Meet Us Here

Pages

Monday, June 24, 2013

SPORTS_TELUGU_2013_CURRENTAFFAIRS(JAN TO JUNE)

జూన్ 2013 స్పోర్ట్స్ ::.


              

జస్టిన్‌ రోస్‌కు యూఎస్‌ ఓపెన్‌ గోల్ఫ్‌ టైటిల్‌
ఇంగ్లండ్‌కు చెందిన జస్టిన్‌ రోస్‌ యూఎస్‌ ఓపెన్‌ గోల్ఫ్‌ టైటిల్‌ గెలుచుకున్నాడు. జూన్‌ 17న అమెరికాలో ముగిసిన పోటీలో జసోన్‌ డే(ఆస్ట్రేలియా)రెండో స్థానంలో నిలిచాడు.

ఇండోనేసియా ఓపెన్‌ చాంప్స్‌ లీచోంగ్‌ వీ, జురుయ్‌ లీ
ఇండోనేసియా ఓపెన్‌ ప్రీమియర్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో టాప్‌ సీడ్స్‌ లీ చోంగ్‌ వీ (మలేసియా), జురుయ్‌ లీ (చైనా) విజేతలుగా నిలిచారు. జూన్‌ 16న జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో లీ చోంగ్‌ వీ జర్మనీకి చెందిన మార్క్‌ జ్విబ్లెర్‌పై విజయం సాధించగా, మహిళల సింగిల్స్‌ ఫైనల్లో జురుయ్‌ లీ (చైనా) జర్మనీకి చెందిన జూలియన్‌ షెంక్‌ను ఓడించింది.

ఆసియా జూనియర్‌ రెజ్లింగ్‌ చాంప్‌ భారత్‌
థాయ్‌లాండ్‌లో జూన్‌ 15న ముగిసిన ఆసియా జూనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఫ్రీ స్టయిల్‌ విభాగంలో భారత రెజ్లర్లు టీమ్‌ టైటిల్‌ను దక్కించుకున్నారు. ఓవరాల్‌గా భారత రెజ్లర్లు మొత్తం 17 పతకాలు సాధించారు. ఇందులో మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, తొమ్మిది కాంస్య పతకాలు ఉన్నాయి.

స్లోవేక్ జూనియర్ టీటీలో భారత్‌కు ఆరు పతకాలు
సెనెక్‌లో జరిగిన స్లోవేక్ జూనియర్ ఓపెన్ టీటీలో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు నాలుగు స్వర్ణ పతకాలతో సహా ఆరు పతకాలు సాధించారు. 15 ఏళ్ల సుతీర్థ ముఖర్జీ బాలికల సింగిల్స్ టైటిల్ గెలుపొందింది.

అష్రాఫుల్‌పై నిషేధం
బంగ్లా ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) లో రెండు మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసినట్లు అంగీకరించిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ అష్రాఫుల్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) వేటు వేసింది. ఇకపై అతను ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకుండా సస్పెండ్ చేసింది. ఫిక్సింగ్‌పై విచారణ జరుపుతున్న ఐసీసీ అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ఏసీఎస్‌యూ) పూర్తిస్థాయి నివేదిక ఇచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని బంగ్లా బోర్డ్ ప్రకటించింది. బీపీఎల్‌లో అష్రాఫుల్ ఢాకా గ్లాడియేటర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

వైజాగ్‌లో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ టోర్నీ
ఎఫ్‌ఐవీబీ ఇండియా ఓపెన్ బీచ్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌కు విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది. పురుషులు, మహిళల విభాగాల్లో సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు ఐదురోజులపాటు ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఇందులో రెండు విభాగాల్లో 32 జట్ల చొప్పున మొత్తం 64 జట్లు పోటీపడతాయని భారత వాలీబాల్ సమాఖ్య (వీఎఫ్‌ఐ) ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఫ్రెంచ్ ఓపెన్ విజేతలు సెరెనా, నాదల్
పురుషుల సింగిల్స్: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్‌కు చెందిన రాఫెల్ నాదల్ సాధించాడు. జూన్ 9న పారిస్‌లో జరిగిన ఫైనల్లో తన దేశానికే చెందిన డేవిడ్ ఫెరర్‌ను ఓడించి ఎనిమిదోసారి ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు. తద్వారా పురుషుల విభాగంలో ఒక గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టైటిల్‌ను అత్యధికసార్లు గెలుచుకున్న ఆటగాడిగా రికార్డు సష్టించాడు. నాదల్ కెరీర్‌లో ఇది 12వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ విజయంతో ట్రోఫీతోపాటు 15 లక్షల యూరోలు (’11 కోట్ల 31 లక్షలు) ప్రెజ్‌మనీగా లభించాయి.

మహిళల సింగిల్స్: మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ (అమెరికా) గెలుచుకుంది. జూన్ 8న పారిస్‌లో జరిగిన ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ మరియా షరపోవా (రష్యా)ను ఓడించి సెరెనా విలియమ్స్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 16వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో జమ చేసుకుంది. విజేతగా నిలిచిన సెరెనాకు 15 లక్షల యూరోలు (’11 కోట్ల 31 లక్షలు), రన్నరప్‌గా నిలిచిన షరపోవాకు 7 లక్షల 50 వేల యూరోలు (’ 5 కోట్ల 65 లక్షలు) ప్రెజ్‌మనీగా లభించాయి. తాజా విజయంతో 31 ఏళ్ల 247 రోజుల వయస్సులో ఫ్రెంచ్ ఓపెన్‌ను నెగ్గిన పెద్ద వయస్కురాలిగా సెరెనా గుర్తింపు పొందింది.

మహిళల డబుల్స్: ఎకటెరినా మకరోవా, ఎలెనా వెస్నినా (రష్యా)లు మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుపొందారు. వీరు ఫైనల్స్‌లో సారా ఎరానీ, రోబెర్టా విన్సీ (ఇటలీ)లను ఓడించారు.
పురుషుల డబుల్స్: బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్ (అమెరికా)లు గెలుచుకున్నారు. వీరు మైకేల్‌లోద్రా, నికోలస్ మహుత్ (ఫ్రాన్స్)లను ఓడించారు.

ఐబీఎల్‌లో ఢిల్లీ టీమ్ ఓనర్‌గా సచిన్
ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో పాల్గొనే ఒక జట్టుకు సచిన్ టెండ్కూలర్ యజమానిగా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ ఫ్రాంచైజీని అతడు సొంతం చేసుకున్నట్లు ఏపీ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి పున్నయ్య చౌదరి వెల్లడించారు. క్రికె ట్‌లోని ఐపీఎల్ తరహాలో సాగే ఐబీఎల్‌ను ఆగస్టు 14 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. లీగ్‌లో హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, పుణే, లక్నో, ముంబై, బెంగళూరు జట్లు పాల్గొంటాయి.

థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ విజేత శ్రీకాంత్
థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిదాంబి శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. జూన్ 9న బ్యాంకాక్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ప్రపంచ ఏడో ర్యాంకర్ బూన్‌సక్ పొన్సానాను ఓడించి శ్రీకాంత్ టైటిల్ సాధించాడు. ఈ క్రమంలో విదేశీగడ్డపై గ్రాండ్ ప్రి గోల్డ్ స్థాయి టోర్నీ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా శ్రీకాంత్ గుర్తింపు పొందాడు. ఛాంపియన్‌గా నిలిచిన శ్రీకాంత్‌కు 9వేల డాలర్ల ప్రెజ్‌మనీ (5 లక్షల 13 వేలు)తోపాటు ఏడువేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

కెనడా గ్రాండ్ ప్రి టైటిల్ విజేత వెటెల్
కెనడా గ్రాండ్ ప్రి టైటిల్‌ను రెడ్‌బుల్ డ్రెవర్ సెబాస్టియన్ వెటెల్ సాధించాడు. 70 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 32 నిమిషాల 09.143 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు.

ఆసియన్ కాంటినెంటల్ చెస్ ఛాంపియన్‌షిప్
మనీలాలో ముగిసిన ఆసియన్ కాంటినెంటల్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల టైటిల్‌ను చైనీస్ గ్రాండ్ మాస్టర్ లిచోవో గెలుచుకున్నాడు. మహిళల టైటిల్‌ను గ్రాండ్ మాస్టర్ హు ఆంగ్‌కియన్ సాధించింది. భారత్‌కు చెందిన అధిబాన్ భాస్కరన్ ఐదో స్థానంలో నిలిచి ప్రపంచకప్‌నకు అర్హత సాధించాడు. మరో క్రీడాకారుడు శశికిరణ్ కూడా ప్రపంచకప్‌నకు ఎంపికయ్యాడు.

రాహుల్‌కు మూడు స్వర్ణాలు
ఆసియా యూత్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ మూడు స్వర్ణ పతకాలను సాధించాడు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్ (ఏపీఎస్‌ఎస్) విద్యార్థిగా ఉన్న రాహుల్ ఇటీవల తాష్కెంట్‌లో ముగిసిన ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు రెండు పతకాలను అందించాడు.

కి వీస్‌తో టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్
న్యూజిలాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ (2-0) చేసింది. మే 28న ముగిసిన చివరి టెస్టులో ఇంగ్లండ్ 247 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది.

బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా దాల్మియా
అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని కొన్ని రోజులగా వస్తోన్న డిమాండ్‌లకు శ్రీనివాసన్ తలొగ్గారు. స్పాట్ ఫిక్సింగ్‌లో తన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ విచారణ ముగిసేవరకు అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తాత్కాలిక అధ్యక్షుడిగా బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియా నియమితులయ్యారు. స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి సంజయ్ జగ్దాలేతోపాటు కోశాధికారి అజయ్ షిర్కే, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తమ పదవులకు రాజీనామా చేశారు.

స్నూకర్ ఛాంప్ భారత్
ఆసియా టీమ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ విజేతగా నిలిచింది. దోహాలో జరిగిన ఈవెంట్‌లో మానన్ చంద్ర, బ్రిజేష్ దమాని, అలోక్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో ఇరాన్‌ను ఓడించింది.

మే 2013 స్పోర్ట్స్ ::.

              
భారత బాక్సర్ల పతకాల రికార్డు
లిమాసోల్ బాక్సింగ్ కప్ అంతర్జాతీయ టోర్నీలో భారత బాక్సర్లు చరిత్ర సృష్టించారు. సైప్రస్‌లోని లిమాసోల్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో పది పతకాలు సాధించారు. ఇందులో నాలుగు స్వర్ణాలున్నాయి. కర్ణాటకలో స్థిరపడిన తెలుగుతేజం వి.దుర్గారావు (56 కిలోలు) సహా మదన్‌లాల్ (52 కిలోలు), మన్‌దీప్ జంగ్రా (69 కిలోలు), ప్రవీణ్ (ప్లస్ 91 కిలోలు) పసిడి పతకాలు గెలుపొందారు.

ఐపీఎల్ నుంచి తప్పుకున్న పుణే వారియర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి వైదొలుగుతున్నట్లు పుణే వారియర్స్ యజయాని సహారా గ్రూప్ ప్రకటించింది.బీసీసీఐతో ఉన్న ఆర్థిక విభేదాలే ఇందుకు కారణం. ఫ్రాంఛైజీ ఫీజును తగ్గించకపోవడం, జట్టు బ్యాంక్ గ్యారెంటీని సొమ్ము చేసుకోవాలని బీసీసీఐ నిర్ణయించడంతో ఐపీఎల్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు సహారా పేర్కొంది. బీసీసీఐ వైఖరితో విసుగుచెందిన తాము వచ్చే ఏడాది నుంచి టీమ్ ఇం డియా స్పాన్సర్‌గా కూడా తప్పుకుంటామని స్పష్టం చేసింది.

ఐపీఎల్ తరహాలో టెన్నిస్ లీగ్
ఐపీఎల్ తరహా టెన్నిస్ లీగ్‌కు భారత అగ్రశ్రేణి ఆటగాడు మహేశ్ భూపతి శ్రీకారం చుట్టాడు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) పేరిట నిర్వహించనున్న ఈ టోర్నీకి ప్రపంచ నెంబర్‌వన్ నోవక్ జోకోవిచ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. పారిస్‌లో వచ్చే ఏడాది చివర్లో ఈ లీగ్ జరగనుంది. ఆసియాకు సంబంధించిన ఆరు ఫ్రాంచైజీలతో ఐపీటీఎల్ జరుగుతుంది. ఒక్కో ఫ్రాంచైజీలో 6 నుంచి 10 మంది క్రీడాకారులుంటారు. వీరి కోసం ఆయా ఫ్రాంచైజీలు రూ. 22 కోట్ల (4 మిలియన్ డాలర్లు) నుంచి రూ. 55 కోట్లు (10 మిలియన్ డాలర్లు) వెచ్చించాల్సి ఉంటుంది.

రోస్‌బర్గ్‌కు మొనాకో గ్రాండ్ ప్రి
ఫార్ములా వన్ మొనాకో గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడస్ జట్టు డ్రై వర్ నికో రోస్‌బర్గ్ సాధించాడు. మోంటెకార్లోలో మే 26న జరిగిన రేసులో రోస్‌బర్గ్ మొదటిస్థానంలో నిలవగా, రెడ్‌బుల్ డ్రై వర్ వెటెల్ రెండో స్థానం సాధించాడు.

ఐపీఎల్-6 విజేత ముంబై
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)- 6 విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. కోల్‌కతాలో మే 26న జరిగిన ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోవడం ఇదే తొలిసారి. చెన్నై జట్టు ఐదుసార్లు ఫైనల్స్‌కు వెళ్లి రెండుసార్లు టైటిల్ గెలుపొందింది. విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు రూ.10 కోట్లు, రన్నరప్ చెన్నైకు రూ.7.5 కోట్లు ప్రై జ్‌మనీ దక్కింది.

ఐపీఎల్ విశేషాలు:
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్- కీరన్ పొలార్డ్
వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసినవారికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్-చెన్నై సూపర్‌కింగ్స్‌కు చెందిన మైక్
హస్సీ (733 పరుగులు)
అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి ఇచ్చే పర్పుల్ క్యాప్ - చెన్నై సూపర్‌కింగ్స్‌కు చెందిన డ్వేన్ బ్రేవో (32 వికెట్లు)

ఉత్తమ యువ ఆటగాడు-సంజు శామ్సన్ (రాజస్థాన్ రాయల్స్)
అత్యంత విలువైన ఆటగాడు - షేన్ వాట్సన్ (రాజస్థాన్ రాయల్స్)
ఫెయిర్ ప్లే అవార్డు - చెన్నై సూపర్ కింగ్స్

ఆర్చరీ ప్రపంచకప్‌లో దీపికకు 2 రజతాలు
చైనాలోని షాంఘైలో జరిగిన ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత్‌కు నాలుగో స్థానం లభించింది. జార్ఖండ్‌కు చెందిన ఆర్చర్ దీపిక కుమారి రెండు రజత పతకాలు సాధించింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత ఫైనల్లో దీపిక.. ఓక్ హీ యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. రికర్వ్ మిక్స్‌డ్ విభాగం ఫైనల్లో దీపిక-జయంత తాలుక్‌దార్ జోడీ లోరిగ్ ఖాతునా-బ్రాడీ ఎలిసన్ (అమెరికా) చేతిలో ఓడి రజతం దక్కించుకుంది.

కర్ణాటకకు రంగస్వామి కప్ హాకీ టైటిల్
64వ సీనియర్ (మెన్) నేషనల్ హాకీ చాంపియన్‌షిప్- రంగస్వామి కప్‌ను కర్ణాటక గెలుచుకుంది. మే 16న బెంగళూరులోని కేఎస్‌హెచ్‌ఏ హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఉత్తరప్రదేశ్ జట్టును కర్ణాటక జట్టు ఓడించింది. టోర్నీ చరిత్రలో టైటిల్‌ను కర్ణాటక గెలుచుకోవడం ఇదే తొలిసారి.

నార్వే సూపర్ చెస్ టోర్నమెంట్‌లో ఆనంద్‌కు నాలుగో స్థానం
నార్వే సూపర్ చెస్ టోర్నమెంట్ టైటిల్‌ను సెర్జీ కర్జాకిన్ (రష్యా) గెలుచుకున్నాడు. నార్వేలో మే 18న ముగిసిన పోటీల్లో కర్జాకిన్ టైటిల్ గెలుచుకోగా, భారత్‌కు చెందిన విశ్వనాథన్ ఆనంద్ నాలుగో స్థానంలో నిలిచాడు.

భారత్‌కు ఆసియన్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్
తొలిసారిగా జరిగిన ఆసియన్ బాస్కెట్‌బాల్ 33 చాంపియన్‌షిప్‌లో భారత మహిళాజట్టు టైటిల్‌ను గెలుచుకుంది. దోహా (ఖతార్)లో మే 16న జరిగిన ఫైనల్లో మంగోలియాను భారత్ ఓడించింది. పురుషుల టైటిల్‌ను ఖతార్ జట్టు గెలుచుకుంది. ఇది ఫైనల్లో సౌదీ అరేబియాను ఓడించింది.

నాదల్, సెరెనాలకు రోమ్ మాస్టర్స్ టైటిల్స్
రోమ్ మాస్టర్స్ టెన్నిస్ టైటిల్స్‌ను రాఫెల్ నాదల్ (స్పెయిన్), సెరెనా విలియమ్స్ (అమెరికా) గెలుచుకున్నారు. మే 19న రోమ్‌లో ముగిసిన పోటీల్లో రోజర్ ఫెదరర్‌ను ఓడించి నాదల్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇది నాదల్‌కు ఏడో రోమ్ మాస్టర్స్ టైటిల్. విక్టోరియా అజరెంకాను ఓడించి సెరెనా విలియమ్స్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది. సెరెనాకు ఇది 51వ టైటిల్. పురుషుల డబుల్స్ టైటిల్‌ను భూపతి, బోపన్న (భారత్) జోడీని ఓడించి బ్రయాన్ బ్రదర్స్ (అమెరికా) గెలుచుకున్నారు.

ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ పోటీల్లో స్పాట్ ఫిక్సింగ్ జరిగింది. ఫిక్సింగ్‌కు పాల్పడిన ముగ్గురు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లను ఢిల్లీ పోలీసులు మే 16న అరెస్టు చేశారు. వీరిలో శాంతకుమారన్ శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకిత్ అనిల్ చవాన్‌లు ఉన్నారు. వీరితో పాటు నేరానికి పాల్పడిన 11 మంది బుకీలను కూడా అరెస్టు చేశారు. ముగ్గురు క్రికెటర్లను సస్పెండ్ చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు మే 5, 9, 15న ఆడిన మ్యాచ్‌ల్లో స్పాట్ ఫిక్సింగ్ జరిగినట్లు తెలిసింది.

స్పెయిన్ గ్రాండ్‌ప్రి విజేత అలోన్సో
స్పెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో ఫెరారీ డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో విజేతగా నిలిచాడు. మే 12న జరిగిన 66 ల్యాప్‌ల రేసును గంటా 39 నిమిషాల 16.596 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అలోన్సోకిది రెండో విజయం కాగా, మొత్తం మీద కెరీర్‌లో 32వ విజయం. తాజా విజయంతో ఫార్ములావన్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన వారి జాబితాలో నాలుగోస్థానంలో నిలిచాడు. 91 టైటిల్స్‌తో ైమైకేల్ షుమాకర్ మొదటి స్థానంలో ఉన్నాడు.

సుల్లీవాన్‌కు ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్
ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఇంగ్లండ్‌కు చెందిన రోన్నీ ఓ సుల్లీవాన్ గెలుచుకున్నాడు. ఇంగ్లండ్‌లోని షీ ఫీల్డ్‌లో మే 7న ముగిసిన పోటీలో బార్రీ హాకిన్స్‌ను సుల్లీవాన్ ఓడించాడు. ఇది సుల్లీవాన్‌కు ఐదో టైటిల్.

కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్
పురుషుల సింగిల్స్: జాన్ జియాన్(సింగపూర్) గెలుచుకున్నాడు. మే 10న న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్లో లీహూ (సింగపూర్)ను ఓడించాడు.

మహిళల సింగిల్స్:
మో జాంగ్ (కెనడా) మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది. ఫెనల్లో మెంగ్యూ (సింగపూర్)ను ఓడించింది.

పురుషుల డబుల్స్: 
జాన్ జియాన్, యాంగ్ జీ (సింగపూర్) గెలుచుకున్నారు. వీరు క్రిస్టఫర్ దొరాన్, శామ్యూల్ వాల్కర్ (ఇంగ్లండ్) జోడీని ఓడించారు.

మహిళల డబుల్స్: 
ఫెంగ్ తియాన్వీ, యు యెంగ్యూ (సింగపూర్) గెలుచుకున్నారు. వీరు జొయన్నా పార్కర్, కెల్లీ సిబ్లే (ఇంగ్లండ్) జోడీని ఓడించారు.

సెరెనాకు 50వ టైటిల్
అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మరో మైలురాయిని చేరుకుంది. మే 12న ముగిసిన మాడ్రిడ్ మాస్టర్స్ ప్రీమియర్ టెన్నిస్ టోర్నీలో విజేతగా నిలిచి 50వ డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో రష్యా క్రీడాకారిణి మరియా షరపోవాపై విజయం సాధించింది. తద్వారా ప్రస్తుతం కెరీర్‌ను కొనసాగిస్తున్న క్రీడాకారిణుల్లో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా సెరెనా గుర్తింపు సాధించింది. మొత్తంమీద చూస్తే 50 అంతకంటే ఎక్కువ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన పదో క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.

హర్యానాకు జాతీయ మహిళా హాకీ ఛాంపియన్‌షిప్
జాతీయ మహిళా హాకీ ఛాంపియన్‌షిప్‌ను హర్యానా గెలుచుకుంది. ఏప్రిల్ 30న లక్నోలో జరిగిన ఫైనల్స్‌లో రైల్వేస్‌ను ఓడించి హర్యానా టైటిల్ సాధించింది.

సింధుకు మలేసియా ఓపెన్ టైటిల్
ఆంధ్రప్రవేశ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ సాధించింది. దీంతో సైనా నెహ్వాల్ తర్వాత గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీ గెలిచిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. పిన్నవయసులో ఈ ఘనత సాధించిన భారతీయ క్రీడాకారిణిగా సింధు రికార్డు సష్టించింది.

ఐసీసీలో ప్రతినిధిగా శివరామకష్ణన్
భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామ కష్ణన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో ఆటగాళ్ల తరపున ప్రతినిధిగా మే 6న నియమితులయ్యారు. మరో సభ్యుడిగా శ్రీలంకకు చెందిన సంగక్కర ఉన్నారు. ఈ కమిటీకి భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
www.sakshieducation.com
Published on 5/9/2013 4:23:00 PM


Other Current Affairs
 ఏప్రిల్ 2013 స్పోర్ట్స్ ::.

              
ఐపీఎల్‌లో గేల్ రికార్‌‌డ స్కోర్
ఆరో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో బెంగళూరు జట్టు తరపున ఆడుతున్న క్రిస్‌గేల్ అత్యధికంగా 175 పరుగులు చేసి రికార్డు సష్టించాడు. ఏప్రిల్ 23న పుణె వారియర్‌‌సతో జరిగిన మ్యాచ్‌లో గేల్ 66 బంతుల్లో 175 పరుగులు చేయడంతో మొత్తం స్కోరు 263కు చేరింది. గేల్ తొలి 30 బంతుల్లోనే 100 పరుగులు పూర్తిచేశాడు. ఇందులో 17 సిక్స్‌లు, 13 బౌండరీలు ఉన్నాయి.

ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ విజేతలు చోంగ్ వీ, ఇంతనోవ్ రత్సనోక్
ఇండియా ఓపెన్ సూపర్ సీరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను లీ చోంగ్ వీ (మలేషియా), మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఇంతనోవ్ రత్సనోక్ (థాయ్‌లాండ్) గెలుచుకున్నారు. న్యూఢిల్లీలో ఏప్రిల్ 28న ముగిసిన ఫైనల్స్‌లో కెనిచి టాగో (జపాన్)ను లీ చోంగ్‌లీ, మహిళా విభాగంలో జులియన్ షెంకో (జర్మనీ)ని ఇంతనోవ్ రత్సనోక్ ఓడించారు.
మహిళల డబుల్స్ మియుకి మేదా - సటోకో సుయోత్సవా (జపాన్), పురుషుల డబుల్స్ టైటిల్‌ను జియోలాంగ్ లియు - జిహాన్ కియు (చైనా)లు గెలుచుకున్నారు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో తొంతోవీ అహ్మద్ - లిలి యానా నాత్సినో (ఇండోనేషియా) విజయం సాధించారు.

నాదల్‌కు బార్సిలోనా ఓపెన్
బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను రాఫెల్ నాదల్ గెలుచుకున్నాడు. బార్సిలోనాలో ఏప్రిల్ 28న జరిగిన ఫైనల్స్‌లో నికోలస్ అల్మాగ్రోను నాదల్ ఓడించాడు. నాదల్‌కు ఇది 8వ బార్సిలోనా ఓపెన్ టైటిల్.

వెటెల్‌కు బహ్రెయిన్ గాండ్ ప్రి
ఫార్ములా వన్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిలో రెడ్‌బుల్ డ్రెవర్ సెబాస్టియన్ వెటెల్ విజయం సాధించాడు. మనామాలో ఏప్రిల్ 21న జరిగిన పోటీలో లోటస్ డ్రెవర్ రైకోనెస్ రెండో స్థానంలో నిలిచాడు.

ఆసియా రెజ్లింగ్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ క్రీడాకారుడు అమిత్ కుమార్ స్వర్ణం సాధించాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 55 కిలోల విభాగంలో అమిత్‌కు ఈ పతకం దక్కింది. ఏప్రిల్ 20న ఫైనల్లో ఉత్తర కొరియాకు చెందిన క్యోంగ్ యాంగ్‌పై విజయం సాధించాడు. ఫ్రీస్టెయిల్ 66 కిలోల విభాగంలో అమిత్ కుమార్ దంకర్ స్వర్ణం సాధించాడు ఈ పోటీల్లో భారత్ మొత్తం 9 పతకాలు సాధించింది. ఫ్రీస్టెల్ విభాగంలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా ఓవరాల్ చాంపియన్‌గా నిలవగా భారత్‌కు మూడో స్థానం దక్కింది.

మాంటెకార్లో విజేత జకోవిచ్
మాంటెకార్లో మాస్టర్స్ టెన్నిస్ టైటిల్‌ను నోవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు. మాంటెకార్లోలో ఏప్రిల్ 21న జరిగిన ఫైనల్లో రఫెల్ నాదల్‌ను ఓడించాడు.

ఆసియా సీనియర్ జూడోలో భారత్‌కు కాంస్యం
బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా సీనియర్ జూడో టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి అనితా చాను కాంస్య పతకం సాధించింది.

సిడ్నీ గ్రౌండ్‌లో సచిన్ మైనపు బొమ్మ
ఆస్ట్రేలియాలోని ప్రతిష్టాత్మక సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(ఎస్‌సీజీ)లో భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మైనపు బొమ్మను ఏప్రిల్ 18న ఆవిష్కరిం చారు. త్వరలో దీన్ని మేడమ్ టుస్సాడ్‌‌స సిడ్నీ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు.

అలోన్సోకు చైనీస్ గ్రాండ్ ప్రి
ఫెరారీ డ్రెవర్ ఫెర్నాండో అలోన్సో ఫార్ములా వన్ చైనీస్ గ్రాండ్ ప్రి టైటిల్ గెలుచుకున్నాడు. షాంఘైలో ఏప్రిల్ 14న ముగిసిన రేసులో అలోన్సో మొదటి స్థానం సాధించగా, రెండు, మూడు స్థానాల్లో రైకోనెస్, హోమిల్టన్‌లు నిలిచారు. రెడ్‌బుల్ డ్రైవర్ వెటల్‌కు నాలుగో స్థానం దక్కింది.

తమిళనాడు, రైల్వేలకు బాస్కెట్‌బాల్ టైటిల్స్
నేషనల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది. న్యూఢిల్లీలో ఏప్రిల్ 11న ముగిసిన ఫైనల్లో రైల్వేస్‌ను ఓడించింది. మహిళల విభాగంలో రైల్వేస్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో తమిళనాడును ఓడించింది.

అగస్టా మాస్టర్స్ విజేత స్కాట్
అగస్టా మాస్టర్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌ను ఆస్ట్రేలియాకు చెందిన అడమ్ స్కాట్ గెలుచుకున్నాడు. ఏప్రిల్ 14న ముగిసిన ఈ టోర్నమెంట్‌లో ఏంజెల్ కాబ్రెరా రన్నరప్‌గా నిలిచాడు.

నార్త్-ఈస్ట్ గేమ్స్
నార్త్-ఈస్ట్ గేమ్స్ ఏప్రిల్ 8 నుంచి 11 వరకు మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో జరిగాయి. ఇందులో మణిపూర్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. నార్త్-ఈస్ట్ రీజియన్‌లో క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ క్రీడలను ప్రారంభించారు. ఈ క్రీడలను తొలిసారి 1986-87 సీజన్‌లో ఇంఫాల్‌లో నిర్వహించారు.

డేవిస్ కప్ అవార్డులు
భారత్‌కు చెందిన నలుగురు టెన్నిస్ క్రీడాకారులకు ఏప్రిల్ 6న బెంగళూరులో డేవిస్ కప్ కమిట్‌మెంట్ అవార్డులను ప్రదానం చేశారు. పురస్కారాలను అందుకున్న వారీలో రామనాథన్ కష్ణన్, రమేష్ కష్ణన్ , ఆనంద్ అమత్‌రాజ్, మహేశ్ భూపతి ఉన్నారు. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) ఈ అవార్డులను ఏర్పాటు చేసింది.

షూటింగ్‌లో రాహీకి స్వర్ణం
దక్షిణ కొరియాలోని చాంగోవాన్‌లో ఏప్రిల్ 4న జరిగిన అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మహిళల 25 మీటర్ల ఫిస్టల్ విభాగంలో భారత మహిళ షూటర్ రాహీ సర్నోబత్ స్వర్ణ పతకం సాధించింది. దీంతో ఈ టోర్నమెంట్‌లో స్వర్ణం గెలుచుకున్న తొలి భారత ఫిస్టల్ షూటర్‌గా గుర్తింపు పొందింది. ఇదే టొర్నమెంట్‌లో భారత షూటర్ ప్రకాశ్ సంజప్ప కాంస్య పతకం గెలుచుకున్నాడు.

రూపేష్‌కు ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్
ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్‌ను ప్రపంచ చాంపియన్ రూపేష్ షా(భారత్) గెలుచుకున్నాడు. ఇండోర్‌లో ఏప్రిల్ 7న జరిగిన ఫైనల్లో అలోక్ కుమార్‌ను ఓడించాడు. గతంలో భారత్‌కు చెందిన గీత్ సేథీ, దేవేందర్ జోషి, పంకజ్ అద్వానీ, అలోక్ కుమార్ ఈ చాంపియన్ షిప్‌ను గెలుచుకున్నారు.

ఓర్మ్‌బేకి పానాసోనిక్ ఓపెన్ గోల్ప్ టైటిల్
ఆస్ట్రేలియాకు చెందిన వాడే ఓర్మ్‌బే పానాసోనిక్ ఓపెన్ గోల్ఫ్ చాంపియన్ షిప్‌ను గెలుచుకున్నాడు. న్యూఢిల్లీలో 2013 ఏప్రిల్ 7న జరిగిన పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన భూచు రువాంగిట్ రెండోస్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన శివ్ కపూర్‌కు నాల్గో స్థానం దక్కింది.

ఏషియన్ చెస్ జూనియర్ చాంపియన్‌షిప్
భారత్‌కు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ నారాయణన్ శ్రీనాథ్ ఏషియన్ జానియర్ చెస్ చాంపియన్‌షిప్ బాలుర టైటిల్ గెలుచుకున్నాడు. షార్జాలో ఏప్రిల్ 6న ముగిసిన పోటీల్లో భారత్‌కు చెందిన సహజ్ గ్రోవర్ రెండోస్థానంలో నిలిచాడు. బాలికల టైటిల్‌ను వియత్నాంకు చెందిన థీ కిమ్ ఫుంగ్ గెలుచుకుంది. భారత్‌కు చెందిన జె. శరణ్య రెండోస్థానంలో నిలిచింది. 
మార్చి 2013 స్పోర్ట్స్ ::.

              
ప్రపంచ నెంబర్ వన్ గోల్ఫర్ ఉడ్స్
అమెరికా గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ ఉడ్స్‌కు ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు దక్కింది. 2010 అక్టోబర్ తర్వాత ర్యాకింగ్స్‌లో ఉడ్స్ మొదటి స్థానానికి వచ్చాడు. 2013 మార్చి 25న అర్నాల్డ్ పామెర్ ఇన్విటేషన్ ఇంటర్నేషనల్ టోర్నీని గెలుచుకోవడంతో ఉడ్స్‌కు మొదటి స్థానం దక్కింది.

సెరీనా విలియమ్స్‌కు మియామి టైటిల్
వరల్డ్ నెంబర్ వన్ సెరీనా విలియమ్స్ డబ్ల్యూటీఏ మియా మీ మహిళల సింగి ల్స్ టైటిల్ గెలుచుకుంది. మియామీలో మార్చి 30న జరిగిన ఫైనల్స్‌లో వరల్డ్ నెంబర్ 2 మరియా షరపోవాను సెరీనా ఓడించింది. సెరీనా మియామీ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకోవడం ఇది ఆరోసారి.
పురుషుల సింగిల్స్ మియామీ మాస్టర్స్ టైటిల్‌ను ఆండీముర్రె గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో ఫైను ముర్రే ఓడించాడు.

గుజరాత్‌కు ముస్తాక్ అలీట్రోఫీ
సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ఛాంపియన్ షిప్‌ను గుజరాత్ జట్టు గెలుచుకుంది. ఇండోర్‌లో మార్చి 31న జరిగిన ఫైనల్స్‌లో పంజాబ్‌ను గుజరాత్ ఓడించింది.

భారత్‌కు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ -గవాస్కర్ టెస్ట్ క్రికెట్ సిరీస్‌ను భారత్ 4-0 తేడాతో గెలుచుకుంది. 81 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో.. ద్వైపాక్షిక సిరీస్‌లో నాలుగు టెస్ట్ మ్యాచ్‌లను గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ పురస్కారం రవిచంద్రన్ అశ్విన్ (భారత్)కు దక్కింది.

నాదల్‌కు ఇండియన్ వెల్స్ టైటిల్
ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రాఫెల్ నాదల్ గెలుచుకున్నాడు. ఇండియన్ వెల్స్‌లో మార్చి 18న జరిగిన ఫైనల్లో జువాన్ మార్టిన్ డెల్ పోర్ట్‌ను ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను మరియా షరపోవా గెలుచుకుంది.

వెటల్‌కు మలేసియా గ్రాండ్ ప్రి టైటిల్
మలేసియా గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ టైటిల్‌ను రెడ్‌బుల్ డ్రెవర్ సెబాస్టియన్ వెటల్ గెలుచుకున్నాడు. సెపాంగ్ (మలేసియా)లో మార్చి 25న జరిగిన పోటీల్లో మార్క్ వెబర్ రెండో స్థానంలో నిలిచాడు.

స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్స్
పురుషుల సింగిల్స్: చైనాకు చెందిన గ్జెంగ్ మింగ్ వాంగ్ గెలుచుకున్నాడు. బాసెల్‌లో మార్చి 18న జరిగిన ఫైనల్లో పెంగూ డూ (చైనా)ను ఓడించాడు. మహిళల సింగిల్స్: షిక్సియాన్ వాంగ్ (చైనా) గెలుచుకుంది. ఫైనల్లో రాచ్‌నోక్ ఇంతనోన్ (థాయ్‌లాండ్) ను ఓడించింది.

వెస్ట్ జోన్‌కు దేవధర్ ట్రోఫీ
దేశీయంగా నిర్వహించే జోనల్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ దేవధర్ ట్రోఫీని వెస్ట్‌జోన్ జట్టు గెలుచుకుంది. మార్చి 13న గువాహటిలో జరిగిన ఫైనల్లో నార్త్‌జోన్‌ను ఓడించింది.

వరల్డ్ ఉమెన్ టీం చెస్ చాంప్ ఉక్రెయిన్
వరల్డ్ ఉమెన్ టీం చెస్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌ను ఉక్రెయిన్ జట్టు గెలుచుకుంది. కోజికోడ్‌లో మార్చి 13న ము గిసిన ఈ టోర్నమెంట్‌లో చైనా రెండో స్థానం, భారత్ ఐదో స్థానం దక్కించుకున్నాయి.

ధావన్ రికార్డు
భారత క్రికెటర్ శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాతో మొహా లీలో జరిగిన మూడో టెస్ట్ మ్యా చ్‌లో సెంచరీ (187 పరుగులు) సాధించాడు. తద్వారా తొలి మ్యాచ్‌లోనే అత్యంత వేగంగా (85 బంతుల్లో) శతకాన్ని సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సష్టించాడు. అంతేకాకుండా భారత్ తరఫున అడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా గుండప్ప విశ్వనాథ్ (137) రికార్డును శిఖర్ అధిగమించాడు. అరంగేట్రం టెస్ట్‌లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న నాలుగో భారత ఆటగాడిగా ధావన్ (గతంలో ప్రవీణ్ ఆమ్రే, ఆర్పీ సింగ్, అశ్విన్ ఈ ఘనత సాధించారు) నిలిచాడు.

ఆల్ ఇంగ్లండ్ చాంప్ టిన్ బౌన్
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల టైటిల్‌ను డెన్మార్క్ క్రీడాకారిణి టిన్ బౌన్ గెలుచుకుంది. బర్మింగ్‌హమ్‌లో మార్చి 10న జరిగిన ఫైనల్లో రచనోక్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. తద్వారా ఈ టైటిల్ సాధించిన అతి పెద్ద వయస్కురాలిగా 33 ఏళ్ల టిన్‌బాన్ రికార్డు సష్టించింది. పురుషుల విభాగంలో చెన్ లాంగ్ (చైనా) విజేతగా నిలిచాడు. ఫైనల్లో లీచోంగ్ లీ (మలేషియా)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్ విభాగంలో లీ క్సియోలంగ్-క్వి జిహన్ (చైనా) జోడి విజేతగా నిలిచింది. మహిళల డబుల్స్ టైటిల్‌ను వాంగ్ జియోలీ-యు యాంగ్ (చైనా) ద్వయం గెలుచుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను టోంటవి అహ్మద్- లిల్‌యానక్ష నట్సిల్ (ఇండోనేషియా) జోడి గెలుచుకుంది.

ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో అవార్డులు
ఉత్తమ వన్డే ఇన్నింగ్స్: విరాట్ కోహ్లి (శ్రీలంకపై 133 పరుగులు)
ఉత్తమ వన్డే బౌలింగ్: తిసార పెరీరా (పాక్‌పై 6/44)
ఉత్తమ టెస్టు ఇన్నింగ్స్: కెవిన్ పీటర్సన్ (భారత్‌పై 186 పరుగులు)
ఉత్తమ టెస్టు బౌలింగ్: వెర్నాన్ ఫిలాండర్ (ఇంగ్లండ్‌పై 5/30)
ఉత్తమ టి20 ఇన్నింగ్స్: మార్లోన్ శామ్యూల్స్ (శ్రీలంకపై 78 పరుగులు)
ఉత్తమ టి20 బౌలింగ్: లసిత్ మలింగ (ఇంగ్లండ్‌పై 5/31)

అత్యుత్తమ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ ధోని
అత్యుత్తమ టెస్ట్ క్రికెట్ కెప్టెన్‌గా ఎం.ఎస్. ధోని నిలిచాడు. హైద రాబాద్‌లో మార్చి 5న ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌ను భారత్ గెలుచుకోవడంతో ధోనికి ఈ ఘనత దక్కింది. ధోని సారథ్యంలో భారత జట్టు ఆడిన 45 టెస్ట్‌ల్లో 22 టెస్టుల్లో విజయం సాధించింది. ఇప్పటివరకు సౌరవ్ గంగూలీ సారథ్యం లో భారతజట్టు ఆడిన 49 టెస్టుల్లో 21 టెస్టులు గెలిచిన రికార్డు ఉంది.

ముష్ఫికర్ రికార్డు
గాలె (శ్రీలంక)లో బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య మార్చి 8 నుంచి12 వరకు జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ డబుల్ సెంచరీ (200) చేశాడు. తద్వారా ఈ ఘనత దక్కించుకున్న తొలి బంగ్లా ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇదే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తమ టెస్టు చరిత్రలో అత్యధిక స్కోరును కూడా (638) నమోదు చేసింది.

నేషనల్ టీమ్ చెస్ టోర్నీ
నేషనల్ టీమ్ చెస్ టోర్నమెంట్ పురుషుల టైటిల్‌ను పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) జట్టు గెలుచుకుంది. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 26న జరిగిన ఫైనల్లో ఎయిర్ ఇండియాను ఓడించింది. మహిళల విభాగంలో ఎయిర్ ఇండియా జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో తమిళనాడును ఓడించింది.

దుబాయ్ ఓపెన్ డ్యూటీ ఫ్రీ చాంప్ భూపతి జోడి
దుబాయ్ ఓపెన్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను మహేశ్ భూపతి (భారత్) -మైకేల్ లోద్రా (ఫ్రాన్స్) ద్వయం గెలుచుకుంది. మార్చి 2న జరిగిన ఫైనల్లో లిండ్ స్టెట్ (స్వీడన్)-జిమోనిచ్ (సెర్బియా) జోడిపై గెలిచింది. భూపతి కెరీర్‌లో ఇది 52వ డబుల్స్ టైటిల్. ఈ విజయంతో ఏటీపీ సర్క్యూట్‌లో అత్యధిక డబుల్స్ టైటిల్స్ సాధించిన భారతీయ క్రీడాకారుడిగా భూపతి గుర్తింపు పొందాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో నోవాక్ జోకోవిచ్ విజేతగా నిలిచాడు.

విజయ్ హజారే ట్రోఫీ విజేత ఢిల్లీ
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టు చాంపియన్‌గా నిలిచింది. మార్చి 3న విశాఖపట్నంలో జరిగిన ఫైనల్లో అస్సాంపై విజయం సాధించింది.

సంతోష్ ట్రోఫీ విజేత సర్వీసెస్
జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సంతోష్ ట్రోఫీని సర్వీసెస్ జట్టు గెలుచుకుంది. మార్చి 3న కొచిలో జరిగిన ఫైనల్లో కేరళ జట్టుపై విజయం సాధించింది.

మెక్సికన్ ఓపెన్ చాంప్ నాదల్
మెక్సికన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ను రాఫెల్ నాదల్ (స్పెయిన్) గెలుచుకున్నాడు. మార్చి 3న ఆకాపుల్కో (మెక్సికో)లో జరిగిన ఫైనల్లో డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) పై విజయం సాధించాడు. నాదల్ కెరీర్‌లో ఇది 52వ సింగిల్స్ టైటిల్ కాగా క్లే కోర్టులపై 38వది. మహిళల విభాగంలో ఇటలీకి చెందిన సారా ఎర్రానీ విజేతగా నిలిచింది.
w
ఫిబ్రవరి 2013 స్పోర్ట్స్ ::.

              
సానియా-బెథానీ జోడికి దుబాయ్ టైటిల్
దుబాయ్ డ్యూటీ ఫ్రీ డబ్ల్యూటీఏ చాంపియన్‌షిప్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సానియా మీర్జా (భారత్)- బెథానీ (అమెరికా) ద్వయం గెలుచుకుంది. వీరు ఫిబ్రవరి 23న జరిగిన ఫైనల్లో నాదియా పెత్రోవా (రష్యా)- కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జోడిపై సానియా, బెథానీ జంట విజయం సాధించారు.

ధోని రికార్డు
ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నైలో ఫిబ్రవరి 26న ముగిసిన మొదటి క్రికెట్‌టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ ఎం.ఎస్.ధోని డబుల్ సెంచరీ (224) చేశాడు. తద్వారా భారత్ తరఫున డబుల్ సెంచరీ చేసిన మొదటి వికెట్ కీపర్‌గా రికార్డు సష్టించాడు. ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ చేసిన భారత కెప్టెన్‌గా కూడా ఘనత దక్కించుకున్నాడు.

2020 ఒలింపిక్స్ నుంచి రెజ్లింగ్ తొలగింపు
2020 రియోడిజనిరో ఒలింపిక్స్ నుంచి రెజ్లింగ్ (కుస్తీ) క్రీడను తొలగించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐ.ఒ.సి) ఫిబ్రవరి 12న నిర్ణయించింది. దీని స్థానంలో మరో కొత్త క్రీడకు అవకాశం కల్పిస్తారు. టీవీ రేటింగ్‌‌స, టికెట్ల అమ్మకాలు, యాంటీ డోపింగ్, క్రీడ పట్ల ఉన్న విశ్వవ్యాప్త ఆదరణ వంటి అంశాలను పరిశీలించి, రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్‌ను నిర్వహించి రెజ్లింగ్‌ను తొలగించేందుకు ఐఒసి నిర్ణయించింది. 1896 ఏథెన్‌‌సలో ఆధునిక ఒలింపిక్ క్రీడలు మొదలైన తర్వాత 1900 ఒలింపిక్స్ మినహా ప్రతి ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ మెడల్ ఈవెంట్‌గా ఉంది. ఈ క్రీడలో భారత్ నాలుగు పతకాలు సాధించింది. లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు చెందిన సుశీల్‌కుమార్ 66 కిలోల విభాగంలో రజతం, యోగేశ్వర్ 60 కిలోల విభాగంలో కాంస్యం సాధించారు. బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ కాంస్యం గెలిచాడు. 1952లో ఖాషాబా జాదవ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలిపతకం రెజ్లింగ్ నుంచే సాధించాడు.

వెల్స్ ఓపెన్ ప్రొ స్నూకర్ సిరీస్ ప్రి క్వార్టర్‌లో అద్వానీ
భారత్ స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ బెస్ట్ విక్టర్ వెల్ష్ ఓపెన్ ప్రొ స్నూకర్ సిరీస్‌లో ప్రి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. అద్వానీ ప్రపంచ మాజీ ఛాంపియన్ షాన్ మర్ఫీ (ఇంగ్లండ్)ని ఫిబ్రవరి 12న వేల్స్‌లో జరిగిన పోటీలో ఓడించి ప్రి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఫిబ్రవరి 13న గ్రేమ్ డాట్ (స్కాట్లాండ్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు.

నేషనల్ గ్రాస్ కోర్‌‌ట టెన్నిస్ ఛాంపియన్‌షిప్
రామ్‌కుమార్ రామనాథన్ (తమిళనాడు) అంకితారైనా (గుజరాత్)లు నేషనల్ గ్రాస్‌కోర్‌‌ట టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పురుషుల, మహిళల సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. కోల్‌కతాలో ఫిబ్రవరి 16న ముగిసిన పోటీల్లో సౌరవ్ సుకుల్(బెంగాల్)ను ఓడించి రామనాథన్ పురుషుల టైటిల్ సాధించాడు. నటాషా పల్హా (గోవా)ను ఓడించి అంకిత మహిళల టైటిల్‌ను సాధించింది.

పెద్ద వయసులో నెంబర్‌వన్‌గా సెరెనా
అమెరికాకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ 31 సంవత్సరాల 4 నెలల 24 రోజుల వయసులో నెంబర్‌వన్ ర్యాంకును సాధించింది. దీంతో ఆమె అతిపెద్ద వయసులో నెంబర్‌వన్ స్థానంలో నిలిచిన టెన్నిస్ క్రీడాకారిణిగా రికార్డుకెక్కింది. ఫిబ్రవరి 15న ఖతార్ ఓపెన్‌లో సెరెనా సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించడంతో నెంబర్‌వన్ ర్యాంక్ దక్కింది.

నాదల్‌కు బ్రెజిల్ ఓపెన్ టైటిల్
స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాదల్ బ్రెజిల్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. రియోడిజనిరోలో ఫిబ్రవరి 18న జరిగిన ఫైనల్స్‌లో డేవిడ్ నల్బందియన్ (అర్జెంటీనా)ను ఓడించి నాదల్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించాడు.

ఆస్ట్రేలియాకు మహిళల ప్రపంచ కప్ క్రికెట్
మహిళల ప్రపంచకప్ క్రికెట్ టైటిల్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుం ది. ముంబైలో ఫిబ్రవరి 17న ముగిసిన ఫైనల్స్‌లో వెస్టిండీస్‌ను ఆస్ట్రేలియా ఓడించింది. ఆస్ట్రేలియాకు ఇది ఆరో ప్రపంచ కప్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కామెరూన్ (ఆస్ట్రేలియా), ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా సూజీబేట్స్ (న్యూజిలాండ్) నిలిచారు.

ఆనంద్‌కు గ్రెన్ కె క్లాసిక్ టోర్నమెంట్ టైటిల్
భారత్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ గ్రెన్‌కె క్లాసిక్ టోర్నమెంట్ టైటిల్ గెలుచుకున్నాడు. జర్మనీలో ఫిబ్రవరి 17న జరిగిన పోటీలో ఆనంద్ ఈ చెస్ టైటిల్ సాధించాడు. ఆయన ఐదేళ్ల తర్వాత సాధించిన టైటిల్ ఇది.

వరల్డ్ వింటర్ స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్‌కు 46 పతకాలు
10వ వరల్డ్ వింటర్ స్పెషల్ ఒలింపిక్ గేమ్స్ దక్షిణ కొరియాలో పియాంగ్‌చాంగ్‌లో 2013 జనవరి 29 నుంచి ఫిబ్రవరి 5 వరకు నిర్వహించారు. ఈ క్రీడల్లో భారత్‌కు 46 పతకాలు దక్కాయి. ఇందులో 13 స్వర్ణం, 17 రజతం, 16 కాంస్యం ఉన్నాయి. 112 దేశాల నుంచి 3300 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పొల్గొన్నారు. 1968 నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఈ స్పెషల్ ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. ఎనిమిది విభాగాల్లో ఈ క్రీడలు నిర్వహించారు. వీటిలో అల్‌ఫైన్‌స్కింగ్, క్రాస్-కంట్రీ స్కింగ్, స్కో బోర్డింగ్, స్కో షూయింగ్, ఫిగర్ స్కేటింగ్, స్టార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్, ఫ్లోర్ హాకీ, ఫ్లోర్ బాల్ ఉన్నాయి.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 81 సెంచరీలు చేసిన సచిన్
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ 81 సెంచరీలు చేసి సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. ముంబైలో ఫిబ్రవరి 8న జరిగిన ఇరానీ కప్‌లో సచిన్ 81వ సెంచరీ పూర్తి చేశాడు. రెస్టాఫ్ ఇండియా, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సచిన్ ముంబై జట్టులో ఆడాడు. టెస్టుల్లో 51 సెంచరీలు చేసిన సచిన్‌కిది 30వ దేశవాళీ సెంచరీ. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 25,000 పరుగులు పూర్తి చేశాడు.

రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఇరానీ కప్
ఇరానీ కప్ క్రికెట్ టైటిల్‌ను రెస్ట్ ఆఫ్ ఇండియా గెలుచుకుంది. ముంబైలో ఫిబ్రవరి 10న ముగిసిన ఫైనల్స్‌లో ముంబైని రెస్ట్ ఆఫ్ ఇండియా ఓడించింది. ఈ టోర్నమెంట్‌ను రెస్ట్ ఆఫ్ ఇండియా గెలుచుకోవడం ఇది వరుసగా ఎనిమిదోసారి.

హెచ్.ఐ.ఎల్. చాంపియన్‌గా రాంచీ
రాంచీ రైనోస్ జట్టు ప్రారంభ హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) టైటిల్‌ను గెలుచుకుంది. రాంచీలో ఫిబ్రవరి 10న జరిగిన ఫైనల్స్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై రాంచీ రైనోస్ విజయం సాధించింది. విజేత రాంచీ జట్టుకు ’ 2 కోట్ల 50 లక్షలు, రన్నరప్ ఢిల్లీ జట్టుకు ’ 1 కోటి 25 లక్షలు బహూకరించారు.

కెప్టెన్‌గా స్మిత్ రికార్డు
జొహెన్నెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా)లో ఫిబ్రవరి 1 నుంచి 4వరకు దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా.. దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వంద టెస్ట్ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన తొలి కెప్టెన్‌గా రికార్డు సష్టించాడు. స్మిత్ 2003 ఏప్రిల్ నుంచి దక్షిణాఫ్రికా జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 107 టెస్టుల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. స్మిత్ తర్వాత అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కెప్టెన్ అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా-93 మ్యాచ్‌లు). ప్రస్తుత కెప్టెన్లలో స్మిత్ తర్వాత స్థానంలో భారత కెప్టెన్ ఎం.ఎస్. ధోని (43 మ్యాచ్‌లు) ఉన్నాడు.

ఉడ్స్‌కు యూఎస్ గోల్ఫ్ టైటిల్
యూఎస్ పీజీఏ ఫార్మర్స్ ఇన్సూరెన్స్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను టైగర్ ఉడ్స్ గెలుచుకున్నాడు. కెరీర్‌లో ఉడ్స్‌కు ఇది 75వ టైటిల్. జనవరి 29న లోజల్లా(అమెరికా)లో జరిగిన పోటీలో బ్రండిట్ స్నెథెకర్, జోష్ టీటర్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు.

మహిళల వన్డే ప్రపంచ కప్ ప్రారంభం
మహిళల వన్డే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ జనవరి 31న భారత్‌లో ప్రారంభమైంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్ భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య ముంబైలో జరిగింది. ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 17 వరకు జరుగుతుంది. తొలిసారిగా 1973లో ఇంగ్లండ్ వేదికగా మహిళల వరల్డ్ కప్ నిర్వహణ ప్రారంభమైంది.
జనవరి 2013 స్పోర్ట్స్ ::.

              
ఆస్ట్రేలియన్ ఓపెన్-2013
విజేతల వివరాలు:
పురుషుల సింగిల్స్: నొవాక్ జొకోవిచ్ (సెర్బియా). ఫైనల్లో ఆండీ ముర్రే (బ్రిటన్)పై గెలిచాడు.
మహిళల సింగిల్స్: విక్టోరియా అజరెంకా (బెలారస్). ఫైనల్లో నా లీ (చైనా)పై నెగ్గింది.
పురుషుల డబుల్స్: బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా) జోడీ. ఫైనల్లో రాబిన్ హాస్-ఇగోర్ సిస్లింగ్ (నెదర్లాండ్స్) జోడీపై విజయం సాధించారు.
మహిళల డబుల్స్: సారా ఎరాని-రాబెర్టా విన్సి (ఇటలీ). ఫైనల్లో వీరు అష్లే బర్టీ-కాసీ డెల్లాకా (అమెరికా) జంటపై గెలుపొందారు.
మిక్స్‌డ్ డబుల్స్: జర్మిల్ గదసోవా-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడి. ఫైనల్లో వీరు లూసీ హర్దెకా- ఫ్రాంటిసెక్ సెర్మక్ (చెక్) జంటపై గెలుపొందారు.

రంజీ విజేత ముంబై
రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌ను ముంబై జట్టు గెలుచుకుంది. ముంబైలో జనవరి 28న ముగిసిన ఫైనల్లో సౌరాష్ట్రపై విజయం సాధించి రికార్డు స్థాయిలో 40వసారి ఈ చాంపియన్‌షిప్ దక్కించుకుంది. ఇదే మ్యాచ్‌లో ముంబై ఆటగాడు వసీమ్ జాఫర్ సెంచరీ సాధించడం (జనవరి 27న రెండో రోజు ఆటలో) ద్వారా రంజీ చరిత్రలో అత్యధిక
శతకాలు (32) చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సష్టించాడు. అలాగే ఇదే టోర్నీలో అత్యధిక పరుగులు (9155) చేసిన రికార్డునూ సొంతం చేసుకున్నాడు.

సిరీస్ విజేత భారత్
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు వన్డే మ్యాచ్‌ల క్రికెట్ సిరీస్‌ను భారత్ 3-2 తేడాతో గెలుచుకుంది. సురే ష్ రైనా (భారత్) మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

నేషనల్ వాలీబాల్ చాంప్ కేరళ
61వ నేషనల్ వాలీబాల్ చాంపియన్‌షిప్‌ను కేరళ గెలుచుకుంది. జైపూర్‌లో జనవరి 16న జరిగిన ఫైనల్లో తమిళనాడును ఓడించింది. హర్యానాను ఓడించి ఉత్తరాఖండ్ మూడో స్థానంలో నిలిచింది. మహిళల విభాగం టైటిల్‌ను రైల్వే జట్టు గెలుచుకుంది. ఫైనల్లో కేరళను ఓడించింది. తమిళనాడును ఓడించి ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది.

సిరీస్ విజేత దక్షిణాఫ్రికా
న్యూజిలాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల క్రికెట్ టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో గెలుచుకుంది.

ఫెడరర్ రికార్డు
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించడం ద్వారా (జనవరి 19న మ్యాచ్ జరిగింది) గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లలో 250వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. తద్వారా ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సష్టించాడు. 17 గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టైటిళ్లను సాధించిన రికార్డు కూడా ఫెడరర్ పేరిట ఉంది.

జాతీయ మహిళల హాకీ విజేత హర్యానా
జాతీయ మహిళల (అండర్-20) హాకీ టోర్నీలో హర్యానా చాంపియన్‌గా నిలిచింది. జనవరి 16న హైదరబాద్‌లో జరిగిన ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌పై గెలుపొందింది. కర్ణాటకను ఓడించి ముంబై మూడో స్థానాన్ని దక్కించుకుంది.

ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్ మెస్సీ
ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు అందజేసే గోల్డెన్ బాల్’ (ఫిఫా-బాలాన్ డిఓర్) పురస్కారాన్ని వరుసగా నాలుగో సంవత్సరం అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ గెల్చుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా చరిత్ర సష్టించాడు. ఇంతకుముందు మైకేల్ ప్లాటిని (ఫ్రాన్స్-1983, 84, 85) వరుసగా మూడుసార్లు ఈ అవార్డును సాధించాడు. వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, బాలాన్ డి ఓర్ పురస్కారాలను విలీనం చేసి 2009 నుంచి ఫిఫా బాలాన్ డి ఓర్అవార్డును అందజేస్తున్నారు. కోచ్ ఆఫ్ ది ఇయర్గా విసెంటే డెల్ బోస్కు (స్పెయిన్) ఎంపికయ్యారు. మహిళా ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్అవార్డు అబ్బే వాంబాచ్ (అమెరికా)కు దక్కింది.

డేవిడ్‌కు వరల్డ్ స్క్వాష్ ఫైనల్స్ టైటిల్
వరల్డ్ సిరీస్ స్క్వాష్ ఫైనల్స్ మహిళల టైటిల్‌ను నికోల్ డేవిడ్ (మలేషియా) గెలుచుకుంది. జనవరి 6న లండన్‌లో జరిగిన ఫైనల్లో లారా మస్సార్ (ఇంగ్లండ్)ను ఓడించింది. పురుషుల టైటిల్‌ను అమర్ షబానా (ఈజిప్టు) గెలుచుకున్నాడు. ఫైనల్లో నిక్ మ్యాథ్యూ (ఇంగ్లండ్)ను ఓడించాడు.

జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నీ
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరణం స్ఫూర్తి-నిఖత్ బాను జంట జాతీయ టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. జనవరి 12న రాయ్‌పూర్‌లో జరిగిన ఫైనల్లో మధురిక పాట్కర్-పూజ సహస్రబుధే (పీఎస్‌పీబీ) జంటపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో సౌమ్యజిత్ ఘోష్ (పీఎస్‌పీబీ) విజేతగా నిలిచాడు. తద్వారా పిన్న వయసులోనే (19 ఏళ్ల ) ఈ టైటిల్ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లో కెక్కాడు. ఫైనల్లో ఆచంట శరత్ కమల్‌ను ఓడించి మహారాజ పీతంపుర కప్ను, రూ. 2.30 లక్షల ప్రెజ్‌మనీని సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను శామిని (పీఎస్‌పీబీ) గెలుచుకుంది.

నేషన్స్ కప్‌లో జరీన్‌కు రజతం
నేషన్స్ కప్అంతర్జాతీయ మహిళల బాక్సింగ్ టోర్నమెంట్ 54 కిలోల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ నిఖత్ జరీన్ రజత పతకం సాధించింది. సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో అలిసియా హోల్స్‌కన్ (నెదర్లాండ్స్) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

సిరీస్ విజేత ఆసీస్
శ్రీలంకతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 ఆధిక్యంతో గెలుచుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్‌‌కకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు .సిరీస్ విజేత పాక్
భారత్‌తో ముగిసిన మూడు వన్డే మ్యాచ్‌ల క్రికెట్ సిరీస్‌ను పాకిస్థాన్ జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ పురస్కారం జంషేద్ (పాకిస్థాన్)కు దక్కింది. జనవరి 6న ఢిల్లీలో జరిగిన చివరి మ్యాచ్‌తో భారత కెప్టెన్ ధోనీ వన్డేల్లో 200 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత కీపర్‌గా నిలిచాడు.

నేషనల్ బాస్కెట్ బాల్ చాంప్ ఉత్తరాఖండ్
63వ నేషనల్ బాస్కెట్ బాల్ చాంపియన్‌షిప్ పురుషుల టైటిల్‌ను ఉత్తరాఖండ్ గెలుచుకుంది. లూథియాన (పంజాబ్) లో జనవరి 4న ముగిసిన టోర్నీలో పంజాబ్‌ను ఓడించింది. మహిళల విభాగంలో తమిళనాడును ఓడించి రైల్వేస్ విజేతగా నిలిచింది.

చెన్నై ఓపెన్ విజేత టిప్సరెవిచ్
చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో యాంకో టిప్సరెవిచ్ (సెర్బియా) విజేతగా నిలిచాడు. జనవరి 6న ఫైనల్లో రాబెర్టో బటిస్టా అగుట్ (స్పెయిన్)పై నెగ్గాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను వావ్రింకా (స్విట్జర్లాండ్)-పెయిర్ (ఫ్రాన్స్) జోడి దక్కించుకుంది.

సియట్ 2011-12 క్రికెట్ అవార్డులు
ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్: విరాట్ కోహ్లి (భారత్)
ఉత్తమ అంతర్జాతీయ జట్టు: పాకిస్థాన్
భారత ఉత్తమ వర్థమాన
క్రికెటర్: ఉన్ముక్త్ చంద్

బ్రిస్బేన్ ఓపెన్ టెన్నిస్
బ్రిస్బేన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఆండీ ముర్రే గెలుచుకున్నాడు. ఫైనల్లో గ్రీగోర్ డిమిట్రోవ్‌ను ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరీనా విలియమ్స్ గెలుచుకుంది. పురుషుల డబుల్స్ విభాగంలో మార్సిలో మెలో-టోమీ రొబ్రెడో జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో వీరు ఎరిక్ బుటోరాక్-పౌల్ హాన్లే జంటపై విజయం సాధించారు. మహిళల డబుల్స్ టైటిల్‌ను సానియా మీర్జా-బెథానీ మాటెక్ జంట గెలుచుకున్నారు. ఫైనల్లో వీరు అనాలెనా గ్రొనెఫీల్డ్, క్వెటా పశ్‌కె జంటపై విజయం సాధించారు.

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో గ్లెన్ మెక్‌గ్రాత్
ఆస్ట్రేలియా పేస్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌కు ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. ఈ గౌరవం పొందిన 70వ క్రికెటర్ మెక్‌గ్రాత్. 2012-13 సీజన్‌లో బ్రియాన్ లారా, బేక్‌వెల్‌లకు కూడా ఈ గౌరవం దక్కింది.



No comments:

Post a Comment

Type here: