ఈజిప్టు అధ్యక్షుడి భారత్ పర్యటన
ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ భారత పర్యటనలో మార్చి 19న ఇరు దేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో సైబర్ భద్రతపై అవగాహ న పత్రం, ఈజిప్టులోని అల్ అజహర్ యూనివర్సిటీలో ఐటీ సెంటర్ ఏర్పాటు, మేథో సంపత్తి హక్కులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సహకారానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇదే పర్యటనలో ఈజిప్టు అధ్యక్షుడు మోర్సీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక, సైనిక, సాంస్కతిక, పర్యాటక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లడంపై ఇరు దేశాల నేతలు చర్చించారు.
రాష్ట్రపతి మారిషస్ పర్యటన
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజులపాట మారిషస్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రణబ్ పాల్గొన్నారు. ఆ దేశాధ్యక్షుడు రాజ్‌కేశ్వర్ పుర్యాగ్, ప్రధానమంత్రి నవీన్‌చంద్ర రామ్‌గూలమ్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వారితో చర్చించారు. అలాగే, మారిషస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ ప్రణబ్‌కు గౌరవ డిగ్రీ (డాక్టర్ ఆఫ్ సివిల్ లా)ని ప్రదానం చేసింది.
ద్వంద్వ పన్ను నివారణపై భారత్-భూటాన్ ఒప్పందం
ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందంపై భారత్-భూటాన్‌లు న్యూఢిల్లీలో మార్చి 4న సంతకాలు చేశాయి. ఆర్థిక మంత్రి చిదంబరం, భూటాన్ ఆర్థిక మంత్రి లింపో వాండే నోర్బూలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆదాయపు పన్ను ఎగవేతను, ద్వంద్వ పన్నులను ఈ ఒప్పందం నివారిస్తుంది. పన్ను వసూళ్లు, సమాచార మార్పిడి వీలవుతుంది. భూటాన్ ఇటువంటి ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. |
No comments:
Post a Comment