రెపో రేటు 0.25 శాతం తగ్గింపు
రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ)మధ్యంతర త్రెమాసిక పరపతి విధాన సమీక్షలో మార్చి 19న రెపో రేటును 0.25 శాతం తగ్గించింది. దీంతో రెపో రేటు (బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటు) 7.75 శాతం నుంచి 7.50 శాతానికి తగ్గింది. రెపో రేటు తగ్గింపునకు అనుగుణంగా రివర్స్ రెపో రేటు(బ్యాంకులు ఉంచిన నిధులుపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటు) 0.25 శాతం తగ్గి 6.75 శాతం నుంచి 6.50 శాతానికి చేరింది. నగదు నిల్వ నిష్పత్తి (ిసీఆర్ ఆర్)ను యధాతథంగా 4 శాతంగా కొనసాగించింది.
ఆంధ్రప్రదేశ్ సామాజిక సర్వే 2012-13
ప్రధానాంశాలు:
2012-13 ఆర్థిక సంవత్సరం ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్రంలో 2004-05 స్థిర ధరల్లో
- పారిశ్రామిక వద్ధి రేటు: 0.73 శాతం
- వ్యవసాయ వద్ధి రేటు: 1.96 శాతం.
- రాష్ట్ర స్థూల ఉత్పతి: రూ. 4,26,470 కోట్లు.
- తలసరి ఆదాయం: రూ.77,277 (ఇది 2011-12లో రూ.68,970).
- ఆహార ధాన్యాల ఉత్పత్తి: 170.78 లక్షల టన్నులు (2011-12లో 184.02 లక్షల టన్నులు).
- శిశుమరణాలు: 2011లో ప్రతి 1000కి 43కు తగ్గాయి (2001లో ప్రతి 1000కి 66).
- 2011లో జననాల రేటు ప్రతి 1000 మందికి 17.5గాను మరణాల రేటు 7.5గాను ఉంది.
- ఫురుషుల జీవిత కాలం 66.9 సంవత్సరాలు. ఇది మహిళల్లో 70.9 సంవత్సరాలుగా ఉంది.
- సరాసరి భూకమతాల పరిమాణం: 2010-11 నాటికి 1.08 హెక్టార్లకు తగ్గింది (ఇది 2005-06లో 1.20 హెక్టార్లుగా ఉండేది).
- 2012-13లో ఆహార ధాన్యాలు పండించే విస్తీర్ణం 66.32 లక్షల హెక్టార్లు ( ఇది 2011-12లో 72.89 లక్షల హెక్టార్లు).
- దేశంలో సుగంధ ద్రవ్యాల, పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో, పూల ఉత్పత్తిలో మూడోస్థానం లో, నిమ్మ, పపయా, ఆయిల్ పాం, టొమోటోల ఉత్పత్తిలో మొదటి స్థానంలో, మామిడి, జీడి మామిడిలో రెండోస్థానం,అరటిఉత్పత్తిలో నాలుగోస్థానంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్
2013-14 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మార్చి 18న శాసనసభకు సమర్పించారు. వివరాలు..
బడ్జెట్ మొత్తం: రూ. 1,61,348 కోట్లు
ప్రణాళికేతర వ్యయం:రూ. 1,01,926 కోట్లు
ప్రణాళికా వ్యయం: రూ. 59,422 కోట్లు
ద్రవ్యలోటు: రూ. 24,487 కోట్లు
రెవెన్యూ రాబడి: రూ.1,27,772.19 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.1,26,749.41 కోట్లు
మొత్తం అప్పులు: రూ. 1,79,637 కోట్లు
వ్యవసాయానికి కార్యాచరణ ప్రణాళిక:
రాష్ట్రంలో తొలిసారి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ శాసన సభకు సమర్పించారు. వివరాలు..
కార్యాచరణ ప్రణాళిక వ్యయం: రూ.98,940.54 కోట్లు
ఉచిత విద్యుత్: రూ. 3,621.99 కోట్లు
సహకార శాఖ: రూ. 197.40 కోట్లు
రైతులకు రుణాలు: రూ. 59,918 కోట్లు
2013-14 కేంద్ర బడ్జెట్
2013-14 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఫిబ్రవరి 28న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. చిదంబరం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం ఇది ఎనిమిదోసారి. తద్వారా ఆయన.. అత్యధిక బడ్జెట్లు సమర్పించిన రెండో ఆర్థిక మంత్రిగా ఘనత సాధించారు. ఈ జాబితాలో పది బడ్జెట్లతో మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తొలి స్థానంలో ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ, యశ్వంత్ సిన్హా, వై.బి. చవాన్, సి.డి. దేశ్‌ముఖ్‌లు ఏడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టగా.. ప్రధాని మన్మోహన్‌సింగ్, టి.టి.కష్ణమాచారిలు ఆర్థిక మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ఆరు బడ్జెట్‌లు సమర్పించారు. మొత్తమ్మీద స్వతంత్ర భారతావనిలో ఇది 82వ బడ్జెట్. వీటిలో 66 సాధారణ వార్షిక బడ్జెట్‌లు కాగా, 12 తాత్కాలిక బడ్జెట్‌లు, ప్రత్యేక పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన నాలుగు మినీ బడ్జెట్‌లు ఉన్నాయి.
ముఖ్యాంశాలు: - బడ్జెట్ వ్యయం: రూ. 16,65,297 కోట్లు
- రెవెన్యూ వసూళ్లు: రూ.10,56,331 కోట్లు
- మూల ధన వసూళ్లు: రూ.6,08, 967 కోట్లు
- ప్రణాళికా వ్యయం: రూ. 5,55,322 కోట్లు
- ప్రణాళికేతర వ్యయం: రూ. 11,09,975 కోట్లు
- రెవెన్యూ లోటు: రూ. 3,79,838 కోట్లు
- ద్రవ్య లోటు: రూ. 5,42,499 కోట్లు
- ప్రాథమిక లోటు: రూ. 1,71,814 కోట్లు
వివిధ రంగాలకు కేటాయింపులు: - రక్షణ వ్యయం: రూ. 2,03,672 కోట్లు
- గ్రామీణాభివద్ధి: రూ. 80,194 కోట్లు
- వ్యవసాయం: రూ. 27,049 కోట్లు
- విద్య: రూ. 65, 867 కోట్లు
- శాస్త్ర సాంకేతిక రంగం: రూ. 6,275 కోట్లు
- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం: రూ. 37,330 కోట్లు
2012-13 ఆర్థిక సర్వే
2012-13 ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఫిబ్రవరి 27న లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ముఖ్యాంశాలు:
వచ్చే ఆర్థిక సంవత్సరం (2013-14)లో 6.1-6.7 శాతం మేర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందనేది సర్వే అంచనా. అయితే, ఈ ఏడాది (2012-13) వద్ధిరేటు 5 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. ఇది దశాబ్దపు కనిష్టస్థాయి కావడం గమనార్హం.
ప్రభుత్వ సబ్సిడీల భారం అంతకంతకూ పెరుగుతుండటంపై సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. సబ్సిడీల బిల్లు ఈ ఏడాది (2012-13)లో రూ.1.79 లక్షల కోట్లకు చేరుకోనుందని సర్వే పేర్కొంది. ఇందులో చమురు సబ్సిడీ (రూ.43,580 కోట్లు), ఆహార సబ్సిడీ (రూ.75,000 కోట్లు), ఎరువుల సబ్సిడీ (రూ.60,974 కోట్లు)గా ఉండొచ్చని అంచనా.
సర్వే ముఖ్యాంశాలు:
దిగుమతుల తగ్గింపుపై దష్టి, కరెంట్ అకౌంట్ లోటు తగ్గించేందుకు మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు ధరల నిర్ణయం - 2013-14లో జీడీపీలో విత్త లోటు లక్ష్యం 4.8 శాతం
- 2016-17 నాటికి విత్తలోటు లక్ష్యం 3 శాతం
- రెవెన్యూ బాగా తగ్గడంతో 2012-13లో నిర్దేశించిన 5.3 శాతం విత్తలోటును చేరుకోలేకపోవడం
- 2013 నాటికి 6.2-6.6 శాతానికి తగ్గనున్న ద్రవ్యోల్బణం
- 2012-13లో పారిశ్రామిక ఉత్పత్తిలో వద్ధి 3 శాతం
- వ్యవసాయ వద్ధిని మెరుగుపరిచేందుకు స్థిరమైన విధానాలు ఆవశ్యకం.
|
No comments:
Post a Comment
Type here: