Meet Us Here

Pages

Monday, June 24, 2013

SCIENCE&TECH_TELUGU_2013_CURRENTAFFAIRS(JAN TO MAY)

మే 2013 స్తెన్స్ & టెక్నాలజీ ::.

              
చర్మ కణాల నుంచి తొలి దశ పిండాలు
శాస్త్రవేత్తలు మానవ చర్మ కణాలను ప్రారంభ దశలో ఉండే పిండాలుగా వృద్ధి చేశారు. అమెరికాలోని ఒరెగాన్ నేషనల్ ప్రిమేట్ రీసెర్చ్ సెంటర్‌కి చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ప్రారంభ దశలోని పిండాలను ఉపయోగించి అవయవ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ప్రత్యేక కణజాల కణాలను తయారుచేయడానికి వీలవుతుంది. మానవ క్లోనింగ్ పరిశోధనలో ఇదో మైలురాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

అతిసారానికి స్వదేశీ టీకా
రొటా వైరస్ డయేరియా (అతిసారం)కు భారత శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ద రొటావాక్‌టీకాను అభివృద్ధి చేశారు. ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను మే 14 ఢిల్లీలో విడుదల చేశారు. ఏడాది లోపు చిన్నారులకు ఈ టీకాను వేయడం ద్వారా వ్యాధి తీవ్రతను 56 శాతం తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. టీకాను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు మరికొంత సమయం పడుతుందని, టీకా అభివృద్ధిలో పాలుపంచుకున్న హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తెలిపింది. భారత్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆమోదం పొందితే ఈ టీకా రూ.54కు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో రొటా వైరస్ టీకాల ధరలు ఒక్కో డోసుకు సుమారు రూ.1000 ఉంది.

నౌకాదళంలోకి బోయింగ్ పీ81 విమానం
జలాంతర్గామి విధ్వంసక లాంగ్ రేంజ్ విమానం.. బోయింగ్ పీ81 ని తమిళనాడులోని అరక్కోణం నావల్ ఎయిర్ స్టేషన్ రాజాలీలో మే 15న నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. బోయింగ్ 737-800 (ఎన్‌జీ)ని నౌకాదళ అవసరాలకు అనువుగా పీ81 ఎయిర్‌క్రాఫ్ట్‌గా అమెరికా నౌకాదళం ఆధునికీకరించింది. ఈ విమానంలో జలాంతర్గాములను ధ్వంసం చేసే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది.

నౌకాదళంలోకి మిగ్ 29కే యుద్ధ విమానం
కొత్త తరం యుద్ధ విమానం మిగ్ 29కేభారత నౌకాదళంలోకి చేరింది. మే 11న పనాజీలో నౌకాదళ వైమానిక కేంద్రం ఐఎన్‌ఎస్ హంస వద్ద రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సమక్షంలో నౌకాదళంలోకి ప్రవేశించింది. ఈ ఏడాది జలప్రవేశం చేయనున్న విమాన వాహకనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య (అడ్మిరల్ గోర్ష్‌కోవ్)తో మిగ్ 29కే విమానాలను అనుసంధానిస్తారు. బ్లాక్ పాంథర్స్గా కూడా పిలిచే మిగ్29కే విమానాలను నేవీలో అధికారికంగా ఐఎన్‌ఏఎస్ 303’గా పేర్కొంటారు.

గస్తీ నౌక రాణి అవంతిబాయిప్రారంభం
గస్తీనౌక రాణి అవంతిబాయిను విశాఖపట్నంలో మే 9న కోస్ట్‌గార్డ్ అధికారులు ప్రారంభించారు. దీంతో తీరప్రాంత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమైంది. విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ నిర్మిస్తున్న ఐదు గస్తీ నౌకల్లో అవంతిబాయి రెండోది. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ఉన్న ఈ నౌక పొడవు 50 మీటర్లు. మధ్యప్రదేశ్‌కు చెందిన రామ్‌గఢ్ మహారాణిగా 1851-57 మధ్యకాలంలో అవంతిబాయి వెలుగొందారు. ఆమె బ్రిటిష్ వారితో ధైర్యంగా పోరాడి వీరవనితగా కీర్తిగడించారు.

చెనా కమ్యూనికేషన్ ఉపగ్రహం
చైనా జాంగ్‌జింగ్-11 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని మే 2న క్సిచాంగ్ శాటిలైల్ లాంచ్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది.
ఏప్రిల్ 2013 స్తెన్స్ & టెక్నాలజీ ::.

              
బయోశాటిలైట్‌ను ప్రయోగించిన రష్యా
బయోలాజికల్ రీసెర్చ్ క్యాప్సుల్ బియోన్ (బీఐఒఎన్)-ఎం 1ను రష్యా ఏప్రిల్ 19న ప్రయోగించింది. కజకిస్థాన్‌లోని బైకనూర్ నుంచి సోయెజ్ -2 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి బీఐఒఎన్‌ను పంపారు. ఈ బయోశాటిలైట్‌లో 45 ఎలుకలతోపాటు, నత్తలు, పలు సూక్ష్మ జీవరాసులను పంపారు. ఈ ఉపగ్రహం తిరిగి మే 18న భూమికి చేరుతుంది. ఈ అంతరిక్ష యానంలో సూక్ష్మ జంతువులపై వివిధ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఇవి వివిధ గ్రహాలపై జరిపే పరిశోధనలకు తోడ్పడతాయి. రష్యా 15 ఏళ్ల తర్వాత ప్రస్తుత బయోలాజికల్ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించింది.

కష్ణ పదార్థంపై కొత్త వెలుగు
శాస్త్రవేత్తల టెలిస్కోప్ పరిశోధనలకు అందకుండా ఉన్న కష్ణ పదార్థం గురించి విశేషాలను ఒక పరిశోధన వెలుగులోకి తీసుకువచ్చింది. విశ్వంలో దాదాపుగా 84.5 శాతాన్ని కష్ణపదార్థమే ఆవరించి ఉండవచ్చని అంతరిక్ష పరిశోదకులు అంచనావేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) కు అమర్చిన ఒక డిటెక్టర్ ద్వారా ఈ అంచనాకు వచ్చామని అల్ఫామ్యాగ్నటిక్ స్పెక్ట్రోమీటర్(ఏఎంఎస్) పరిశోధనలోని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగ వివరాలను నోబెల్ అవార్డు గ్రహీత శామ్యూల్‌టింగ్ ప్రకటించారు. కష్ణపదార్థ వెల్లువ, ద్రవ్యరాశి గురించి ఇప్పటివరకు పరోక్ష పద్ధతిలోనే అంచనాలున్నాయి. విశ్వంలోని కాంతి కిరణాలతో, కష్ణ పదార్థానికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా ఇంతవరకూ పరిశోధనలు జరిగాయి. ఏఎమ్‌ఎస్ అధ్యయనంలో విశ్వంలోని పాజిట్రాన్‌లనే కణాల ఉనికిని బట్టి పరిశోధకులు దీన్ని అంచనా వేశారు.

అగ్ని- 2 సక్సెస్
అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న మధ్యశ్రేణి క్షిపణి అగ్ని-2 పరీక్ష విజయవంతమైంది. ఈ పరీక్షను ఏప్రిల్7న ఒడిశాలోని వీలార్ ద్వీపం మొబైల్ లాంచర్ నుంచి నిర్వహించారు. 2 వేల కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే ఈ క్షిపణిని ఇప్పటికే రక్షణశాఖలో ప్రవేశ పెట్టారు. రెండు మీటర్లు పొడవు, 17 టన్నుల బరువుండే అగ్ని-2, 1000 కిలోలకు పైగా పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. 


మార్చి 2013 స్తెన్స్ & టెక్నాలజీ ::.

              
ఆరుగంటల్లో అంతరిక్ష కేంద్రానికి
అమెరికా, రష్యాకు చెందిన ముగ్గురు వ్యోమగాములు మార్చి 29న సోయిజ్ టీఎంఏ అంతరిక్ష నౌక ద్వారా ఆరుగంటల్లోపే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) చేరారు. వీరు కజకిస్తాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి అతి తక్కువ సమయంలో చేరుకున్నారు. సాధారణంగా ఐఎస్‌ఎస్ చేరడానికి 45 గంటలు పడుతుంది.

చైనాలో హెచ్7ఎన్9
హెచ్7ఎన్9 వ్యాధితో తొలిసారిగా చైనాలోని షాంఘైలో మార్చి 31న ఇద్దరు వ్యక్తులు మతి చెందారు. ఇది బర్డ్‌ఫ్లూ వ్యాధిలో తక్కువ ప్రమాదకరమైంది. ఇప్పటి వరకు హెచ్7 ఎన్9 వల్ల ఎవరూ మరణించలేదు. ఇది అంత త్వరగా మనుషులకు సోకదు. అయితే బర్డ్‌ఫ్లూకు చెందిన హెచ్ 5 ఎన్1 వైరస్ వల్ల 2003లో ఆసియాలో అనేక మంది మరణించారు. ఈ వ్యాధి పౌల్ట్రీ కోళ్ల నుంచి మానవులకు వ్యాపించింది.

దేశీయ క్రయోజెనిక్ ఇంజన్ పరీక్ష సక్సెస్
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ ఇంజన్ పరీక్షను 2013 మార్చి 27న విజయవంతంగా నిర్వహించారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా మహేంద్రగిరిలోని ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్(ఎల్‌ిపీఎస్‌ిసీ)లో కొత్తగా ఏర్పాటు చేసిన హై ఆల్టీట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీ(హెచ్‌ఏటీ)లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఇస్రో జూలైలో చేపట్టే జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ-డి5) ప్రయోగానికి ఈ పరీక్ష మరింత ఊతమిచ్చింది. జీఎస్‌ఎల్‌వీ -డి5 దేశీయ క్రయోజెనిక్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది కమ్యూనికేషన్ ఉపగ్రహం. జీశాట్-14ను కక్ష్యలో ప్రవేశపెడుతుంది. 2010 ఏప్రిల్‌లో దేశీయ క్రయోజెనిక్ ఇంజన్‌తో చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ డి3 ప్రయోగం విఫలమైంది.

యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కిల్తాన్ ప్రారంభం
మూడో యాంటీ- సబ్‌మెరైన్ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కిల్తాన్ను కోల్‌కతాలో 2013 మార్చి 26న జలప్రవేశం చేయించారు. నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానం, స్వయంశక్తి సాధించడంలో కిల్తాన్ప్రారంభం ప్రధాన ఘట్టం. ప్రాజెక్ట్ -28(పి-28)లో భాగంగా నావీస్ డెరైక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ ఈ నౌకను రూపొందించింది. లక్షద్వీప్‌లోని దీవి కిల్తాన్పేరును ఈ యుద్ధనౌకకు పెట్టారు. ఈ నౌక సముద్ర జలాల లోపల నౌకాదళం యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనికి అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, టార్పెడో ట్యూబ్ లాంచర్లు, రాకెట్ లాంచర్లు వంటివి అమర్చుతారు.

తేజస్పరీక్ష విజయవంతం
దేశీయంగా అభివద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ను బెంగళూరులో మార్చి 31న విజయవంతంగా పరీక్షించారు. ఈ లిమిటెడ్ సీరీస్ ప్రొడక్షన్(ఎల్‌ఎస్‌ిపీ-8) తేజస్ యుద్ధ విమానం సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించిందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తెలిపింది.

జలాంతర్గామి నుంచి బ్రహ్మోస్ పరీక్ష
జలాంతర్గామి నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ మార్చి 20న విజయవంతంగా పరీక్షించింది. విశాఖపట్నం సమీపంలోని సముద్ర జలాల లోపలి పాంటూన్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. దీంతో ప్రపంచంలో ఇలాంటి సామర్థ్యం కలిగిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ఈ క్షిపణి 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. భారత్-రష్యాలు సంయుక్తంగా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణిని భూమి, నౌకపై నుంచి విజయవంతంగా పరీక్షించి ఇప్పటికే సైన్యం, నౌకాదళంలో చేర్చారు.

లక్ష్యఛేదనలో నిర్భయ్విఫలం
భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి సబ్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ నిర్భయ్లక్ష్య ఛేదనలో విఫలమైంది. ధ్వనివేగం కంటే తక్కువగా, ఒకే వేగంతో వెళుతూ లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మార్చి 12న తొలిసారిగా ఒడిశా తీరంలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రంలో పరీక్షించింది. ఓ మొబైల్ లాంఛర్ నుంచి నింగికి ఎగిరిన నిర్భయ్ 25 నిమిషాల ప్రయాణం అనంతరం నిర్దేశిత మార్గం నుంచి దారితప్పింది. దీంతో సముద్రంలో ఏర్పాటుచేసిన లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన నిర్భయ్‌ని శాస్త్రవేత్తలు మధ్యలోనే రద్దుచేశారు. సుమారు 1,000 కి.మీ. దూరంలో గల లక్ష్యాలను ఛేదించే నిర్భయ్ దీర్ఘశ్రేణి క్షిపణిని బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఈ) రూపొందించింది. దీన్ని భూ, గగన, సముద్రతలాల నుంచీ ప్రయోగించవచ్చు. రష్యా సహకారంతో తయారుచేసిన బ్రహ్మోస్సూపర్‌సోనిక్ (ధ్వని కంటే వేగంగా ప్రయాణించే)క్రూయిజ్ క్షిప ణులు ఇది వరకే సైన్యం అమ్ములపొదిలో చేరాయి.

విశ్వ శోధనకు అతిపెద్ద వేధశాల
విశ్వంలోని సుదూర ప్రాంత నక్షత్రాలు, గెలాక్సీలను కూడా లోతుగా పరిశోధించడానికి ఉపయోగపడే శక్తిమంతమైన వేధశాల (అబ్జర్వేటరీ)ను చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెర అటకామా ఎడారిలో మార్చి 13న ప్రారంభించారు. మహా విస్ఫోటం (బిగ్ బ్యాంగ్) అనంతరం జరిగిన విశ్వ పరిణామం, నక్షత్రాలు, గ్రహాల పుట్టుక వంటి వాటిపై కూడా ఈ వేధశాలతో కొత్త వివరాలు తెలుసు కోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

యూఏఈలో పెద్ద సౌర విద్యుత్ కేంద్రం
యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ప్రపంచంలోనే అతి పెద్ద సౌర విద్యుత్ కేంద్రం ప్రారంభమైంది. సుమారు రూ.3200 కోట్ల వ్యయంతో నిర్మించిన షామ్స్-1’ సౌర విద్యుత్ కేంద్రాన్ని మార్చి 17న యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ ప్రారంభించారు. ఇది 20 వేల గహాలకు విద్యుత్‌ను అందిస్తుంది. ప్రపంచ పునరుత్పాదక ఇంధన సంపదలో 10 శాతాన్ని షామ్స్-1 ఉత్పత్తి చేస్తుంది. దీని నిర్మాణం 2010లో ప్రారంభమైంది. ఈ కేంద్రం 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తుంది.

పినాకపరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పినాకరాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలసోర్ జిల్లా చాందిపూర్ సముద్రతీరం వద్ద ఉన్న స్థావరం నుంచి మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ ద్వారా ఫిబ్రవరి 28, మార్చి1న రెండు సార్లు పినాక పరీక్ష నిర్వహించారు. 

ఫిబ్రవరి 2013 స్తెన్స్ & టెక్నాలజీ ::.

              
రష్యాలో భారీ ఉల్కాపాతం
రష్యాలో ఫిబ్రవరి 15న సంభవించిన భారీ ఉల్కాపాతం తాకిడికి 1000 మంది గాయపడ్డారు. 10 టన్నుల బరువైన ఓ ఉల్క రష్యా గగనతలంలో భూవాతావరణంలో ప్రవేశించి, యూరల్ పర్వతాల మీదుగా ప్రయాణించి ముక్కలైంది. దీంతో ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన వెలుగులు, భారీ శబ్దాలు సంభవించాయి. ఆ ఉల్కసెకనుకు 30 కి.మీ. వేగంతో ప్రయాణించి భూమికి 30-50కి.మీ. ఎత్తులో ముక్కలైంది. బెల్సా బిన్‌‌క్స పట్నంలో అనేక భవనాలు ధ్వంస మయ్యాయి. గ్రహశకలాలు పరస్పరం ఢీ కొన్నపుడు వాటి నుంచి విడిపోయే చిన్న రాతి ముక్కలనే ఉల్కలు అంటారు.

భూమికి సమీపంలోకి డిఎ 14 గ్రహశకలం
ఫిబ్రవరి 15, 2012 డిఎ 14 అనే గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చింది. 45 మీటర్ల వెడల్పున్న ఈ శకలం భూమికి 27,700 కిలోమీటర్ల సమీపానికి వచ్చింది. వాతా వరణం, కమ్యూనికేషన్‌‌స సేవలందించే ఉప గ్రహాల (శాటిలైట్లు)

గస్తీ నౌక ఐసీజీఎస్ రాజ్ రతన్
గస్తీనౌక ఐసీజీఎస్ రాజ్ రతన్ ను ఫిబ్రవరి 11న కోల్‌కతాలో భారత తీరగస్తీ (ఐసీజీ) దళాలకు అప్పగించారు. దీన్ని గుజరాత్ తీరంలో వినియోగిస్తారు. ఈ ఇన్‌షోర్ పెట్రోల్ వెస్సెల్ (ఐపిఒ) సముద్రదళాల సామర్థ్యాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది. ఈ తరహాకు చెందిన ఎనిమిది గస్తీ నౌకల్లో ఇది ఐదోది. దేశీయంగా అభివద్ధి చేసిన ఈ నౌక 50 మీటర్ల పొడవుంటుంది. 34 నాట్స్ వేగంతో ప్రయాణిస్తుంది.

పినాక ప్రయోగం విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్ (ఎంబీఆర్‌ఎల్) ఆయుధ వ్యవస్థ పినాకపరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్ రక్షణ స్థావరం నుంచి జనవరి 30న డీఆర్‌డీఓ ఈ పరీక్షను నిర్వహించింది. 

జనవరి 2013 స్తెన్స్ & టెక్నాలజీ ::.

              
బీవో5’ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
భారత్ జనవరి 27న విశాఖపట్నం తీరంలోని బంగాళాఖాతంలో బీవో5’ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీంతో ఇప్పటివరకు గగనతలం, భూతలం నుంచే అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించే సత్తా ఉన్న భారత్ ఇకపై సముద్ర గర్భం నుంచీ న్యూక్లియర్ మిస్సెళ్లను ఎక్కుపెట్టే సామర్థ్యాన్ని సమకూర్చుకున్నట్లెంది. జలాంతర్గామి(సబ్ మెరైన్) నుంచి ప్రయోగించేలా భారత్ పూర్తిస్థాయిలో అభివద్ధి చేసిన తొలి అంతర్‌జల అణ్వస్త్ర క్షిపణి ఇదే. 1,500 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌సహా అతికొద్ది దేశాలకు మాత్రమే జలాంతర్గాముల నుంచి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉంది. తాజా విజయంతో భారత్ కూడా వాటి సరసన చేరింది. సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ (ఎస్‌ఎల్‌బీఎం) విభాగంలోకి వచ్చే బీవో5’ను హైదరాబాద్‌లో డీఆర్‌డీఓకు చెందిన డీఆర్‌డీఎల్ (రక్షణ పరిశోధన, అభివద్ధి ప్రయోగశాల) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. తాజా పరీక్షతో ఐఎన్‌ఎస్ అరిహంత్అణ్వస్త్ర జలాంతర్గామితో సహా నావికాదళానికి చెందిన ఇతర వేదికల నుంచీ ప్రయోగించేందుకు ఈ క్షిపణి పూర్తిస్థాయిలో సిద్ధమైంది.

హైదరాబాద్‌లో బయో ఆసియా సదస్సు
హైదరాబాద్‌లో పదో బయో ఆసియా సదస్సు జనవరి 28 నుంచి 30 వరకు జరిగింది. ఇందులో 45 దేశాల నుంచి 600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బయోటెక్నాలజీ రంగంలో అత్యున్నత కషి చేసిన వారికి ఏటా ఇచ్చే జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులను ఈ సారి కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మాజీ కార్యదర్శి డాక్టర్ ఎం.కె. భాన్, ఫైజర్ ఫార్మా కంపెనీకి చెందిన ఫ్రీడా లూయిస్‌లకు ప్రదానం చేశారు.

నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్ సరయు
అతి పెద్ద గస్తీ నౌక ఐఎన్‌ఎస్ సరయును నౌకాదళంలో ఎయిర్ మార్షల్ పి.కె. రాయ్ గోవాలోని వాస్కోలో జనవరి 21న ప్రవేశ పెట్టారు. సరయును గోవా షిప్ యార్డ్ లిమిటెడ్(జీఎస్‌ఎల్) రూపొందించింది. 105 మీటర్ల పొడవున్న ఈ నౌక జీఎస్‌ఎల్ నిర్మిస్తున్న నాలుగు కొత్త తరహా నౌకల్లో ఒకటి. అత్యాధునిక నావిగేషన్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ పరికరాలు ఇందులో ఉంటాయి.

పాలపుంతలో భూమి వంటి 1700 కోట్ల గ్రహాలు
పాలపుంత గెలాక్సీలో భూమి పరిమాణంలో ఉన్న గ్రహాలు దాదాపు 1700 కోట్ల వరకు ఉన్నాయని అమెరికా శాస్త్రవేత్తలు జనవరి 9న తెలిపారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)కు చెందిన కెప్లర్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహాలను కనుగొన్నారు. పాలపుంత గెలాక్సీలో కనీసం 100 కోట్ల నక్షత్రాలు ఉన్నందు వల్ల 1700 కోట్ల వరకు గ్రహాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. పాలపుంతలోని నాలుగో వంతు నక్షత్రాలకు భూమి కంటే 1.25నుంచి 2 రెట్లు పెద్ద గ్రహాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

విశ్వంలో అతిపెద్ద స్పెరల్ గెలాక్సీ గుర్తింపు
స్పెరల్ గెలాక్సీలో అతి పెద్దదైన ఎన్‌జీసీ 6872’ అనే స్పెరల్ గెలాక్సీని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది మనకు 21.2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు.

బ్రహ్మోస్పరీక్ష విజయవంతం
భారత నావికాదళం అమ్ములపొదిలోని బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని జనవరి 9న విజయవంతంగా పరీక్షించారు. విశాఖపట్నం తీరంలోని బంగాళాఖాతంలో ఈ పరీక్షను నిర్వహించారు. బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించడం ఇది 34వ సారి. తాజాగా పరీక్షించిన క్షిపణి 290 కి.మీ. శ్రేణికి చెందింది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను భారత నేవీలో 2005లో ప్రవేశపెట్టారు.

ఇంటర్‌నెట్‌: 30
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే కీలక సమాచార వ్యవస్థ ఇంటర్‌నెట్ఆవిర్భవించి 2013, జనవరి 1 నాటికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంటర్‌నెట్‌ను 1983, జనవరి 1న అమెరికా రక్షణ శాఖ అధికారికంగా ప్రారంభించింది. ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ సూట్ (ఐపీఎస్) సమాచార వ్యవస్థను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోగలిగేలా రూపొందించిన ఆర్పానెట్నెట్‌వర్క్ ప్రకారం ఇంటర్‌నెట్ 1983, జనవరి 1న అధికారికంగా ప్రారంభమైంది. కంప్యూటర్లను అనుసంధానం చేసే ఆర్పానెట్అనే ఈ కొత్త పద్ధతే తర్వాత వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ)నాందికి మార్గం సుగమం చేసింది. తొలుత మిలటరీ అవసరాల కోసం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా 1960లలో వేల్స్ శాస్త్రవేత్త డొనాల్డ్ డెవీస్ పలు నెట్‌వర్క్ డిజైన్లను రూపొందించారు. వీటి ఆధారంగానే తర్వాత ఆర్పానెట్‌కు రూపకల్పన జరిగింది. కొత్త ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ కోసం పాత వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా లోపరహిత ఆర్పానెట్వ్యవస్థకు రూపకల్పన ప్రక్రియ 1983, జనవరి 1న పూర్తె ఇంటర్‌నెట్ ఆవిర్భవించింది.

100వ సైన్స్ కాంగ్రెస్
100వ సైన్స్ కాంగ్రెస్‌ను కోల్‌కతాలో జనవరి 3న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. భారత్ భవిష్యత్ తీర్చిదిద్దేందుకు శాస్త్రంఅనే ఇతివత్తంతో ఈ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారత శాస్త్ర సాంకేతిక నవకల్పన విధానం-2013’ ను ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవిష్కరించారు. 2020 నాటికి ప్రపంచంలో శాస్త్ర రంగంలో శక్తిమంతమైన దేశాల్లో తొలి ఐదింటిలో భారత్‌ను నిలబెట్టాలనే లక్ష్యం దిశగా.. నవీకరణలపై దృష్టి పెట్టడం, పరిశోధక సంస్థల ఏర్పాటు, మహిళా శాస్త్రవేత్తల్ని ప్రోత్సహించడం, జీడీపీలో పరిశోధన-అభివృద్ధి వ్యయాన్ని రెండు శాతానికి పెంచడం వంటివి ఈ విధానం లక్ష్యాలు.

లక్ష్య పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన లక్ష్య క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిషాలోని గోపాలపూర్‌లో జనవరి 7న ఈ పరీక్ష నిర్వహించారు. 25 మీటర్ల పొడవు ఉండే ఈ క్షిపణి 100కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.

నౌకాదళంలో తర్కాష్
రష్యా నిర్మించిన బ్రహ్మోస్ ఆయుధాలతో కూడిన ఐ.ఎన్.ఎస్. తర్కాష్ను 2012 డిసెంబర్ 27న ముంబైలో నౌకా దళంలో చేర్చారు. రష్యా నుంచి మన దేశం కొనుగోలు చేసే మూడు యుద్ధ నౌకల్లో తర్కాష్ రెండోది. మొదటి యుద్ధ నౌక ఐ.ఎన్.ఎస్. తేగ్‌ను 2012 జూన్‌లో నౌకా దళంలో చేర్చారు. మూడో యుద్ధ నౌక ఐ.ఎన్.ఎస్. త్రిఖండ్ 2013 మధ్య కాలంలో భారత్ చేరుతుంది.
www.sakshieducation.com
Published on 1/10/2013 

No comments:

Post a Comment

Type here: