Sunday, December 15, 2013

IRAN NUCLEAR PROGRAM ::

ఇరాన్ అణు కార్యక్రమం నియంత్రణపై ఒప్పందం
అణు కార్యక్రమం నియంత్రణకు ఇరాన్ అంగీకరిస్తూ అమెరికాతో
సహా ఐదు అగ్ర దేశాలతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది.
ఇందుకు సంబంధించి జెనీవాలో నవంబర్ 24న ఇరాన్.. అమెరికా,
బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్+జర్మనీ (పీ5+1) దేశాల
మధ్య ఒప్పందం కుదిరింది. ఇది ఆరు నెలలు అమల్లో ఉంటుంది.
దీని ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమ
పరిశీలకులకు సహకరిస్తుంది. యురేనియాన్ని ఐదు శాతానికి మించి
శుద్ధి చేయదు. ఇంతకుమించి శుద్ధి చేసిన
యురేనియం నిల్వలను తగ్గిస్తుంది. 20 శాతం శుద్ధి చేసిన
యురేనియం నిల్వలను నిర్వీర్యం చేస్తుంది. అరక్
అణు రియాక్టర్ ద్వారా ప్లుటోనియం ఉత్పత్తిని చేపట్టదు.
ఇరాన్పై విధించిన ఆంక్షలు ఆరునెలలపాటు సడలిస్తారు. ఇరాన్
చమురు అమ్మకాల వల్ల వచ్చిన నాలుగు బిలియన్ల డాలర్ల
ఆదాయాన్ని నిలిచిపోయిన అకౌంట్ల నుంచి పొందొచ్చు. బంగారం,
పెట్రోకెమికల్స్, కారు, విమాన విడిభాగాల వాణిజ్యంపై ఉన్న
నియంత్రణలను తొలగిస్తారు.

No comments: