాష్ట్రపతి ఉత్తర్వులే తరువాయి. అపాయింటెడ్ డే వచ్చిన తర్వాత
రెండు రాష్ట్రాల ఏర్పాటు జరిగిపోతుంది. దీంతో ఇక మిగిలిందల్లా...ఆయా
రాష్ట్రాల నవ నిర్మాణం. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం ఇందులో
కీలకమైనది. ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పక్కాగా
జరగాలంటే ముందు పరిపాలనా సౌలభ్యం తీసుకురావాల్సి ఉంటుందని
రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. తొలుత పెద్ద మండలాలు,
రెవెన్యూ డివిజన్లను విభజించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల్సి
ఉంటుందని, అప్పుడే ఏ ప్రాంతం అవసరాలు ఏమిటి? ఏ రంగంలో, ఏ ప్రాంతంలో
అభివృద్ధిపై మరింతగా దృష్టిపెట్టాలన్న స్పష్టత వ స్తుందని
రెవెన్యూ శాఖలో కీలక హోదాలో ఉన్న ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రాష్ట్ర
విభ జన ప్రక్రియ పూర్తయ్యాక...విధిగా జిల్లాల విభజన
చేపట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. జిల్లాల ఏర్పాటు అనేది ఆర్థికంగా
కొంత భారమైనా ...ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువచేస్తుందని
ఆయన చెబుతున్నారు.
జిల్లాల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ బాగా వెనుకబడి ఉందని చెప్పారు. నిజానికి
1984లో జిల్లాల ఏర్పాటు నిబంధనలు అమల్లోకి వచ్చాక కొత్త జిల్లాల
ఏర్పాటు జరగలేదు. కొత్త రెవెన్యూ డివిజన్లు,
జిల్లాలను ఏర్పాటు చేయాలని దశాబ్దకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నా
ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు. ప్రత్యేక రాష్ట్ర పోరాటాలు జరుగుతున్న
నేపధ్యంలో జిల్లాల విభజనకు అంగీకరిస్తే .. రాష్ట్ర విభజన డిమాండ్
మరింత తీవ్రమవుతుందని పాలకులు భావించారు. కొత్త జిల్లాలన్న మాటెత్తకుండా
చేశారు. ఇటీవలి కాలంలో మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా జిల్లాల
విభజన డిమాండ్ ముందుకు తీసుకొచ్చారు. ఆయన ఈ అంశంపై ప్రత్యేకంగా
అధ్యయనం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రాథమిక
దశలోనే ఆయన ఆశలపై నీళ్లుచల్లారు. జిల్లాల విభ జన సాధ్యంకాదని
తేల్చి చెప్పారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందుకొచ్చింది.
ఈ నేపధ్యంలో రెండు ప్రాంతాల్లోనూ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్,
మండలాల డిమాండ్లు ముందుకొస్తున్నాయి. కొత్త జిల్లాలపై ఇరు ప్రాంతాల
నేతలు ఇప్పటికే ప్రజలకు హామీలు ఇచ్చి ఉన్నారు. కొందరయితే ప్రతీ
పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
మరికొందరు నేతలు ఇప్పుడున్న పెద్ద జిల్లాలను రెండుగా విడగొట్టాలని
చెబుతున్నారు. నేతల డిమాండ్లు ఎలా ఉన్నా...అసలు జిల్లాల
ఏర్పాటుకు ప్రాతిపదిక ఏమిటి? జిల్లాల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి
ఎక్కడుందో పరిశీలిస్తే...
జనాభా ప్రాతిపదికన 40 ఉండాలి
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జనాభా 8.50 కోట్లపైమాటే. రాష్ట్రంలో 3 కోట్ల
జనాభా ఉన్నప్పుడు 23 జిల్లాలను ఏర్పాటు చేశారు. జనాభా పెరుగుదల ఒక్కటే
కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక కానప్పటికీ...పెద్ద రాష్ట్రాలతో
పోలిస్తే మన రాష్ట్రం ఈ అంశాన్ని ప్రత్యేక ఉద్యమ కోణంలో చూసి
ఏనాడూ పట్టించుకోలేదు. ఆరు కోట్ల జనాభా ఉన్న కర్ణాటకకు 30
జిల్లాలు ఉన్నాయి. 7.20 కోట్ల జనాభా ఉన్న తమిళనాడుకు 32, 20
కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో 75 జిల్లాలున్నాయి. జనాభా
ప్రాతిపదికన తీసుకుంటే ఇప్పుడు రెండు ప్రాంతాల్లో కలిపి 40 జిల్లాలు ఉండాలని
రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆదిలాబాద్,
విశాఖపట్టణం, మహబూబ్నగర్, నల్లగొండ, అనంతపురం, తూర్పుగోదావరి వంటి
జిల్లాల్లో కలెక్టర్ లేదా ఉన్నతాధికారి సగటున సంవత్సరంలో ఒక గ్రామాన్ని
సందర్శించలేని పరిస్థితి ఉంది. " జిల్లా కలెక్టర్లు సగటున ఏడాదికి
ఒక్కసారి కూడా మండల కేంద్రానికి వెళ్లలేని పరిస్థితి కొన్ని జిల్లాల్లో
ఉన్నది. పరిపాలనా ఒత్తిడి కారణంగా కలెక్టర్లు, ఉన్నతాధికారులు జిల్లా
కేంద్రం లేదా పెద్ద పట్టణాల్లో పర్యటనలకే పరిమితం అవుతున్నారు.
1984 నిబంధనల్లో కూడా జిల్లాల ఏర్పాటు, ప్రాతిపదిక ఏమిటన్నదానిలో
స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. ఒక పల్లెకు జిల్లా కేంద్రానికి 150
కిలోమీటర్ల దూరం ఉంటే ఎలా? '' అని ఉన్నతాధికారి ఒకరు ఆందోళన
వ్యక్తం చేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏమిటి ప్రాతిపదిక?
గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న ఆర్థిక
అసమానతలను దృష్టిలో పెట్టుకొని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల్సి
ఉంటుంది. 1984లో వచ్చిన జిల్లాల ఏర్పాటు నిబంధనల ప్రకారం కొత్త
జిల్లాల డిమాండ్లను పరిశీలించాలన్నా లేదా ఏర్పాటు చేయాల్సి వస్తే
ముందుగా ...ప్రాంతం, జనాభా, భూమిపై వచ్చే ఆదాయం, ఇతర ఆదాయాలు,
జిల్లాల విభజన వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాల పరిస్థితిని కూడా
పరిగణనలోకి తీసుకోవాలి. ఆ ప్రాంతం చారిత్రక నేపథ్యం, భౌగోళిక, అనుబంధం,
భౌతికపరమైన అంశాలు, సాధారణ ప్రయోజనాలు, సమస్యలు, సాంస్కృతిక
అనుబంధం, విద్యావసరాలు, మౌలిక సదుపాయాలు, ప్రాంతాల ఆర్థిక ప్రగతిని
పరిగణనలోకి తీసుకోవాలి. కొత్తగా ఏర్పడాలనుకుంటున్న లేదా
విడిపోవాలనుకుంటున్న ప్రాంతాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ
కార్యక్రమాల అమలును చూడాలి. పరిపాలనా సౌలభ్యం. ఉత్తమ
పాలనకు వీలు ఉంటుందా లేదా అన్నది నిశిత పరిశీలన చేయాలి. ఇక
అన్నింటికంటే ఆ ప్రాంతం ఆర్థిక ప్రయోజనాలు ఏమిటో పరిశీలన చేయాలి.
శేషాంధ్రప్రదేశ్లో..
- వెనుకబడ్డ ప్రాంతాలను కలిపి నల్లమల జిల్లాను ఏర్పాటు చేయాలన్న
ప్రతిపాదన ఇటీవల ముందుకొచ్చింది.
- గుంటూరు జిల్లా పల్నాడు, ప్రకాశం జిల్లా మార్కాపురంలను కలిపి నల్లమల
జిల్లాను ఏర్పాటు చేయాలని నేతలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి.
- తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ మండలాలతో కొత్తగా అల్లూరి
సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్నది.
- తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్
కూడా చాలాకాలంగా ఉంది.
- గుంటూరు జిల్లాను రెండుగా విభజించి.. పల్నాడు జిల్లాగా ఏర్పాటు చేయాలనే
డిమాండ్ ఉంది.
- పాలనా సౌలభ్యం కోసం కృష్ణా జిల్లాను రెండుగా విభజించాలని
అధికారులు సూచిస్తున్నారు. విజయవాడను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని
అంటున్నారు. ఇది ఆచరణ సాధ్యం కాకపోతే మచిలీపట్టణాన్ని జిల్లాగా
ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
- విశాఖ జిల్లాను రెండుగా విభజించి నర్సీపట్నం లేదా పాడేరు జిల్లాగా
ఏర్పాటుచేస్తే పాలనాపరంగా గిరిజనులకు మేలైన సేవలు అందుతాయని
అధికారులు పేర్కొంటున్నారు.
-పాలనా సౌలభ్యం కోసం రాయలసీమలో మరో
రెండు జిల్లాలు ఏర్పాటు చేయవచ్చని చెబుతున్నారు. అనంతపురం జిల్లా చాలా
పెద్దగా ఉన్నదని, మారుమూల ప్రాంతాలకు ప్రభుత్వ సేవలు అందడం లేదని
రెవెన్యూ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏ జిల్లాలోనూ 35 మండలాలకు మించి
ఉండవద్దని వారు సూచిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో 55పైనే మండలాలున్నాయి.
తెలంగాణలో..
- ఖమ్మం జిల్లాను రెండుగా విభజించి ఏజెన్సీ గ్రామాలతో భద్రాచలం జిల్లా
ఏర్పాటు చేయాలని ఆదివాసీ నేతలు కోరుతున్నారు.
- ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి గిరిజన ప్రాంతాలను విడదీసి
కొమురంభీమ్ పేరిట జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్నది.
- నల్లగొండ జిల్లాను రెండుగా విడగొట్టి సూర్యాపేటను జిల్లాగా
ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్నది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్
సూర్యాపేటను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
అయితే మిర్యాలగూడను కూడా జిల్లాగా ఏర్పాటు చేయాలన్న
డిమాండ్లు తాజాగా తెరమీదకు వస్తున్నాయి.
- రంగారెడ్డి జిల్లాను విడగొట్టి హైదరాబాద్లోని రెండు రెవెన్యూ డివిజన్లతో
కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉన్నది.
- హైదరాబాద్ను మూడు జిల్లాలుగా విభజించాలన్న డిమాండ్ ఉన్నది.
ప్రత్యేకంగా గోల్కొండ జిల్లా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన
ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
- ఇక వరంగల్ జిల్లా నుంచి జనగామ, ఏటూరు నాగారం డివిజన్లు కొత్త
జిల్లాల కోసం పోటీపడుతున్నాయి. అయితే జనగామకే ఎక్కువ
అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సమ్మక్క
సారక్కపేరుతోనూ జిల్లాను ఏర్పాటు చేస్తారనే ప్రచారం ఉంది.
- కరీంనగర్ జిల్లాలో జగిత్యాలను జిల్లాగా ప్రకటిస్తే పాలనా
సౌలభ్యం ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సిరిసిల్ల,
మెట్పల్లి వంటి ప్రాంతాలతో ఈ జిల్లా ఏర్పాటుకావచ్చని
అధికారులు చెబుతున్నారు.
- మెదక్ జిల్లాలో సంగారెడ్డిని, సిద్ధిపేటను జిల్లాలుగా
ఏర్పాటు చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. భౌగోళిక పరిస్థితుల రీత్యా
సిద్ధిపేటను జిల్లాగా చేయడానికే అనుకూలంగా ఉంటుందని
అధికారులు చెబుతున్నారు.
- మహబూబ్నగర్ జిల్లా నుంచి వనపర్తి, లేదా నాగర్
కర్నూలును విడగొట్టవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఎక్కువగా
వనపర్తికే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
No comments:
Post a Comment
Type here: