Meet Us Here

Pages

Monday, June 24, 2013

BILATERAL_CURRENTAFFAIRS_2013_TELUGU

 మే 2013 ద్వైపాక్షిక సంబంధాలు ::.

              
భారత్, చైనా మధ్య ఎనిమిది ఒప్పందాలు
చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్ భారత్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య మే 20న ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో ైైైద్వైపాక్షిక వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలు, జలవనరుల రంగంలో సహకారం, మాంసం, మత్స్య ఉత్పత్తుల వాణిజ్యంలో పరస్పర సహకారం, మురుగునీటి నిర్వహణలో సహకారం వంటివి ఉన్నాయి. మూడు రోజుల అధికార పర్యటనకు భారత్ వచ్చిన లీ కెకియాంగ్ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చర్చలు జరిపారు. సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత భూభాగంలోకి ఇటీవల చైనా చొరబాటు, బ్రహ్మపుత్ర నదిపై చైనా డ్యాముల నిర్మాణం వంటి పలు అంశాలపై కూడా ఇరుదేశాల నేతలు చర్చించారు.




మార్చి 2013 ద్వైపాక్షిక సంబంధాలు ::.

              
ఈజిప్టు అధ్యక్షుడి భారత్ పర్యటన
ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ భారత పర్యటనలో మార్చి 19న ఇరు దేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో సైబర్ భద్రతపై అవగాహ న పత్రం, ఈజిప్టులోని అల్ అజహర్ యూనివర్సిటీలో ఐటీ సెంటర్ ఏర్పాటు, మేథో సంపత్తి హక్కులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సహకారానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇదే పర్యటనలో ఈజిప్టు అధ్యక్షుడు మోర్సీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక, సైనిక, సాంస్కతిక, పర్యాటక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లడంపై ఇరు దేశాల నేతలు చర్చించారు.

రాష్ట్రపతి మారిషస్ పర్యటన
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజులపాట మారిషస్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రణబ్ పాల్గొన్నారు. ఆ దేశాధ్యక్షుడు రాజ్‌కేశ్వర్ పుర్యాగ్, ప్రధానమంత్రి నవీన్‌చంద్ర రామ్‌గూలమ్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వారితో చర్చించారు. అలాగే, మారిషస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ ప్రణబ్‌కు గౌరవ డిగ్రీ (డాక్టర్ ఆఫ్ సివిల్ లా)ని ప్రదానం చేసింది.

ద్వంద్వ పన్ను నివారణపై భారత్-భూటాన్ ఒప్పందం
ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందంపై భారత్-భూటాన్‌లు న్యూఢిల్లీలో మార్చి 4న సంతకాలు చేశాయి. ఆర్థిక మంత్రి చిదంబరం, భూటాన్ ఆర్థిక మంత్రి లింపో వాండే నోర్బూలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆదాయపు పన్ను ఎగవేతను, ద్వంద్వ పన్నులను ఈ ఒప్పందం నివారిస్తుంది. పన్ను వసూళ్లు, సమాచార మార్పిడి వీలవుతుంది. భూటాన్ ఇటువంటి ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి.


ఫిబ్రవరి 2013 ద్వైపాక్షిక సంబంధాలు ::.

              
బ్రిటన్ ప్రధాని భారత పర్యటన
బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ ఫిబ్రవరి 18 నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 19న భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపారు. పౌర అణు సహకార ఒప్పందంపై చర్చలు ప్రారంభించడం, ముంబై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ నిర్మాణంలో బ్రిటన్ తోడ్పాటు తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. అంతేకాకుండా 2015 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండింతలు చేయాలని కూడా ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి (ఇది 2011-12లో 16.25 బిలియన్ డాలర్లుగా ఉంది). ఇదే పర్యటనలో ఫిబ్రవరి 20న కామెరాన్ పంజాబ్‌లోని జలియన్‌వాలా బాగ్ (రౌలట్ చట్టాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 13, 1919న అమతసర్ స్వర్ణదేవాలయం పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన పంజాబీలపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపించాడు. ఇందులో 379 మంది చనిపోయారనీ బ్రిటిష్ ప్రభుత్వం , వేయి వరకు మతి చెందారని భారత జాతీయ కాంగ్రెస్ ప్రకటించాయి) ప్రాంతాన్ని, సిక్కుల పవిత్ర స్థలమైన స్వర్ణ దేవాలయాన్ని(గోల్డెన్ టెంపుల్) సందర్శించారు.

ముగిసిన భారత్ - ఫ్రాన్‌‌స చర్చలు
తక్కువ పరిధి ఉన్న ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణుల అభివద్ధిపై భారత్- ఫ్రాన్‌‌సల మధ్య ఫిబ్రవరి 14న చర్చలు ముగిశాయి. ఫ్రాన్‌‌స అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలాండే భారత పర్యటనలో భాగంగా భారత ప్రధాని మన్మోహన్‌సింగ్, ఫ్రాన్‌‌స అధ్యక్షుడు హాలాండేల మధ్య ఈ చర్చలు జరిగాయి. ఈ ఒప్పందం విలువ ’30 వేల కోట్ల వరకూ ఉంటుంది. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలు, రక్షణ ఒప్పందాలు, అణుసహకారం, ఉగ్రవాద నిరోధం, మాలీ లో పరిస్థితులు వంటి అనేక అంశాలపై చర్చలు జరిపారు. జైతాపూర్ అణు విద్యుత్ కేంద్రం ప్రగతిని కూడా సమీక్షించారు.

No comments:

Post a Comment

Type here: