జూన్ 2013 వ్యక్తులు ::. |
|
|
ది ఇండిపెండెంట్ ఎడిటర్‌గా భారత జాతీయుడు
బ్రిటన్ జాతీయ పత్రిక ది ఇండిపెండెంట్‌కు ఎడిటర్‌గా భారత జాతీయుడు నియమితులయ్యారు. ఇప్పటివరకు కామెంట్ ఎడిటర్‌గా ఉన్న రాజన్ ఇక నుంచి ది ఇండిపెండెంట్‌కు ఎడిటోరియల్ హెడ్‌గా వ్యవహరించనున్నారు. కోల్‌కతాలో జన్మించిన రాజన్ మూడేళ్ల ప్రాయంలో లండన్ చేరుకున్నారు. దక్షిణ లండన్‌లోని టూటింగ్‌లో పెరిగిన ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యం అభ్యసించారు. అనంతరం ఈవెనింగ్ స్టాండర్డ్, చానల్-5లలో కొం తకాలం పనిచేసి, రిపోర్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షునిగా జాన్ అషే
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (జనరల్ అసెంబ్లీ) 68వ సమావేశాలకు అధ్యక్షుడిగా జాన్ అషే ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో ఆంటిగ్వా, బార్బుడాల శాశ్వత రాయబారిగా ఉన్నారు. సాధారణ అసెంబ్లీ 68వ సమావేశాల్లో ఆయన ఈ పదవికి ఎన్నికయ్యారు. ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్య దేశాలతో కూడిన సాధారణ సభ అన్ని అంతర్జాతీయ అంశాలకు సంబంధించి బహుళ పక్ష చర్చలకు వేదికగా నిలుస్తుంది.
కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా కన్నుమూత
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి విద్యా చరణ్ శుక్లా (84) న్యూఢిల్లీలో జూన్ 11న మరణించారు. ఆయన మే 25న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో గాయపడ్డారు. వీసీ శుక్లా తొలిసారి 1957లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. తొమ్మిదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా వ్యవహరించారు. 1966లో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో సమాచార ప్రసారశాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత పీవీ నరసింహారావు మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాలు, జలవనరుల మంత్రిగా విధులు నిర్వర్తించారు.
తమిళ నటుడు మణివణ్ణన్ మృతి
ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మణివణ్ణన్ (59) జూన్ 15న చెన్నైలో మరణించారు. ఆయన 200కు పైగా చిత్రాల్లో నటించారు. 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన నటించిన అనేక చిత్రాలు తెలుగులోకి అనువాద చిత్రాలుగానూ, రీమేక్ చిత్రాలుగాను వచ్చాయి.
ఎల్‌ఐసీ చైర్మన్‌గా ఎస్‌కే రాయ్
జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) చైర్మన్‌గా ప్రస్తుతం మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న ఎస్‌కే రాయ్‌ని జూన్ 14న ప్రభుత్వం నియమించింది. చైర్మన్‌గా ఉన్న డీకే మెహ్రోత్రా పదవీకాలం మే 31న ముగియడంతో ఆయన స్థానంలో రాయ్ నియమితులయ్యారు. రాయ్ ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు.
హిందీ నటి జియాఖాన్ మృతి
హిందీ చలనచిత్ర నటి జియాఖాన్ (25) జూన్ 4న ముంబైలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లండన్‌లో పెరిగి ముంబైలో స్థిరపడిన జియాఖాన్ నిశ్శబ్ద్, గజిని, హౌస్‌ఫుల్ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆమె అసలు పేరు నఫీసా.
జె.వి.రాఘవులు కన్నుమూత
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు జెట్టి వీర రాఘవులు (83) జూన్ 7న రాజమండ్రిలో కన్నుమూశారు. తెలుగు, తమిళ, మరాఠీ భాషల్లో సుమారు 175 చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. అదేవిధంగా 100కు పైగా సినిమా పాటలు పాడారు. దర్శకుడు రుతుపర్ణో ఘోష్ మృతి
బెంగాలీ సినిమాను కొత్త పుంతలు తొక్కించిన ప్రముఖ సినీ దర్శకుడు రుతుపర్ణో ఘోష్ (49) కోల్‌కతాలో మే30న గుండెపోటుతో మరణించారు. ఆయన మహిళల సమస్యలను, కుటుంబ సంబంధాలను ఇతివత్తంగా తీసుకుని ఆలోచనాత్మక చిత్రాలు తీశారు. కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు. ఆయన బెంగాలీతోపాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో 19 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 12 జాతీయ అవార్డులతోపాటు కొన్ని అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. ఆయన తీసిన హీరేర ఆంగ్తీ, దహన్, చోఖేర్‌బాలి, చిత్రాంగద, రెయిన్‌కోట్ తదితర చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ప్రముఖ నిర్మాత రామానాయుడు బెంగాలీలో నిర్మించిన అశూక్ చిత్రానికి ఘోష్ దర్శకత్వం వహించారు.
డీఆర్‌డీవో డెరైక్టర్ జనరల్‌గా అవినాశ్ చందర్
రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డీఆర్‌డీవో) డెరైక్టర్ జనరల్‌గా, రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్రీయ సలహాదారుగా అవినాశ్ చందర్ మే 31న నియమితులయ్యారు. ఆయన రక్షణ పరిశోధన, అభివద్ధి శాఖకు కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తారు. డీఆర్‌డీవో చీఫ్‌గా ఉన్న వి.కె.సారస్వత్ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో అవినాశ్ చందర్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో పరిశోధన, అభివద్ధి (క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థలు) విభాగం చీఫ్ కంట్రోలర్‌గా ఉన్నారు. క్షిపణ శాస్త్రవేత్తగా ప్రఖ్యాతుడైన చందర్ అగ్ని ప్రోగ్రాం డెరైక్టర్‌గా అగ్ని దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. దేశం గర్వించదగ్గ ఖండాంతర క్షిపణి అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ఆయన సారథ్యంలోనే రూపుదిద్దుకుంది. డీఆర్‌డీవో చీఫ్ పదవి కోసం సుమారు పన్నెండుమంది శాస్త్రవేత్తలు పోటీపడగా కేబినెట్ కార్యదర్శి నేతత్వంలోని శాస్త్రవేత్తల బందం అవినాశ్ ను ఎంపిక చేసింది. ఆయనను ఇటీవల భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
మహిళా ఉద్యమకారిణి వీణా మజుందార్ మృతి
ప్రముఖ విద్యావేత్త, భారత మహిళా ఉద్యమకారిణి వీణా మజుందార్ (86) న్యూఢిల్లీలో మే 30న మరణించారు. పార్లమెంట్ తదితర చట్ట సభల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచేందుకు ఆమె పోరాడారు. భారత సామాజిక శాస్త్రాల పరిశోధక మండలి (ఐసీఎస్‌ఎస్‌ఆర్)లో జాతీయ పరిశోధక ప్రొఫెసర్‌గా ఆమె పనిచేశారు |
|
మే 2013 వ్యక్తులు ::. |
|
|
నూతన కాగ్ శశికాంత్ శర్మ
దేశ నూతన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గా రక్షణ శాఖ కార్యదర్శి, బీహార్ కేడర్‌కు చెందిన 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శశికాంత్ శర్మ (61) మే 23న పదవీబాధ్యతలు చేపట్టారు.
ఐదున్నరేళ్లపాటు కాగ్‌గా వ్యవహరించిన వినోద్‌రాయ్ మే 22న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో శర్మ నియమితులయ్యారు. గతంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో కార్యదర్శిగా, పదేళ్లపాటు రక్షణశాఖలో వివిధ హోదా ల్లో శర్మ పనిచేశారు. కాగ్‌ను ఆరేళ్ల పదవీకాలానికి లేదా ఈ పదవి చేపట్టే అధికారికి 65 ఏళ్లు నిండేవరకు వీటిలో ఏది ముందు పూర్తవుతుందో ఆ ప్రాతిపదికన నియమిస్తారు. శర్మ 2017 సెప్టెంబర్ 24వరకు పదవిలో కొనసాగుతారు.
నేషనల్ జియోగ్రఫిక్ బీ విజేతగా సాత్విక్ కర్ణిక్
భౌగోళిక అంశాలపై అమెరికాలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘నేషనల్ జియోగ్రఫిక్ బీ’ క్విజ్ పోటీలో సాత్విక్ కర్ణిక్ (12) అనే భారత సంతతి బాలుడు విజయకేతనం ఎగురవేశాడు. బహుమతి కింద సాత్విక్‌కు సుమారు రూ.14 లక్షలు కాలేజ్ స్కాలర్‌షిప్ అందనుంది. మే 22న వాషింగ్టన్‌లో నిర్వహించిన ఫైనల్ పోటీకి 10 మంది ఎంపికకాగా వారిలో 8 మంది భారతీయ అమెరికన్‌లే ఉండటం విశేషం. సాత్విక్ ఫైనల్ పోటీలో ఐదు ప్రశ్నలకూ సరైన సమాధానాలిచ్చాడు. భూ కేంద్రానికి దూరంగా ఉన్న ప్రాంతమేది? అనే చివరి ప్రశ్నకు ఈక్వెడార్‌లోని చింబొరాజో పర్వతం అని సరైన జవాబు చెప్పి విజేతగా నిలిచాడు.
అమెరికా ఫెడరల్ కోర్టు జడ్జిగా శ్రీకాంత్ శ్రీనివాసన్
ప్రవాస భారతీయుడు శ్రీకాంత్ శ్రీనివాసన్ (46) డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలోని అమెరికా ఫెడరల్ అప్పీళ్ల కోర్టుకు జడ్జిగా ఎన్నికయ్యారు. మే 23న అమెరికన్ సెనేట్ 97-0 ఓట్లతో శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ కోర్టు అమెరికా సుప్రీంకోర్టు తర్వాత అత్యున్నత కోర్టు. ఈ పదవికి ఎంపికైన తొలి దక్షిణాసియా వ్యక్తి శ్రీనివాసన్. ఈయన చండీగఢ్‌లో జన్మించారు. ప్రస్తుతం అమెరికాలో ప్రిన్సిపల్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా ఉన్నారు.
గాయకుడు టి.ఎం. సౌందరరాజన్ మృతి
ప్రముఖ గాయకుడు టి.ఎం.సౌందర్‌రాజ్ (91) మే25న చెన్నైలో మరణించారు. తమిళం, తెలుగు తదితర భాషల్లో 10 వేలకు పైగా పాటలు పాడారు. 2003లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. తమిళనాడు ప్రభుత్వం కలైమామాణి అవార్డుతో ఆయనను సత్కరించింది.
కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ ఎక్కిన అరుణిమ
ప్రపంచంలోనే అత్యంత ఎతైతన ఎవరెస్ట్‌ను కృత్రిమ కాలుతో అధిరోహించిన తొలి భారతీయ వనితగా వాలీబాల్ మాజీ క్రీడాకారిణి అరుణిమ సిన్హా (25)రికార్డు సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరుణిమ మే 22న ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకుంది. ఆమె ఉత్తర కాశీలోని టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్‌లో బచేంద్రిపాల్ వద్ద శిక్షణ పొందారు. రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా రసూల్‌ఖాన్
ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా హైదరాబాద్‌కు చెంది న అబిద్ రసూల్‌ఖాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వైస్ చైర్మన్‌గా డాక్టర్ పెరుమాళ్లపల్లి నేతాజీ సుభాష్ చంద్రబోస్ (గుంటూరు) నియమితులయ్యారు. సభ్యులుగా సయ్యద్ మఖ్బూల్ హుస్సేన్ బాషా (వైఎస్సార్ జిల్లా), డాక్టర్ హసన్ ఖురాతులేన్ (హైదరాబాద్), ప్రభా ఎలిజబెత్ జోసెఫ్ (తూర్పుగోదావరి), సర్దార్ సర్జీత్‌సింగ్ (రంగారెడ్డి), గౌతమ్‌జైన్ (హైదరాబాద్)లను నియమించినట్లు మే 16న ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ కమిషన్ మూడేళ్లపాటు పనిచేస్తుంది.
అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నిర్భయ్‌శర్మ
అరుణాచల్‌ప్రదేశ్ నూతన గవర్నర్‌గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ నిర్భయ్‌శర్మ మే 16న నియమితులయ్యారు. ఈ నియామకాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదించారు. 65 ఏళ్ల నిర్భయ్‌శర్మ భారత సైన్యంలో వివిధ కీలక హోదాల్లో 40 ఏళ్లపాటు సేవలందించారు. డబ్ల్యూటీవో డెరైక్టర్ జనరల్‌గా రాబెర్టో అజెవెడో
బ్రెజిల్‌కు చెందిన రాబెర్టో అజెవెడో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) డెరైక్టర్ జనరల్‌గా మే 8న నియమితులయ్యారు. అజెవెడో 2008 నుంచి డబ్ల్యూటీవోలో బ్రెజిల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత డెరైక్టర్ జనరల్ పాస్కల్ లామీ (ఫ్రాన్స్) స్థానంలో అజెవెడో బాధ్యతలు చేపడతారు. డబ్ల్యూటీవో 1995, జనవరి 1న ఏర్పడింది. స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తోంది. ఇందులో 159 దేశాలకు సభ్యత్వముంది.
కెనడాలో సాంస్కతిక రాయబారిగా యార్లగడ్డ
కెనడాలో భారత సాంస్కతిక రాయబారిగా రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, రాష్ట్ర హిందీ అకాడమీ ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్యవహరించనున్నారు. కెనడా భారత రాయబార కార్యాలయంలో అంతర్భాగంగా పనిచేసే సాంస్కతిక కేంద్రానికి డెరైక్టర్‌గా యార్లగడ్డ వ్యవహరిస్తారు. ఆయనకు విదేశీవ్యవహారాల శాఖ నియమావళికి అనుగుణంగా దౌత్య ప్రతిపత్తి హోదాను కల్పిస్తారు. యార్లగడ్డ మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.
టాప్-100 వైద్య నిపుణుల్లో ఎంఎస్ గౌడ్
ప్రపంచంలో టాప్-100 ప్రతిభావంతులైన వైద్య నిపుణుల జాబితాలో రాష్ట్రానికి చెందిన ప్రముఖ దంత వైద్యుడు ఎంఎస్ గౌడ్‌కు చోటు లభించింది. భారత్ నుంచి జాబితాలో ఆయన ఒక్కరికే స్థానం దక్కింది. ఇంగ్లండ్‌లోని ‘కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ బయోగ్రఫికల్ సెంటర్’ ఏటా ఈ జాబితాను విడుదల చేస్తుంది. మెదక్ పట్టణానికి చెందిన ఎంఎస్ గౌడ్ దాదాపు 40 ఏళ్లుగా దంత వైద్య సేవలు అందిస్తున్నారు. ఆర్మీ వైద్య కళాశాలకు ప్రిన్సిపల్‌గా కూడా పనిచేశారు. దంత వైద్యానికి సంబంధించి రాష్ట్రంలో కాస్మెటిక్ చికిత్స వంటి అత్యాధునిక విధానాలను తొలిసారిగా ప్రవేశపెట్టింది ఆయనే.
ప్రధాన కార్యదర్శిగా పి.కె. మహంతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మిన్నీ మాథ్యూ స్థానంలో 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రసన్న కుమార్ మహంతి ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించారు. 2014 ఫిబ్రవరి వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుతం ఆయన భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఎ)గా ఉన్నారు.
ఆర్‌సీఐ డెరైక్టర్‌గా సతీష్ రెడ్డి
రీసెర్‌చ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) డెరైక్టర్‌గా జి. సతీష్‌రెడ్డి మే 4న బాధ్యతలు చేపట్టారు. రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)కు చెందిన ప్రధాన మిసైల్ లేబొరేటరీ ఆర్‌సీఐ. నావిగేషన్ సైంటిస్ట్ సతీష్‌రెడ్డి 1986లో డీఆర్‌డీఓలో చేరారు. ఆర్‌సీఐను ఏర్పాటు చేసినప్పటి నుంచి సతీష్ అందులో పనిచేస్తున్నారు. |
|
ఏప్రిల్ 2013 వ్యక్తులు ::. |
|
|
ఏడీబీ అధ్యక్షునిగా తకిహితో నకావో
ఆసియా అభివద్ధి బ్యాంకు (ఏడీబీ) తొమ్మిదో అధ్యక్షునిగా జపాన్ ఆర్థిక శాఖ మాజీ ఉపమంత్రి తకిహితో నకావో (57) ఎన్నికయ్యారు. రాజీనామా చేసిన హరుహికో కురోడా స్థానంలో నకావో ఎన్నికైనట్లు ఫిలిపైన్‌స కేంద్రంగా పనిచేస్తున్న ఏడీబీ ఏప్రిల్ 26న ప్రకటించింది. 2016 నవంబర్ వరకు నకావో ఈ పదవిలో కొనసాగుతారు.
శైలేంద్రనాథ్ రాయ్ మృతి
గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన శైలేంద్రనాథ్ రాయ్ (45) మరో సాహస విన్యాసం చేస్తూ ఏప్రిల్ 28న మరణించారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి సమీపంలో తీస్తా నదిపై తాడుతో విన్యాసం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 70 అడుగుల ఎత్తులో 600 అడుగుల పొడవైన తీగ చక్రానికి జుట్టు పిలకను కట్టి ముందుకు కదిలాడు. మధ్యలో గుండెపోటుతో మరణించాడు. 2011లో రాజస్థాన్‌లో తీగకు జుట్టు పిలకను కట్టి వేలాడుతూ 82.5 మీటర్ల దూరం కదిలి గిన్సిస్ రికార్డు సష్టించాడు.
ఎడిటర్‌స గిల్డ్ అధ్యక్షునిగా ఎన్.రవి
‘ద హిందూ’ ఆంగ్ల దినపత్రిక మాజీ సంపాదకులు ఎన్. రవి ఎడిటర్‌స గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఇంతవరకూ ఈ పదవిలో బిజినెస్ స్టాండర్‌డ చైర్మన్ టి.ఎన్. నైనన్ ఉన్నారు.
గాయని శంషాద్ బేగం మృతి
తొలితరం సినీ నేపథ్యగాయని శంషాద్ బేగం (94) ముంబై లో ఏప్రిల్ 24న మరణించారు. 1941లో ఆమె తొలిసారి ‘కజాంచి’ చిత్రంలో పాటలు పాడారు. హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తమిళ్, పంజాబీ భాషల్లో వందలాది పాటలు పాడారు. 1945-55 మధ్య కాలంలో హిందీ చిత్రాల్లో ప్రధాన గాయనిగా కొనసాగారు. 2009లో ఆమెను పద్మభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది.
ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి అశోక్
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త అశోక్ కుమార్ ముఖర్జీ ఏప్రిల్ 17న బాధ్యతలు స్వీకరించారు.
జస్టిస్ జె.ఎస్. వర్మ మృతి
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ శరణ్ (జె.ఎస్.) వర్మ (80) అనారోగ్యంతో న్యూఢిల్లీలో మరణించారు. అత్యాచార నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకు కేంద్రం జస్టిస్ వర్మ నేతత్వంలో కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సులకనుగుణంగానే నేర న్యాయ సవరణ చట్టం -2013 రూపొందించారు. వర్మ 1933 జనవరి 18న మధ్యప్రదేశ్‌లో జన్మించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1997 మార్చి 25 నుంచి 1998 జనవరి 18 వరకు బాధ్యతలు నిర్వర్తించారు.
సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డీజీగా అరుణా బహుగుణ
సీఆర్‌పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) స్పెషల్ డెరైక్టర్ జనరల్‌గా ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి అరుణా బహుగుణ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఏప్రిల్ 18న ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ఈ పదవిలో నియమితులైన తొలి మహిళా అధికారిగా అరుణ గుర్తింపు తెచ్చుకున్నారు.
గణిత మేధావి శకుంతలా దేవి కన్నుమూత
ప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావి, హ్యూమన్ కంప్యూటర్‌గా గుర్తింపు పొందిన శకుంతలాదేవి (80) ఏప్రిల్ 21న బెంగళూరులో మరణించారు. శకుంతలాదేవి 1939 నవంబర్ 4న బెంగళూరులో జన్మించారు. 1977లో అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 188138517 సంఖ్యకు క్యూబ్ రూట్ చెప్పడంలో కంప్యూటర్‌తో పోటీపడి మరీ గెలుపొందారు. దీంతో అప్పటి నుంచి హ్యూమన్ కంప్యూటర్‌గా ఆమె పేరు గాంచారు. జ్యోతిష్కురాలిగా, న్యూమరాలజిస్ట్‌గా, రచయిత్రిగా కూడా ప్రసిద్ధి చెందారు. ‘ఫన్ విత్ నంబర్స్’, ‘ఆస్ట్రాలజీ ఫర్ యూ’, ‘పజిల్స్ టు పజిల్ యూ’, ‘మ్యాథబ్లిట్’ వంటి పలు పుస్తకాలు రాశారు.
వి.ఎస్. రమాదేవి మృతి
కర్ణాటక మాజీ గవర్నర్ వి.ఎస్. రమాదేవి (78) ఏప్రిల్17న బెంగళూరులో మరణించారు. రమాదేవి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా 1990లో టీఎన్ శేషన్ కంటే ముందు నవంబర్ 26 నుంచి 1990 డిసెంబర్ 11 వరకు పని చేశారు. తద్వారా ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. 1997 నుంచి 1999వరకూ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, 1999 నుంచి 2002 వరకు కర్ణాటక గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా, కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా కూడా ఆమె సేవలందించారు. రమాదేవి 1934 మార్చి 15న జన్మించారు.
ఐఐసీటీ డెరైక్టర్‌గా లక్ష్మీకాంతం
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డెరైక్టర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్ష్మీ కాంతం ఏప్రిల్ 9న నియమితులయ్యారు. ఈ సంస్థకు ఆమె తొలి మహిళా డెరైక్టర్. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఐసీటీ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) కింద పని చేస్తున్న 37 పరిశోధన కేంద్రాల్లో ఒకటి.
నాస్కామ్ చైర్మన్‌గా కష్ణ కుమార్
2013-14 సంవత్సరానికి నాస్కామ్ (ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) చైర్మన్‌గా మైండ్ ట్రీ సీఈఓ కష్ణ కుమార్ నటరాజన్, వైస్ ప్రెసిడెంట్‌గా ఆర్. చంద్రశేఖరన్ (కాగ్నిజెంట్) నియమితులయ్యారు.
ఏఎఫ్‌పీపీడీ చైర్మన్‌గా కురియన్
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ప్రతిష్టాత్మక ఏషియన్ ఫోరమ్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఏఎఫ్‌పీపీడీ) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. బ్యాంకాక్‌లో ఏప్రిల్ 11న జరిగిన ఏఎఫ్‌పీపీడీ 73వ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఏఎఫ్‌పీపీడీని 1981లో స్థాపించారు. కురియన్ ప్రస్తుతం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
జస్టిస్ చిన్నపరెడ్డి మృతి
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, రాజ్యాంగ నిపుణులు జస్టిస్ ఒ.చిన్నపరెడ్డి(91) హైదరాబాద్‌లో ఏప్రిల్ 13న మరణించారు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఆయన 1967లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 1978లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1987లో పదవీ విరమణ చేశారు. మానవ హక్కులకు సంబంధించి కీలక తీర్పులిచ్చారు. ఆయన రాసిన ‘ది కోర్ట్ అండ్ ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది.
ఆర్.పి. గోయెంకా మృతి
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్.పి.జి గ్రూప్ వ్యవస్థాపకులు రామ్‌ప్రసాద్ గోయెంకా (83) ఏప్రిల్ 14న కోల్‌కతాలో మరణించారు. ఆయన 1979లో ఆర్‌పీజీ ఎంటర్ ప్రెజెస్‌ను ఏర్పాటు చేశారు. 1980లో గోయెంకా అనేక కంపెనీలను కొనుగోలు చేశారు. ఆయన సంస్థల టర్నోవర్ దాదాపు రూ. 30 వేల కోట్లు. గోయెంకా 2000 -2006 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు.
గాయకుడు పీబీ శ్రీనివాస్ మృతి
ప్రముఖ గాయకుడు పి.బి. శ్రీనివాస్ (82) చెన్నైలో ఏప్రిల్ 14న మరణించారు. కాకినాడకు చెందిన ఆయన ఏడు భాషల్లో 3000పైగా పాటలు పాడారు. 1952లో ‘మిస్టర్ సంపత్’ అనే హిందీ చిత్రంలో తొలిసారి పాటలు పాడారు. తెలుగులో ఆయన పాడిన తొలిచిత్రం ‘జాతక ఫలం’. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, సంస్కతంలో ప్రావీణ్యం సంపాదించారు. అనేక కవితలు గజల్స్ రాశారు. తమిళనాడు ప్రభుత్వ పురస్కారం కళైమామణి, వొకేషనల్ ఎక్స్‌లెన్సీ, విద్వత్ శిరోమణి పురస్కారాలతో సహా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఆయన పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస్.
హిలరీ కోప్రొవ్స్కీ మృతి
పోలియోకు తొలిసారి ఓరల్ వ్యాక్సిన్ విజయవంతంగా రూపొందించిన పోలెండ్‌కు చెందిన డాక్టర్ హిలరీ కోప్రొవ్స్కీ(96)ఏప్రిల్ 11న ఫిల్‌డెల్ఫియాలో మరణించారు. 1950లో కోప్రోవిస్కీ పోలియో వ్యాక్సిన్‌ను తయారు చేశారు.
రాబర్ట్ ఎడ్వర్డ్స్ మృతి
బ్రిటన్ శాస్త్రవేత్త, టెస్ట్‌ట్యూబ్ బేబీ సష్టికర్త రాబర్ట్ ఎడ్వర్డ్స్(87) ఏప్రిల్ 10న లండన్‌లో మరణించారు. 1978లో మరో శాస్త్రవేత్త డాక్టర్ పాట్రిక్ స్టెప్ట్యూతో కలిసి టెస్ట్‌ట్యూబ్ బేబీ ‘లూయిస్ బ్రౌన్’ను సష్టించారు. ప్రస్తుతం ఐదు మిలియన్లకు పైగా కుటుంబాలు ఈ విధానాన్ని అనుసరించి సంతానం పొందాయి. టెస్ట్‌ట్యూబ్ బేబీని సష్టించే ఇన్ విట్రో ఫైర్టిలైజేషన్(ఐవీఎఫ్) విధానాన్ని కనుగొన్నందుకు 2010లో ఆయనకు నోబెల్ అవార్డు లభించింది.
ప్రపంచాన్ని చుట్టి వచ్చిన అభిలాష్
లెఫ్ట్‌నెంట్ కమాండర్ అభిలాష్ టోమీ 150 రోజులు ఆగకుండా సముద్రంలో ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలో ‘ఐఎస్‌ఎస్‌వీ మహదీ’ లో సాగర్ పరిక్రమ్-2 పేరుతో ముంబై నుంచి 2012 నవంబర్ 1న తన యాత్ర ప్రారంభించిన టోమీ.. హిందూ, దక్షిణ, ఫసిఫిక్ అట్లాంటిక్ సముద్రాల్లో ఆగకుండా 22,000 నాటికల్ మైళ్లు ప్రయాణించి ఈ ఏడాది ఏప్రిల్ 6న ముంబై చేరుకున్నాడు. భారత్‌కు చెందిన వారు యాత్రను చేయనప్పటికీ విదేశాలకు చెందిన 80 మంది ఇటువంటి యాత్రను చేశారు.
బ్రిటన్ మాజీ ప్రధాని థాచ ర్ మృతి
బ్రిటన్ తొలి మహిళా ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్(87) ఏప్రిల్ 8న లండన్‌లో మరణించారు. ఉక్కు మహిళగా పేరుగాంచిన ఆమె 20వ శతాబ్దాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకరుగా నిలిచారు. కన్సర్వేటివ్ పార్టీ నాయకురాలైన మార్గరెట్ 1979 నుంచి 1990 వరకు మూడు సార్లు బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు. బ్రిటన్ ప్రధానిగా సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తిగా ఆమె నిలిచింది. సోవియట్ యూనియన్ అణచివేత విధానాలను వ్యతికేకిస్తూ 1976లో ఆమె ఉపన్యాసం చేశారు. దాంతో రష్యాపత్రిక ఆమెను ఉక్కు మహిళగా అభివర్ణించింది.
రచయిత్రి రూత్ ప్రవెర్ మృతి
ప్రఖ్యాత స్క్రిప్ట్, నవలా రచయిత్రి రూత్ ప్రవెర్ ఝూబ్‌వాలా (85) అనారోగ్యంతో మన్‌హట్టన్‌లో ఏప్రిల్ 3న మరణించారు. ఆస్కార్, బుకర్ ప్రెజ్‌లు రెండూ గెలుచుకున్న ఒకే ఒక వ్యక్తి రూత్ ప్రవెర్. రూత్ 25ఏళ్లపాటు ఢిల్లీలో జీవించారు. జర్మనీలో పుట్టిన ఆమె భారతీయ పార్సీ ఆర్కిటెక్ట్ సైరస్ హెచ్ ఝూబ్‌వాలాను వివాహమాడారు. 19 నవలలు రాసిన ఆమె సినిమా రచయిత్రిగా కూడా పనిచేశారు. ఆమె పనిచేసిన ‘ఏ రూత్ విత్ ఎ వ్యూ’, ‘హార్ట్స్ ఎండ్’ చిత్రాలకు ఆస్కార్ అవార్డులు లభించాయి. ఆమె ‘హీట్ అండ్ డస్ట్’ నవలా రచనకు బుకర్ ప్రెజ్ పొందారు. |
|
|
మార్చి 2013 వ్యక్తులు ::. |
|
|
రష్యా విద్యావేత్త మతి
రష్యా విద్యావేత్త, భారత్ -రష్యా సైన్స్ అండ్ టెక్నాలజీ సహకార కార్యక్రమ రూపకర్త గురీ మార్చుక్(87) మాస్కోలో 2013 మార్చి 25న మరణించారు. మార్చుక్ రష్యా ప్రముఖ భౌతిక, గణిత శాస్త్రవేత్త. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ, సోవియట్ నాయకుడు మిఖయిల్ గోర్బచేవ్ చొరవతో 1987లో భారత్, రష్యాల మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీలో సమగ్ర దీర్ఘకాలిక కార్యక్రమం (ఐఎల్‌టీపీ) రూపకల్పనలో మార్చుక్ కషి చేశారు.
ఎన్‌ఎస్‌ఈ ఎండీగా చిత్రా రామకష్ణ
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ) నూతన ఎండీ, సీఈవోగా చిత్రా రామకష్ణ 2013 ఏప్రిల్ 1న బాధ్యతలు స్వీకరించారు. 20 ఏళ్ల చరిత్రగల ఎన్‌ఎస్‌ఈకి ఆమె మూడో ఎండీ. రవీ నారాయణ్ స్థానంలో చిత్రా నియమితులయ్యారు.
శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్లో యు. ఆర్. రావు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ చైర్మన్ ప్రొఫెసర్ యు.ఆర్.రావు కు అంతర్జాతీయ ఉపగ్రహ నిపుణుల సొసైటీ ‘శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం లభించింది. వాషింగ్టన్‌లో 2013 మార్చి 19న ఆయనకు ఈ గౌరవం కల్పించారు. అర్థర్ సి. క్లార్క్‌తో పాటు మరో 49 మంది సరసన రావుకు స్థానం లభించింది. డాక్టర్ రావు స్పేస్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా, పదేళ్లు ఇస్రో చైర్మన్‌గా (1984-94) పనిచేశారు. 1975లో చేపట్టిన భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట మొదలుకొని 20కిపైగా ఉపగ్రహాల రూపకల్పన, ప్రయోగాలు ఆయన మార్గదర్శకత్వంలోనే జరిగాయి.
మేఘాలయ ప్రధాన న్యాయమూర్తిగా మీనా కుమారి
నూతనంగా ఏర్పాటు చేసిన మేఘాలయ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టి. మీనాకుమారి మార్చి 23న బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మీనాకుమారి 2001లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వాత పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఇటీవల మేఘాలయతోపాటు, త్రిపుర, మణిపూర్‌లలో కొత్తగా హైకోర్టులను ఏర్పాటు చేశారు.
బంగ్లాదేశ్ అధ్యక్షుడు రెహ్మాన్ మతి
బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ జిల్లూర్ రెహ్మాన్ (85) అనారోగ్యంతో మార్చి 20న సింగపూర్‌లోని ఆస్పత్రిలో మరణించారు. 2008లో ‘అవామీ లీగ్’ గెలుపొందడంతో 2009లో జిల్లూర్ రెహ్మాన్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈయన 1929లో అవిభక్త భారత్‌లోని బ్రహ్మణ్‌బరియా (అసోం)లో జన్మించారు.
రెడ్డీస్ ల్యాబ్స్ అధినేత అంజి రెడ్డి మృతి
భారతీయ ఫార్మా రంగానికి అంతర్జాతీయంగా ఎనలేని గుర్తింపు తెచ్చిన ఔషధ రంగ దిగ్గజం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అధినేత కల్లం అంజిరెడ్డి(72) క్యాన్సర్ వ్యాధి తో మార్చి 15న హైదరాబాద్‌లో కన్నుమూశారు. అంజిరెడ్డి 1984లో హైదరాబాద్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌ను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మ శ్రీ (2001), పద్మభూషణ్ (2011) అవార్డులతో సత్కరించింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో 1941 మే 27న అంజిరెడ్డి జన్మించారు.
పినాకపాణి మృతి
ప్రముఖ సంగీత విద్వాంసులు. ప్రముఖ వైద్యులు శ్రీపాద పినాకపాణి (101) మార్చి 11న కర్నూలులో మరణించారు. ఈయన 1913 ఆగస్టు 3న ప్రియాగ్రహారం (శ్రీకాకుళం జిల్లా)లో జన్మించారు. 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1984లో పద్మ భూషణ్ పురస్కారాలు ఆయనకు లభించాయి. 2012లో తిరుమల తిరుపతి దేవస్థానం ‘గాన విద్యా వారధి’ బిరుదుతో సత్కరించింది. పాణినీయం, ప్రపత్తి, స్వరరామమ్, అభ్యాసమ్, నా సంగీత యాత్ర ఆయన రచనలు. నూకల చిన సత్యనారాయణ, నేదునూరి కష్ణమూర్తి, శ్రీరంగం గోపాల రత్నం, మల్లాది సూరిబాబు, నేతి శ్రీరామ శర్మ పినాకపాణి శిష్యులు. |
|
|
ఫిబ్రవరి 2013 వ్యక్తులు ::. |
|
|
ఐఆర్‌డీఏ చైర్మన్‌గా విజయన్
జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) మాజీ చీఫ్ టీఎస్ విజయన్ ఫిబ్రవరి 21న ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) చైర్మన్‌గా జె.హరినారాయణ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఐఆర్‌డీఏకి మూడో చైర్మన్ (ఐఆర్‌డీఏ చైర్మన్ పదవీ కాలం ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వరకు పదవిలో కొనసాగవచ్చు). ఈక్వెడార్ అధ్యక్షుడిగా రఫెల్ కొర్రియా
ఈక్వెడార్ అధ్యక్షుడిగా రఫెల్ కొర్రియా తిరిగి ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 17న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు 57 శాతం ఓట్లు లభించాయి. కొర్రియా ప్రత్యర్థి గ్వులెర్మో లాస్సోకు 23.8 శాతం ఓట్లు వచ్చాయి. కొర్రియా తొలిసారి 2007లో అధికారం చేపట్టారు.
రాజీనామా ప్రకటించిన పోప్ బెనడిక్ట్-16
రోమన్ కేథలిక్ మతాధిప తి పోప్ బెనడిక్ట్- 16 తన పదవికి ఫిబ్రవరి 28న రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. 85 ఏళ్ల బెనడిక్ట్ వద్ధాప్యం వల్ల రాజీనామా చేస్తున్నట్లు వాటికన్‌లో ఫిబ్రవరి 11న తెలిపారు. గత 600 ఏళ్లలో పోప్ తన పదవికి రాజీనామా చేయడం ఇదే తొలిసారి. పోప్ అసలుపేరు జోసెఫ్ రాజింగర్. 1927లో జర్మనీలో జన్మించారు. ఇంతకుముందు 1415లో పోప్ గ్రెగరీ- 12 రాజీనామా చేశారు.
అమెరికా ఇంజనీరింగ్ అకాడెమీలో రతన్ టాటాకు సభ్యత్వం
అమెరికా ‘నేషనల్ అకాడెమీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు సభ్యత్వం దక్కింది. ప్రతిష్టాత్మకమైన ఈ అకాడెమీలో విదేశీ సభ్యుడిగా ఆయనను ఎంపిక చేసినట్లు ఫిభ్రవరి 9న ప్రకటించారు. ఇంజనీరింగ్‌లో అత్యున్నత స్థాయిలో కషి చేసిన వారికి ఈ సభ్యత్వం కల్పిస్తారు. ఈ అకాడెమీకి కొత్తగా 69 మందిని ఎంపిక చేయగా అందులో 8 మంది భారతీయ అమెరికన్‌లు ఉన్నారు.
సొలిసిటర్ జనరల్‌గా మోహన్ పరాశరన్
కొత్త సొలిసిటర్ జనరల్‌గా మోహన్ పరాశరన్ ఫిబ్రవరి 8న నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం అదనపు సొలిసిటర్ జనరల్‌గా ఉన్నారు. ఈ పదవిలో ఉన్న రోహింటన్ నారిమన్ ఫిబ్రవరి 3న రాజీనామా చేశారు. ‘సొలిసిటర్ జనరల్’ దేశంలో రెండో అత్యున్నత న్యాయాధికారి పదవి. దేశంలో అతి పెద్ద, రాజ్యాంగబద్ధమైన న్యాయాధికారి పదవి అటార్నీ జనరల్. ఈ పదవిలో గులాబ్ జి.ఇ. వాహన్‌వతి కొనసాగుతున్నారు. |
|
జనవరి 2013 వ్యక్తులు ::. |
|
|
‘శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్’లో యు.ఆర్.రావు
భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్ యు.ఆర్.రావు ప్రతిష్టాత్మక ‘శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్’ బందం సభ్యుడిగా ఎంపికయ్యారు. భూమిపై ప్రాణికోటి అభివద్ధికి ఉపగ్రహ సాంకేతికత ద్వారా విశేష కషి చేసిన ప్రముఖ శాస్త్రవేత్తలను అమెరికాలోని ‘ద సొసైటీ ఆఫ్ శాటిలైట్ ప్రొఫెషనల్స్ ఇంటర్నేషనల్(ఎస్‌ఎస్‌పీఐ)’1987 నుంచి ‘శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్’ సభ్యులుగా నియమిస్తోంది. కమ్యూనికేషన్లు, ఉపగ్రహ సంబంధ పరిశోధనలు, శాటిలైట్ టెక్నాలజీ ద్వారా అభివద్ధికి మార్గదర్శకులుగా ఈ బంద సభ్యులను గౌరవిస్తోంది. బెంగళూరుకు చెందిన రావు అహ్మదాబాద్‌లో ఇస్రోకు చెందిన ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ (పీఆర్‌ఎల్) పాలక మండలి చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
యూజీసీ చైర్మన్‌గా వేద ప్రకాశ్ నియామకం
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్‌గా వేద ప్రకాశ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. వేద ప్రకాశ్ ప్రస్తుతం యూజీసీ తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2011 ఫిబ్రవరిలో ఎస్ థోరట్ యూజీసీ చైర్మన్‌గా రాజీనామా చేశారు. దీంతో రెండేళ్లుగా ఈ పదవి ఖాళీగానే ఉంది. వేద ప్రకాశ్ గతంలో యూజీసీ వైస్ చైర్మన్‌గా, కార్యదర్శిగా పనిచేశారు.
ప్రేమలత రికార్డు
భారత్‌కు చెందిన ప్రేమలత అగర్వాల్ అంటార్కిటికాలోని మౌంట్ విన్‌సన్ పర్వతాన్ని అధిరోహించారు. తద్వారా ఏడు ఖండాల్లోని ఆరు ఎత్తెన పర్వతాలను అధిరోహించిన భారత మహిళగా రికార్డును సొంతం చేసుకున్నారు.
అమెరికా రక్షణ మంత్రిగా హేగెల్
అమెరికా రక్షణ మంత్రిగా రిపబ్లికన్ పార్టీ మాజీ సెనెటర్ చక్ హేగెల్‌ను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా జనవరి 8న నియమించారు. 2011లో లాడెన్‌ను మట్టుబెట్టడంలో కీలక పాత్ర పోషించిన ‘వైట్‌హౌస్’ ఉగ్రవాద నిరోధక విభాగం సలహాదారు జాన్ బ్రెన్నన్‌ను సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) నూతన చీఫ్‌గా నామినేట్ చేశారు.
సింగపూర్ పార్లమెంట్ స్పీకర్‌గా హలిమా యాకోబ్
సింగపూర్ పార్లమెంట్ స్పీకర్‌గా భారత సంతతికి చెందిన హలి మా యాకోబ్ బాధ్యతలు స్వీకరించారు. ఆ దేశ పార్లమెంట్‌కు స్పీకర్‌గా వ్యవహరించనున్న తొలి మహిళగా కూడా హలిమా ఘనత దక్కించుకున్నారు.
ఎన్‌డీఏ కమాండెంట్‌గా కుల్వంత్
పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) కమాండెంట్‌గా లెఫ్టినెంట్ జనరల్ అశోక్ సింగ్ స్థానంలో ఎయిర్‌మార్షల్ కుల్వంత్ సింగ్ జనవరి 8న బాధ్యతలు స్వీకరించారు.
అమెరికా ఆర్థిక మంత్రిగా జాక్ లా
అమెరికా ఆర్థిక మంత్రిగా జాక్ లాను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా జనవరి 11న నియమించారు. జాక్ లా గతంలో వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరించారు.
యూకే కేబినెట్‌లో మొదటి గుజరాతీ
యూకే కే బినెట్‌లో స్థానం పొందిన మొదటి గుజరాతీగా లార్డ్ డోలర్ పాపట్ చరిత్ర సష్టించారు. పాపట్‌ను బిజినెస్-ఇన్నోవేషన్, స్కిల్స్, ట్రాన్స్‌పోర్ట్ శాఖ మంత్రిగా ఆ దేశ ప్రధానమంత్రి డేవిడ్ కామారూన్ నియమించారు.
ఐబీ ప్రధానాధికారిగా ఇబ్రహీం
ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) నూతన ప్రధానాధికారిగా నేహాచల్ సంధు స్థానంలో మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్‌ఏ ఇబ్రహీం జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లు ఈ పదవిలో కొనసాగే ఇబ్రహీం గతంలో ఐబీ ప్రత్యేక డెరైక్టర్‌గా పని చేశారు. ప్రధాన మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి ఐబీ చీఫ్‌గా నియమితులు కావడం ఇదే తొలిసారి.
షార్ డెరైక్టర్‌గా ప్రసాద్
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) డెరైక్టర్‌గా మలపాక యజ్ఞేశ్వర సత్యప్రసాద్ (ఎం.వై.ఎస్. ప్రసాద్) జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1953లో పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 1975లో ఇస్రోలో చేరి తిరువనంతపురంలోని స్పేస్ సెంటర్‌లో జూనియర్ శాస్త్రవేత్తగా వివిధ హోదాల్లో పనిచేశారు. 2008 నుంచి షార్‌లో అసోసియేట్ డెరైక్టర్‌గా ఉన్నారు. చంద్రయాన్-1 ప్రయోగంలో కీలక పాత్ర వహించిన వారిలో ప్రసాద్ ఒకరు.
లా కమిషన్ చైర్మన్‌గా జైన్
లా కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ డి.కె.జైన్ నియమితులయ్యారు. జనవరి 24న ఈయన బాధ్యతలు చేపడతారు. ఇది 20వ లా కమిషన్. దీని కాలపరిమితి 2015 ఆగస్టు 31తో ముగుస్తుంది. సంక్లిష్టమైన అంశాలపై కేంద్రానికి లా కమిషన్ సలహాలిస్తుంది. |
|
No comments:
Post a Comment