Monday, June 24, 2013

AWARDS_TELUGU_2013_CURRENTAFFAIRS(JAN TO JUNE)

జూన్ 2013 అవార్డ్స్ ::.

కిరణ్‌బేడీకి నోమురా అవార్డ్‌
మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్‌బేడీ మానవతా సేవలకు గుర్తింపుగా సింగపూర్‌లో ఆమెకు నోమురా అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డ్‌ కింద 10 వేల యూఎస్‌ డాలర్లు అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్‌బేడీ మాట్లాడుతూ అవార్డు కిందొచ్చిన మొత్తం సొమ్మును ఖైదీల పిల్లల విద్యాభివద్ధికి అందజేస్తానని తెలిపారు. భవిష్యత్‌ తరాల మెరుగు కోసం కషి చేస్తున్న వారికోసం జ పాన్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ నోమురా గ్రూప్‌ ఈ అవార్డులను ఇస్తుంది.


మే 2013 అవార్డ్స్ ::.

లిడియా డేవిస్‌కు బుకర్‌ప్రై జ్
ప్రతిష్టాత్మక బుకర్ ప్రై జ్ అమెరికా రచయిత్రి లిడియా డేవిస్‌ను వరించింది. ఈ పోటీలో భారత్‌కు చెందిన ప్రఖ్యాత కన్నడ రచయిత యూఆర్.అనంతమూర్తి తుదివరకు పోటీలో ఉన్నా బహుమతి మాత్రం డేవిస్‌కే దక్కింది. సృజనాత్మకతతో కూడిన రచనలు చేయడంలో తనకుతానే సాటిగా పేరొందిన ఆమె బుకర్ ప్రైజ్ కింద 60 వేల పౌండ్లను (సుమారు రూ. 50 లక్షలు) సొంతం చేసుకున్నారు.

అబ్దుల్ కలాంకు అమెరికా వాన్‌బ్రాన్ అవార్డు
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ప్రతిష్టాత్మకమైన వెర్నర్‌వాన్ బ్రాన్ మెమోరియల్ అవార్డును మే 25న ప్రదానం చేశారు. ఈ అవార్డును రోదసీ సంబంధ పరిశోధనల్లో కృషి చేసిన వారికి అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ అందిస్తుంది.

కేరళ ముఖ్యమంత్రి చాందీకి యూఎన్ అవార్డు
కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ఐక్యరాజ్యసమితి ప్రజా సేవ అవార్డును ప్రకటించింది. రాష్ట్రంలో ప్రజల వద్దకు ప్రత్యక్షంగా వెళ్తూ వారి సమస్యలను పరిష్కరిస్తుండటంతో ఆయనకు ఈ అవార్డు దక్కింది. 2003 నుంచి ప్రజా సేవా దినం (జూన్ 23) సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఐదుగురికి ఈ అవార్డులు ఇస్తోంది. వీటిలో ఈ ఏడాది ఆసియా - పసిఫిక్ జోన్ కింద ఊమెన్ చాందీకి అవార్డు దక్కింది. చాందీ ప్రజలను కలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా 5.5 లక్షల ప్రజల వినతులను అందుకోగా వాటిలో మూడు లక్షల వినతులను పరిష్కరించారు. ఇందుకోసం 22.68 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

మలాలాకు గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు
పాకిస్థాన్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్.. 2013కుగాను గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డుకు ఎంపికయ్యారు. బాలికల విద్య, సాధికారతకు చేసిన కృషికి గుర్తింపుగా ఆమెకు ఈ అవార్డు లభించింది. యూఎన్ ఫౌండేషన్, యునెటైడ్ నేషన్స్ అసోషియేషన్ ఆఫ్ ది యూఎస్‌ఏ.. ఈ అవార్డును నవంబరు 6న మలాలాకు ప్రదానం చేస్తుంది. బాలికల విద్యపై ప్రచారం చేస్తున్న మలాలాపై గతేడాది తాలిబన్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది.

మిస్ ఇండియా వరల్డ్‌వైడ్‌గా నేహాల్
భారత సంతతికి చెందిన బ్రిటన్ వనిత నేహాల్ బొగైటా మిస్ ఇండియా వరల్డ్ వైడ్గా ఎంపికైంది. ఈ టైటిల్‌ను సాధించిన మొదటి బధిర యువతిగా ఆమె రికార్డు సష్టించింది. ఏప్రిల్ 27న మలేిషియా రాజధాని కౌలాలంపూర్‌లో ముగిసిన ఈ పోటీల్లో తొలి రన్నరప్‌గా జస్వీర్‌కౌర్ సంధు (మలేసియా), రెండో రన్నరప్‌గా సుర్బీ సచ్‌దేవ్ (ఒమన్) నిలిచారు. కిరీటం కోసం ఒక బధిర అభ్యర్థిని పోటీలో పాల్గొనడం కూడా ఇదే తొలిసారి.

అపరాజితా దత్తాకు వైట్‌లీ అవార్డు
గ్రీన్ అస్కార్‌గా వ్యవహరించే వైట్ లీ అవార్డుపక్షి సంరక్షకురాలు అపరాజితా దత్తాకు దక్కింది. అరుణాచల్ ప్రదేశ్‌లో అంతరించి పోయే ప్రమాదంలో ఉన్న హార్‌‌నబిల్ పక్షులను కాపాడేందుకు చేసిన విశేష కషికి గుర్తింపుగా దత్తాకు ఈ పురస్కారం లభించింది. లండన్ రాయల్ జియోగ్రఫికల్ సొసైటీలో మే 3న ఈ అవార్డును ప్రదానం చేశారు. తూర్పు హిమాలయాల్లో హార్న్‌బిల్ పక్షుల సంరక్షణ కార్యక్రమానికి దత్తా నాయకత్వం వహించారు.

భారతీయ వైద్యుడికి అవార్డు
పొగాకు పదార్థాల నియంత్రణకు కషి చేసినందుకుగాను ముంబైలోని టాటా స్మారక ఆసుపత్రి క్సాన్సర్ వైద్య నిపుణుడు పంకజ్ చతుర్వేది ప్రతిష్టాత్మక జ్యూడీ వికెన్‌ఫెల్డ్పురస్కార్నాన్ని మే 2న వాషింగ్టన్‌లో అందుకున్నారు.

వంశీ వకులాభరణంకు అమర్త్యసేన్ అవార్డు
హైదరాబాద్ యూనివర్సిటీ ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ వంశీ వకులాభరణం ప్రొఫెసర్ అమర్త్య సేన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది నుంచి అందించే ఈ అవార్డును ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ఏర్పాటు చేసింది. 10 విభాగాల్లో సామాజిక శాస్త్రవేత్తలకు ఈ పురస్కారాన్ని అందిస్తారు. ఈ అవార్డు కింద రూ. 10 లక్షల నగదు, ప్రశంసా పత్రం బహూకరిస్తారు.

ఏప్రిల్ 2013 అవార్డ్స్ ::.

ఏనుగు శ్రీనివాసులు రెడ్డికి దక్షిణాఫ్రికా నేషనల్ ఆర్థర్సత్కారం
దక్షిణాఫ్రికా ప్రభుత్వం అత్యున్నత జాతీయ పురస్కారం నేషనల్ ఆర్థర్ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏనుగు శ్రీనివాసులు రెడ్డికి లభించింది. మరో ఆరుగురు భారత సంతతి వ్యక్తులతో కలుపుకొని 38 మంది దేశ, విదేశీయులకు కూడా ఈ అవార్డును బహూకరించారు. ఈ సత్కారాన్ని దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం ఏప్రిల్ 27న ఆ దేశ అధ్యక్షుడు జాకబ్ ప్రదానం చేసారు. దౌత్యవేత్త అయిన శ్రీనివాసులు రెడ్డి 1963 నుంచి జాతివివక్ష వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు.

సైనా నెహ్వాల్‌కు యుధ్‌వీర్అవార్డు
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు 2013 సంవత్సరానికి గానూ యుధ్‌వీర్అవార్డు లభించింది. ఈ అవార్డుకు ఎంపికైన తొలి క్రీడాకారిణి. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సాధించిన ఘనతకు సైనాకు ఈ అవార్డు దక్కింది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, పాత్రికేయులు యుధ్‌వీర్ పేరిట ఈ అవార్డును నెలకొల్పారు. 1992 నుంచి ప్రతి ఏటా వివిధ రంగాల్లో కషి చేసిన వారికి యుధ్‌వీర్స్మారక ఫౌండేషన్ ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. ఈ అవార్డు కింద ’ 50,000 నగదు అందజేస్తారు. ప్రధాని మన్మోహన్‌సింగ్, డాక్టర్ అంజిరెడ్డి, శ్యామ్ బెనగల్, శాంతా సిన్హా తదితరులకు గతంలో ఈ అవార్డును బహూకరించారు.

రావూరికి జ్ఞానపీఠ్
ప్రముఖ రచయిత రావూరి భరద్వాజకు 2012 సంవత్సరానికి జ్ఞానపీఠ్ అవార్డు (48వ) దక్కింది. ఆయన రాసిన పాకుడురాళ్లునవలకుగాను ఈ పురస్కారం లభించింది. తొలిసారి తెలుగు వచన రచనకు ఈ అవార్డు దక్కింది. తెలుగులో జ్ఞానపీఠ్ పురస్కారాన్ని దక్కించుకున్న మూడో వ్యక్తి భరద్వాజ. ఇంతకు ముందు 1970లో విశ్వనాథ సత్యనారాయణ, 1988లో సి.నారాయణ రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రావూరి 1968, 1983లో రాష్ర్టసాహిత్య అకాడమీ అవార్డు, 1983లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1987లో రాజాలక్ష్మీ అవార్డులను అందుకున్నారు. 37 కథా సంపుటాలు, 17 నవలలు, బాలల కోసం 6 నవలలు, 5 కథా సంకలనాలు, 3 వ్యాసాలు, 8 నాటకాలు రాశారు. కాదంబరి, పాకుడు రాళ్లు, జీవన సమరం, ఇనుపతెర వెనుక, కౌముది వంటి రచనలు భరద్వాజకు మంచి పేరు తెచ్చాయి. భారత ప్రభుత్వం అందజేసే అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ్. ఈ అవార్డు కింద ప్రశంసపత్రం, రూ.7 లక్షల నగదు బహూకరిస్తారు. 2011 సంవత్సరానికి ఒడిశా రచయిత్రి డాక్టర్ ప్రతిభారాయ్‌కు ఈ పురస్కారం లభించింది.

న్యూయార్క్ టైమ్స్‌కు పులిట్జర్ అవార్డులు
న్యూయార్క్ టైమ్స్ పత్రికకు నాలుగు పులిట్జర్ అవార్డులు లభించాయి. పులిట్జర్ ఫిక్షన్ పురస్కారం రచయిత అడమ్ జాన్సన్‌కు దక్కింది. ది ఆర్ఫాన్ మాస్టర్స్ సన్నవలకుగాను ఈ అవార్డు దక్కింది.

ఈక్రోలినీకి గోల్డ్‌మ్యాన్ ప్రెజ్
పర్యావరణవేత్త రోసానో ఈక్రోలినీ 2013 గోల్డ్‌మ్యాన్ ప్రెజ్‌కు ఎంపికయ్యాడు. ఇటలీలో జీరో వేస్ట్ మూవ్‌మెంట్ దిశగా చేసిన కషికిగాను ఈక్రోలినీకి ఈ అవార్డు దక్కింది. పర్యావరణ రంగంలో గోల్డ్‌మ్యాన్ ప్రెజ్‌ను ఆస్కార్స్‌తో సమానంగా భావిస్తారు.

సిక్కింకు ప్రధాని గ్రామీణాభివద్ధి అవార్డు
ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి గ్రామీణాభివద్ధి అవార్డు 2011-12 సంవత్సరానికి సిక్కిం గ్రామీణాభివద్ధి నిర్వహణ, అభివద్ధి శాఖకు లభించింది. ఈ అవార్డును ఏప్రిల్ 21సివిల్ సర్వీస్ డేసందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బహూకరించారు. ప్రజాపాలనకు సంబంధించి వివిధ అంశాల్లో కషి చేసిన అధికారులకు కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి పుర స్కారాలు అందజేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత దంతెవాడ జిల్లాలో విద్యావ్యాప్తికి చేసిన కషికిగానూ ఐఏఎస్ అధికారి ఓపీ చౌదరి ప్రధానమంత్రి పురస్కారం అందుకున్నారు.

రాజ్ చెట్టికి జాన్ బేట్స్ క్లార్క్ పురస్కారం
భారత సంతతికి చెందిన అమెరికా ఆర్థికవేత్త రాజ్‌చెట్టి (33)కి ప్రతిష్టాత్మక జాన్‌బేట్స్ క్లార్క్పురస్కారం లభించింది. ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి తర్వాత అత్యంత విశిష్ట పురస్కారం ఇదే. ఈ అవార్డు పొందిన ప్రతి ముగ్గురిలో ఒకరికి నోబెల్ బహుమతి లభిస్తుందని భావిస్తారు. అందువల్ల ఈ అవార్డును బేబీ నోబెల్గా పిలుస్తారు. ఆర్థిక రంగంలో విశేష కషి చేసిన 40 ఏళ్లలోపు అమెరికన్లకు అమెరికన్ ఎకనామిక్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం ఈ బహుమతి అందజేస్తుంది.

గోపాల్ గురుకు మాల్కోమ్ ఆదిశేషయ్య అవార్డు
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ గోపాల్ గురుకు 2013-14 సంవత్సరానికి మాల్కోమ్ ఆదిశేషయ్య అవార్డు దక్కింది. డవలప్‌మెంట్ స్టడీస్‌లో ఆయన చేసిన కషికిగాను ఈ పురస్కారాన్ని చెన్నైలోని మాల్కోమ్ ఎలిజబెత్ ఆదిశేషయ్య ట్రస్ట్ ఏప్రిల్ 18న ప్రకటించింది.

ప్రాణ్‌కు ఫాల్కే అవార్డు
ఒకనాటి బాలీవుడ్ నటుడు ప్రాణ్ కిషన్ సికంద్(93)కు 2012 సంవత్సరానికి గానూ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది. ఇది దేశంలో అత్యున్నత చలనచిత్ర పురస్కారం. ఈ అవార్డు కింద స్వర్ణ కమలం, రూ.10 లక్షల నగదు బహూకరిస్తారు. ఈ అవార్డు అందుకున్నవారిలో ప్రాణ్ 44వ పురస్కారగ్రిహీత. మే 3వ తేదీన జరిగే ఒక కార్యక్రమంలో ప్రాణ్‌కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. భారత చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో ఈ అవార్డును 1969లో ఏర్పాటు చేశారు. తొలి అవార్డును నటి దేవికా రాణికి బహూకరించారు. ప్రాణ్ తన 60 ఏళ్ల చలన చిత్ర జీవితంలో 400పైగా చిత్రాల్లో నటించారు. విలన్, సహాయనటుడు పాత్రలు పోషించారు.ఆజాద్’ ‘దేవదాస్’, ‘మధుమతి’, ‘జంజీర్వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.

డెస్మండ్ టూటుకు టెంపుల్టన్ ప్రెజ్
దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, కేప్‌టౌన్ మాజీ ఆర్చ్ బిషప్ డెస్మండ్ టూటుకు (81) 2013 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మక టెంపుల్టన్ ప్రెజ్ లభించింది. ప్రేమను పంచడం, తప్పులను మన్నించడం అనే క్రెస్తవ ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నందుకు, దీనికోసం జీవితాన్ని అంకితం చేసినందుకు ఆయన్ను ఈ ప్రెజ్‌కు ఎంపిక చేసినట్లు టెంపుల్టన్ ఫౌండేషన్ తెలిపింది. లండన్‌లోని గిల్డ్‌హాల్‌లో మే 21న జరిగే కార్యక్రమంలో టూటుకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

టెమ్స్ ఆఫ్ ఇండియా సినీ అవార్డులు
టైమ్స్ ఆఫ్ ఇండియా తొలిసారిగా సినీ అవార్డులను ఇవ్వడం ప్రారంభించింది. ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఏప్రిల్ 6న వాంకోవర్ (కెనడా)లో జరిగింది. వివరాలు.. ఉత్తమ చిత్రం- బర్ఫీ; ఉత్తమ దర్శకుడు- అనురాగ్ బసు(బర్ఫీ) ; ఉత్తమ నటుడు-రణబీర్ కపూర్(బర్ఫీ); ఉత్తమ నటి - ప్రియాంక చోప్రా(బర్ఫీ); ఉత్తమ నూతన నటీ- ఇలియానా (బర్ఫీ) ; ఉత్తమ నూతన నటుడు -ఆయుష్మాన్ ఖురానా (వికీ డోనర్) ; ఉత్తమ విలన్ - రిషికపూర్ (అగ్నిపథ్); ఉత్తమ హస్యనటుడు - అభిషేక్ బచ్చన్ (బోల్ బచ్చన్); ఉత్తమ సంగీత దర్శకుడు - అజయ్ అతుల్ (అగ్నిపథ్). 
మార్చి 2013 అవార్డ్స్ ::.

డా. ఎం.వై.ఎస్. ప్రసాద్‌కు నాయుడమ్మ అవార్డు
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) డెరైక్టర్ ఎం.వై.ఎస్ ప్రసాద్‌కు 2013 నాయుడమ్మ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని నెల్లూరులో 2013 మార్చి 30న ప్రదానం చేశారు. నెల్లూరులోని నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్‌ఆల్టర్నేటివ్స్, తమిళనాడులోని ఆర్.ఎం.కె. ఇంజనీరింగ్ కళాశాల ఈ అవార్డును అందిస్తున్నాయి.

సుగతా కుమారికి సరస్వతీ సమ్మాన్
మలయాళ కవయిత్రి సుగతా కుమారికి 2012 సంవత్సరానికి ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్అవార్డు లభించింది. ఆమె రాసిన కవితా సంపుటి మన వెజుతుకు ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డును కె.కె. బిర్లా ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఈ అవార్డు కింద రూ. 10లక్షల నగదు, ప్రశంసాపత్రం బహూకరిస్తారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చలన చిత్ర అవార్డులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011 సంవత్సరానికిగాను చలన చిత్ర అవార్డులను మార్చి 24న ప్రకటించింది. వివరాలు..

  1. ఎన్‌టీఆర్ జాతీయ అవార్డు - అమితాబ్ బచ్చన్ (బాలీవుడ్ నటుడు).
  2. బీఎన్‌రెడ్డి ఆత్మీయ అవార్డు - శ్యాంబెనగల్ (దర్శకుడు)
  3. నాగిరెడ్డి - చక్రపాణి జాతీయ అవార్డు - జి.ఆదిశేషగిరిరావు (నిర్మాత, పద్మాలయ స్టూడియో అధినేత)
  4. రఘపతి వెంకయ్య అవార్డు - కైకాల సత్యనారాయణ (నటుడు)
  5. ఎన్టీఆర్ అవార్డు కింద రూ. ఐదు లక్షలు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, మిగిలిన అవార్డుల కింద రూ. రెండు లక్షలు, జ్ఞాపిక ప్రశంసాపత్రం అందజేస్తారు.
పీర్రే డెలిగ్నేకు అబెల్ ప్రెజ్
బెల్జియం గణిత శాస్త్రవేత్త పీర్రే డెలిగ్నేకు 2013 సంవత్సరానికి ప్రతిష్టాత్మక అబెల్ ప్రెజ్లభించింది. ఆల్జీబ్రా, జియోమెట్రీ, నెంబర్ థియరీ, రిప్రజెంటేషన్ థియరీ వంటి అంశాలకు సంబంధించి ఆయన చేసిన కషికిగాను ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డును 2002లో నార్వే అకాడమీ ఆఫ్ సెన్సైస్ అండ్ లెటర్స్ ఏర్పాటు చేసింది. దీన్ని నోబెల్ బహుమతితో సమానంగా పరిగణిస్తారు (గణితశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి లేదు). పురస్కారం కింద మిలియన్ డాలర్లను బహూకరిస్తారు. ఈ అవార్డును మే 21న ఓస్లాలో ప్రదానం చేస్తారు. జాతీయ చలనచిత్ర అవార్డులు
ప్రముఖ దర్శకుడు బాసు ఛటర్జీ నేతత్వం లోని జ్యూరీ మా ర్చి 182012 సంవత్సరానికి గాను 60వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల పేర్లు ప్రకటించింది. వివరాలు..
ఉత్తమ చిత్రం: పాన్ సింగ్ తోమర్ (హిందీ-దర్శకుడు: తిగ్మాంషూ ధూలియా)
ఉత్తమ నటుడు:
ఇర్ఫాన్ ఖాన్ (హిందీ చిత్రం పాన్ సింగ్ తోమర్’), విక్రమ్ గోఖలే(మరాఠీ చిత్రం అనుమతి’) లకు సంయుక్తంగా.
ఉత్తమ నటి: ఉషా జాదవ్ (మరాఠీ చిత్రం ధాగ్’)
ఉత్తమ దర్శకుడు: శివాజీ లోతన్ పాటిల్ (మరాఠీ చిత్రం ధాగ్’)
ఉత్తమ జనరంజక చిత్రాలు: విక్కీ డోనర్’ (హిందీ), ‘ఉస్తాద్ హోటల్’(మలయాళం)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రం: ఈగ
తెలుగులో ఉత్తమ చిత్రం: ఈగ
ఉత్తమ సహాయ నటుడు: అనూ కపూర్ (విక్కీ డోనర్)
ఉత్తమ సహాయ నటి: డాలీ అహ్లూవాలియా(విక్కీ డోనర్), కల్పన (మలయాళ తనిచల్లాంజన్’)
ఉత్తమ గాయకుడు: శంకర్ మహదేవన్(హిందీ చిత్రం చిట్టగాంగ్లోని బోలో నా.. పాట)
ఉత్తమ గాయని: ఆర్తీ అంక్లేకర్ తకేకర్ (మరాఠీ సంహితలో పలకేనీ పాట)
ఉత్తమ బాల నటుడు/నటి: వీరేంద్ర ప్రతాప్ (దేఖ్ ఇండియన్ సర్కస్’), మైనన్ (‘101 చోడియంగల్’)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుధీర్ పల్సానే (కో:యాద్ చిత్రానికి)
ఉత్తమ సంగీత దర్శకత్వం: శైలేంద్ర బార్వే (మరాఠీ సంహిత’)
ఉత్తమ నేపథ్య సంగీతం: బిజిబాల్(మలయాళ కలియాచన్’)
ఉత్తమ గేయ రచయిత: ప్రసూన్ జోషీ (చిట్టగాంగ్‌లోని బోలో నాపాటకు)

రాష్ట్రానికి జాతీయ పర్యాటక అవార్డులు
2011-12 సంవత్సరానికి జాతీయ పర్యాటక పురస్కారాలను కేంద్ర పర్యాటక శాఖ మార్చి 12న ప్రకటించింది. మొత్తం 36 విభాగాల్లో 87 అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులను మార్చి 18న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. అందులో మన రాష్ట్రానికి ఏడు పురస్కారాలు లభించాయి.

వాటి వివరాలు...
సమగ్ర పర్యాటకరంగ అభివద్ధి (రెస్ట్ ఆఫ్ ఇండియా విభాగంలో) - ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది; ఉత్తమ వారసత్వ నగరం - వరంగల్; ఉత్తమ విమానాశ్రయం (క్లాస్ టెన్ సిటీవిభాగంలో)- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్); ఉత్తమ విమానాశ్రయం (రెస్ట్ ఆఫ్ ఇండియా)- విశాఖపట్నం ఎయిర్‌పోర్టు; ‘మెడికల్ టూరిజం ఫెసిలిటీఅవార్డు-అపోలో హెల్త్ సిటీ, హైదరాబాద్; ఉత్తమ స్టాండ్ అలోన్ కన్వెన్షన్ సెంటర్- హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్; బెస్ట్ సివిక్ మేనేజ్‌మెంట్ ఆఫ్ డెస్టినేషన్ కేటగిరీ సిటీ - గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ).

ప్రణబ్‌కు బంగ్లా పురస్కారం
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 3 నుంచి మూడు రోజులపాటు బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో మార్చి 4న ప్రణబ్‌ను.. బంగ్లా ప్రభుత్వం ఆ దేశ రెండో అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. 1971 నాటి దేశ స్వాతంత్య్రానికి చేసిన కషికిగాను బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాట గౌరవ పురస్కారాన్ని ఆయనకు బహూకరించింది. అదే రోజున ప్రణబ్ ఢాకా యూనివర్సిటీ నుంచి గౌరవ న్యాయ శాస్త్ర పట్టా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఢాకా యూనివర్సిటీని ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ ద ఈస్ట్ (తూర్పు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ)గా అభివర్ణించారు.

ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు
2010, 2011, 2012 సంవత్సరాలకు ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారాలను లోక్‌సభ స్పీకర్ కార్యాలయం మార్చి 6న ప్రకటించింది. వివరాలు..
2010-
అరుణ్ జైట్లీ (బీజేపీ)
2011-
కరణ్ సింగ్ (కేంద్ర మాజీ మంత్రి)
2012-
శరద్ యాదవ్ (జనతాదళ్ -యు)
1995
నుంచి ఏటా ఒక పార్లమెంట్ సభ్యుడికి ఉత్తమ పార్లమెంటేరియన్పురస్కారాన్ని అందజేస్తున్నారు.

నిర్భయకు అమెరికా పురస్కారం
ఢిల్లీ ధీర వనిత నిర్భయను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సాహస వనితపురస్కారంతో అమెరికా ప్రభుత్వం గౌరవించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధైర్యసాహసాలు కనబరిచిన మహిళలతోపాటు మహిళా హక్కులు, సాధికారత కోసం సాహసోపేతంగా పోరాడే ధీరవనితలకు అమెరికా ప్రభుత్వం 2007 నుంచి ఏటా అంతర్జాతీయ సాహస వనిత (ఉమెన్ ఆఫ్ కరేజ్)పురస్కారాలు ప్రదానం చేస్తోంది. ఈ ఏడాది నిర్భయతోపాటు మరో తొమ్మిది మందిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. వారిలో మలాలై బహదురి (అఫ్ఘానిస్థాన్), సమీరా ఇబ్రహీం (నో యువర్ రైట్స్ కో ఆర్డినేటర్, ఈజిప్ట్), జులియెటా కాస్టెల్లెనాస్ (రెక్టార్, నేషనల్ అటానమస్ యూనివర్సిటీ ఆఫ్ హొండూరస్, హొండూరస్), డాక్టర్ జోసెఫిన్ ఒబియాజుల ఒడుమాకిన్ (క్యాంపెయిన్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షురాలు, నైజీరియా), ఇలేనా మిలాషినా (మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్ట్, రష్యా), ఫర్తున్ అదాన్ (ఇలామ్ శాంతి, మానవ హక్కుల కేంద్రం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, సోమాలియా), టిజరింగ్ ఓయిసర్ (టిబెటిన్ రచయిత్రి, బ్లాగర్, చైనా), రజన్ జీతునాహ్ (స్థానిక సమన్వయ కమిటీల వ్యవస్థాపకురాలు, మానవ హక్కుల లాయర్, సిరియా), తా ఫోంగ్ తన్ (బ్లాగర్, వియత్నాం) ఉన్నారు.

స్త్రీశక్తి పురస్కారాలు
ఢిల్లీ ధీర వనిత నిర్భయను మార్చి 8న (అంతర్జాతీయ మహిళా దినోత్సవం) కేంద్ర ప్రభుత్వం రాణి లక్ష్మీ బాయి-స్త్రీ శక్తిఅవార్డుతో గౌరవించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా నిర్భయ తల్లి ఈ అవార్డును స్వీకరించారు. సామాజిక అభివద్ధి రంగంలో మహిళలు సాధించిన విజయానికి గుర్తింపుగా ప్రతి ఏటా మహిళాదినోత్సవం సందర్భంగా ప్రఖ్యాతి చెందిన మహిళల పేరు మీదుగా కేంద్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పురస్కారాలను అందిస్తోంది. ఈ అవార్డు కింద రూ.3 లక్షల నగదు అందిస్తారు. ఈ ఏడాది ఈ పురస్కారాలకు నిర్భయతోపాటు ఎంపికైన వారి వివరాలు.. రాణి రుద్రమ దేవి అవార్డు- ప్రణీత తాలుక్‌దార్ (అసోం); రాణి గైదిన్లీ జీలియంగ్ అవార్డు-ఒమనా టి.కె. (కేరళ); మాతా జిజాబాయ్ అవార్డు-సోనికా అగర్వాల్ (ఢిల్లీ); దేవి అహల్యాబాయ్ హోల్కర్ అవార్డు- ఓల్గా డి.మెల్లో (మహారాష్ట్ర); కన్నగి అవార్డు- గురమ్మా హెచ్.సంకిన (కర్ణాటక).

రవి శంకర్‌కు ఠాగూర్ అవార్డు
తొలిసారిగా ప్రదానం చేస్తున్న ఠాగూర్ అంతర్జాతీయ సాంస్కతిక, సామరస్య పురస్కారం సితార్ విద్వాంసుడు స్వర్గీయ పండిట్ రవిశంకర్‌కు లభించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 7న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రవిశంకర్ భార్య సుకన్యా శంకర్‌కు ఈ అవార్డును బహూకరించారు.
ఫిబ్రవరి 2013 అవార్డ్స్ ::.

85వ ఆస్కార్ అవార్డులు
85వ ఆస్కార్ అవార్డులను అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఫిబ్రవరి 25న ప్రదానం చేశారు. భారతీయ కథా నేపథ్యంలో రూపొందిన లైఫ్ ఆఫ్ పైచిత్రం నాలుగు ఆస్కార్లను సొంతం చేసుకుంది. వివరాలు..
ఉత్తమ చిత్రం-ఆర్గో, ఉత్తమ దర్శకుడు - ఆంగ్ లీ (లైఫ్ ఆఫ్ పై), ఉత్తమ నటుడు-డేనియల్ డే లూయిస్(లింకన్), ఉత్తమ నటి - జెన్నిఫర్ లారెన్స్ (సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్), ఉత్తమ సహాయనటుడు-క్రిస్టఫో వాల్ట్స్(జాంగో అన్‌చైన్డ్), ఉత్తమ సహాయ నటి - అన్నె హథవే (లెస్ మిసరబుల్స్), ఉత్తమ యానిమేషన్ చిత్రం - (బ్రేవ్), ఉత్తమ ఛాయాగ్రాహకుడు - క్లాడియో మిరండా (లైఫ్ ఆఫ్ పై), ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - మైఖెల్ డానా (లైఫ్ ఆఫ్ పై), ఉత్తమ ఒరిజినల్ సాంగ్ - ఆడ్లె అడ్‌కిన్స్, పాల్ ఎప్‌వర్త్ (స్కైఫాల్), ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే - క్వెంటిన్ టరాంటినో(జాంగో అన్‌చైన్డ్),ఉత్తమ అడాప్టడ్ స్క్రీన్‌ప్లే - క్రిస్ టెర్రియో (ఆర్గో), ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం - సెర్చింగ్ ఫర్ సుగర్‌మ్యాన్, ఉత్తమ లఘుచిత్రం- కర్ఫ్యూ; ఉత్తమ సంక్షిప్త చిత్రం - ఇన్నోసెంట్, ఉత్తమ విదేశీ చిత్రం - ఆమర్; ఉత్తమ ఎడిటింగ్ - విలియమ్ గోల్డెన్ బర్గ్(ఆర్గో), ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - లైఫ్ ఆఫ్ పై, ఉత్తమ సౌండ్ మిక్సింగ్ - ఆండీ నెల్సన్, మార్క్ ప్యాటర్సన్, సైమన్ హేస్ (లెస్ మిసరబుల్స్), ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ - పర్ హాల్‌బర్గ్, కరెన్ బేకర్ ల్యాండర్స్ (స్కైఫాల్ ), పాల్ ఎన్ జె ఓట్టోస్సాన్ (జీరో డార్క్ థర్టీ)

టాటాకు ఎర్నెస్ట్ అండ్ యంగ్ అవార్డు
టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాను ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్అవార్డుతో సత్కరించింది. ఫిబ్రవరి 21న ముంబైలో రతన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2012వ సంవత్సరానికి ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రేజ్‌కు లభించింది. ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద ప్రొఫెషనల్ సర్వీసు కంపెనీల్లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఒకటి. 140 దేశాల్లో ఈ సంస్థ విధులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది.

బ్రేక్ త్రూ ప్రెజ్
ప్రపంచంలో ఇప్పటివరకూ ఎవరూ ప్రకటించనంత భారీ మొత్తంలో రూ.15 కోట్లతో (నోబెల్ బహుమతి కంటే రెండింతలు ఎక్కువ) బ్రేక్ త్రూ ప్రెజ్అనే సైన్స్ బహుమతిని సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుగెర్‌బర్గ్, ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, రష్యా వ్యాపారవేత్త యూరీ మిల్నర్‌లు నెలకొల్పారు. లైఫ్ సెన్సైస్‌లో విశేష కషి చేసిన వారికి ఈ అవార్డును బహూకరిస్తారు. ప్రారంభ సంవత్సరానికిగాను క్యాన్సర్, జెనెటిక్ పరిశోధనల్లో విశేష కషి చేసిన 11 మంది శాస్త్రవేత్తలకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద గరిష్టంగా ఒక్కొక్కరికి 3 మిలియన్ డాలర్లు బహూకరిస్తారు.

నరేంద్ర కోహ్లీకి వ్యాస సమ్మాన్
ప్రముఖ హిందీ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ 2012 వ్యాస సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన రాసిన నభూతో నభవిష్యతీనవలకుగాను ఈ అవార్డు దక్కింది. కె.కె.బిర్లా ఫౌండేషన్ 1991లో వ్యాస సమ్మాన్ అవార్డును ఏర్పాటు చేసింది. పురస్కారం కింద 2.5 లక్షల నగదు అందజేస్తారు.

పండిట్ రవిశంకర్‌కు బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ అవార్డు
సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌కు మర ణాంతరం బెస్ట్ వరల్డ్ మ్యూ జిక్ అవార్‌‌డ లభించింది. లాస్‌ఏంజిల్స్‌లో ఫిబ్రవరి 1155వ గ్రామీ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన కుమార్తె సితార్ విద్వాంసురాలు అనౌష్క శంకర్ అందుకున్నారు. పండిట్ రవిశంకర్ సంగీత మాలిక ది లివింగ్ రూం సెషన్‌‌స పార్‌‌ట-1కు ప్రపంచ ఉత్తమ సంగీతఆల్బం అవార్‌‌డ దక్కింది.

షార్ డెరైక్టర్ ప్రసాద్‌కు నాయుడమ్మ అవార్డు
ప్రతిష్టాత్మక నాయుడమ్మ అవార్డు 2013 కుగాను షార్ డెరైక్టర్ డా’’ఎం.వై.ఎస్. ప్రసాద్‌కు లభించింది. పశ్చిమగోదావరికి చెందిన ప్రసాద్ గత 37ఏళ్లుగా ఇస్రోలో అనేక విభాగాల్లో పనిచేశారని నెల్లూరులోని నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్‌‌స సంస్థ తెలిపింది.

పాల్ హన్‌సేన్‌కు వరల్డ్ ప్రెస్ ఫొటోగ్రఫీ అవార్డు
స్వీడన్ ఫొటో జర్నలిస్ట్ పాల్ హన్‌సేన్ 2012 ఏడాదికిగాను వరల్డ్ ప్రెస్ ఫోటోగ్రఫీ అవార్‌‌డ గెలుచుకున్నాడు. ఇది ఫొటో జర్నలిస్టులకిచ్చే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం. 2012లో గాజా నగరంపై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల్లో చిన్నపిల్లలు మతిచెందిన దశ్యాన్ని చిత్రీకరించిన పాల్‌కు ఈ అవార్‌‌డ దక్కింది.

ఇలాభట్‌కు ఇందిరాగాంధీ శాంతి బహుమతి ప్రదానం
ప్రముఖ సంఘసేవకు రాలు ఇలా భట్‌కు 2011 ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ అభివద్ధి బహుమతిని ఫిబ్ర వరి 18న న్యూఢిల్లీ లో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్‌‌స అసోసియేషన్ (సెవా) సంస్థను ఆమె స్థాపించారు. భారత ప్రభుత్వం అందచేసే ఈ బహుమతి కింద ఆమెకు ’25 లక్షలు బహూకరించారు. 2012 సంవత్సరానికి ఈ అవార్డుకు సైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్‌లీఫ్ ఎంపికయ్యారు.
2013 ఐక్యరాజ్యసమితి శాంతి బహుమతి
దక్షిణ సూడాన్‌కు చెందిన బిషప్ ఎమిరైటస్ పరైడ్ తబన్‌కు 2013 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి శాంతి బహుమతి దక్కింది. ఈ బహుమతిని సెర్గియా వియోరా డి మెల్లోగా పిలుస్తారు. అంతర్గత ఘర్షణలతో దెబ్బతిన్న ప్రాంతంలో జాతుల మధ్య పరస్పర విశ్వాసం నెలకొల్పడానికి చేసిన కషికి గాను తబన్‌కు శాంతి బహుమతి లభించింది. దక్షిణ సూడాన్‌లోని తూర్పు ప్రాంతంలో ఉన్న కురోన్‌లో 2005లో తబన్ ఏర్పాటు చేసిన హోలీ ట్రినిటీ పీస్ విలేజ్పలు తెగలు, జాతుల మధ్య సయోధ్య, సామరస్యం నెలకొనేందుకు కషి చేస్తోంది. ఈ బహుమతిని మార్చి 1న జెనీవాలో తబన్‌కు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ బహూకరిస్తారు. 2003లో ఇరాక్‌లో బాంబు దాడిలో మరణించిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం అధిపతి సెర్గియో వియోరా డీ మెల్లో (బ్రెజిల్) పేరిట ఈ బహుమతిని అందజేస్తున్నారు. ఈ బహుమతి కింద 5,500 డాలర్లు బహూకరిస్తారు.

భారత సంతతి మహిళకు ఆస్ట్రేలియా మెడల్
భారత సంతతికి చెందిన కష్ణ అరోరా (85) అలియాస్
ఆంటీజీకి 2013 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా మెడల్లభించింది. ఆస్ట్రేలియాలో ఆమె చేసిన స్వచ్ఛంద సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. గతేడాది ఈ పురస్కారం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు దక్కింది.

నోబెల్‌కు మలాలా నామినేట్
తాలిబన్ల కాల్పుల్లో గాయపడిన పాకిస్థాన్ బాలిక మలాలా యూసుఫ్ జాయ్ పేరు ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయింది. ఫ్రాన్స్, కెనడా, నార్వేలకు చెందిన ఎంపీలు ఈమె పేరును ప్రతిపాదించారు. ఫిబ్రవరి 1తో నోబెల్ బహుమతుల నామినేషన్ల ఘట్టం పూర్తయింది. అవార్డులను అక్టోబర్‌లో ప్రకటించనున్నారు. బాలికల విద్యపై తాలిబన్ల ఆంక్షలను వ్యతిరేకించిన కారణంగా గత ఏడాది అక్టోబర్ 9న స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న మలాలాపై తాలిబన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మలాలాతోపాటు బెలారస్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త అలెస్ బెల్యాత్‌స్కీ, రష్యాకు చెందిన ల్యుద్‌మిలా అలెక్సీయేవా పేర్లు కూడా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యాయి. నోబెల్ శాంతి బహుమతికి అర్హుల పేర్లను వివిధ సంస్థలు, వ్యక్తులు నామినేట్ చేయొచ్చు. ఆయా దేశాల జాతీయ చట్ట సభలు, ప్రభుత్వాలు, అంతర్జాతీయ కోర్టుల జడ్జీలు, యూనివర్సిటీల రెక్టార్లు, సామాజిక శాస్త్రాల ప్రొఫెసర్లు, గతంలో ఈ అవార్డు పొందిన వ్యక్తులు, సంస్థలు నామినేట్ చేయొచ్చు. అలాగే నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రస్తుత, మాజీ సభ్యులు, మాజీ సలహాదారులు నామినేట్ చేసినా కూడా ఎంపిక కమిటీ పరిశీలిస్తుంది.

భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తకు అత్యున్నత అవార్డు
భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త రంగస్వామి శ్రీనివాసన్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిష్టాత్మక నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్అవార్డుతో సత్కరించారు. లేజర్ కిరణాలతో చేసిన పరిశోధనకుగాను శ్రీనివాసన్‌కు ఈ పురస్కారం దక్కింది. శామ్యూల్ బ్లమ్, జేమ్స్ విన్నే అనే మరో ఇద్దరు సహ ఆవిష్కర్తలతో కలిసి శ్రీనివాసన్ ఈ అవార్డును అందుకున్నారు. దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలకు అమెరికా ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇదే. 1980లో ఈ అవార్డును ఏర్పాటు చేయగా.. 1985 నుంచి ప్రదానం చేస్తున్నారు.

ఈ-పాలనలో రాష్ట్రానికి రెండు అవార్డులు
ఆంధ్రప్రదేశ్‌కు ఈ-పాలనలో రెండు జాతీయ అవార్డులు లభించాయి. వినియోగదారుల ప్రయోజనార్థం ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ)ని ప్రభుత్వ రంగ సంస్థలు సజనాత్మకంగా ఉపయోగించడంఅనే కేటగిరీలో ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్‌కు చెందిన ఈపీఐఎంఆర్‌ఎస్ ఐటీ విభాగానికి రజతం, ‘ఎగ్జెంప్లరీ రీ యూజ్ ఆఫ్ ఐసీటీ బేస్డ్ సొల్యూషన్స్కేటగిరీలో గురుకుల విద్యాసంస్థల్లో ఐటీ సేవలకుగాను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు కాంస్య పతకాలు లభించాయి. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో జైపూర్‌లో జరిగే ఈ-పాలన 16వ జాతీయ సదస్సులో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.

విశాఖ జిల్లాకు జాతీయ పురస్కారం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంపై ఎనిమిదో జాతీయ సదస్సును ఫిబ్రవరి 2న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ సామాజిక సమానత్వాన్ని పెంపొందించినందుకుగాను విశాఖ జిల్లాకు జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డును ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా విశాఖ జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి అందుకున్నారు.

డాక్టర్ లాల్జీ సింగ్‌కు నాయుడమ్మ అవార్డు
2012 నాయుడమ్మ అవార్డుకు ప్రముఖ జీవ శాస్త్రవేత్త, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ లాల్జీ సింగ్ ఎంపికయ్యారు. డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్, వన్యప్రాణి సంరక్షణ, బయో ఇన్ఫర్మేటిక్స్ పరిశోధనల్లో చేసిన కషికి గుర్తింపుగా లాల్జీ సింగ్‌కు ఈ పురస్కారం దక్కింది.

తల్లూర్‌కు స్కోడా ఆర్ట్ ప్రెజ్
కర్ణాటకకు చెందిన చిత్రకారుడు ఎల్.ఎన్.తల్లూర్‌కు 2012 స్కోడా ఆర్ట్ ప్రెజ్‌ను ఫిబ్రవరి 1న ఢిల్లీలో ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, స్కోడా ట్రోఫీ బహూకరించారు.
జనవరి 2013 అవార్డ్స్ ::.

              
సీఎన్‌ఆర్ రావుకు చైనా అవార్డు
2012 సంవత్సరానికి చైనా అకాడెమీ ఆఫ్ సెన్సైస్అవార్డుకు ప్రముఖ శాస్త్రవేత్త, భారత ప్రధానమంత్రి శాస్త్ర సలహా మండలి చైర్మన్, జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్(బెంగళూరు) గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సీఎన్‌ఆర్ రావు ఎంపికయ్యారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష కషి చేసిన శాస్త్రవేత్తలకు ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని చైనా ప్రదానం చేస్తుంది. సీఎన్‌ఆర్ రావుతోపాటు జర్మన్ జీవ శాస్త్రవేత్త హెర్బర్ట్ జాకల్, రష్యన్ అంతరిక్ష శాస్త్రవేత్త జి.ఎ.జెరెబ్‌త్సోవ్‌లకు కూడా ఈ అవార్డు లభించింది. రసాయనిక శాస్త్రవేత్త అయిన సీఎన్‌ఆర్ రావు పూర్తిపేరు చింతామణి నాగేశ రామచంద్రరావు.

పద్మ అవార్డులు
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాలు పద్మఅవార్డులను జనవరి 25న ప్రకటించింది. మొత్తం 108 మందికి పద్మపురస్కారాలు ప్రకటించగా.. నలుగురికి పద్మవిభూషణ్, 24 మందికి పద్మభూషణ్, 80 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. వీరిలో 24 మంది మహిళలు ఉన్నారు. వివరాలు..

పద్మవిభూషణ్: రఘునాథ్ మహాపాత్ర (ప్రఖ్యాత శిల్పి, ఒడిశా); ఎస్.హైదర్ రజా (చిత్రకారుడు, ఢిల్లీ); ప్రొఫెసర్ యశ్‌పాల్ (భౌతిక శాస్త్రవేత్త, ఉత్తరప్రదేశ్); ప్రొఫెసర్ రొద్దం నరసింహ (అంతరిక్ష శాస్త్రవేత్త, కర్ణాటక)
పద్మభూషణ్: డాక్టర్ కనక్ రేలే (ఆర్ట్- మహారాష్ట్ర), షర్మిలా టాగూర్ (ఆర్ట్- ఢిల్లీ), రాజేశ్‌ఖన్నా (మరణానంతరం-ఆర్ట్, మహారాష్ట్ర), జస్పాల్ భట్టీ (మరణానంతరం-ఆర్ట్, పంజాబ్), డాక్టర్ ఎ.శివథాను పిళ్లె (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- ఢిల్లీ), డాక్టర్ విజయ కుమార్ సారస్వత్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- ఢిల్లీ), ప్రొఫెసర్ సత్య ఎన్. అట్లూరి (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- యూఎస్‌ఏ), ప్రొఫెసర్ జోగేష్ చంద్రపతి (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- యూఎస్‌ఏ), రాహుల్ ద్రావిడ్ (క్రీడలు-కర్ణాటక), మేరీకామ్ (క్రీడలు-మణిపూర్).
పద్మశ్రీ: నానా పటేకర్ (ఆర్ట్-మహారాష్ట్ర), అవినాష్ చందర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- ఢిల్లీ), ప్రొఫెసర్ సంజయ్ గోవింద్ ధాండే (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- ఉత్తరప్రదేశ్), ప్రొఫెసర్ డాక్టర్ శంకర్ కుమార్ పాల్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- పశ్చిమ బెంగాల్) తదితరులు.
మన రాష్ట్రం నుంచి పద్మ అవార్డులు పొందిన వారు: పద్మభూషణ్: డి.రామానాయుడు (సినీ నిర్మాత). పద్మశ్రీ: గజం అంజయ్య (ఆర్ట్), రేకందర్ నాగేశ్వరరావు అలియాస్ సురభి బాబ్జీ (ఆర్ట్), డాక్టర్ ముదుండి రామకష్ణరాజు (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), డాక్టర్ జయరామన్ గౌరీశంకర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), డాక్టర్ సి.వెంకట ఎస్.రామ్ అలియాస్ చిట్టా వెంకట సుందర రామ్ (వైద్యం), డాక్టర్ రాధిక హర్జ్‌బెర్గర్ (సాహిత్యం, విద్య). వీరుగాక.. రాష్ట్రానికి చెందిన సినీ ప్రముఖులు ఎస్.జానకి (తమిళనాడు- పద్మభూషణ్, ఈమె పురస్కారాన్ని తిరస్కరించారు), బాపు (తమిళనాడు-పద్మశ్రీ), శ్రీదేవి (మహారాష్ట్ర-పద్మశ్రీ)లకు ఇతర రాష్ట్రాల కోటాలో పద్మ అవార్డులు లభించాయి.

మేజర్ అనూప్‌కు కీర్తి చక్ర
అత్యున్నత శౌర్య పతకాల్లో రెండోదైన కీర్తి చక్రపురస్కారం ఈ ఏడాది మేజర్ అనూప్ జోసఫ్ మంజలీకి లభించింది. జమ్మూకాశ్మీర్‌లో దేశరక్షణ కోసం వీరోచితంగా పోరాడినందుకు ఈ అవార్డు దక్కింది. విధి నిర్వహణలో అమరులైన నలుగురు జవాన్లు సహా 11 మందిని శౌర్య చక్రపతకానికి ఎంపిక చేశారు. ఈ అవార్డుకు ఎంపికైన అమర జవాన్లలో గత ఏడాది కాశ్మీర్‌లోని కుప్వారా వద్ద భారత చెక్‌పోస్ట్‌పై దాడిని తిప్పికొట్టిన రాజేశ్వర్ సింగ్, అనిల్‌కుమార్, సహాయకచర్యల్లో ప్రాణత్యాగం చేసిన ఎ.రాహుల్ రమేశ్, కాంగోలో తిరుగుబాటుదారులతో పోరాడి అమరుడైన క్రిషన్ కుమార్ ఉన్నారు. ఈ ఏడాది అత్యున్నత శౌర్యపతకం అశోక చక్రకు ఎవరూ ఎంపిక కాలేదు.

ఎన్నికల సంఘం అవార్డులు
ఉత్తమ ఓటర్ల విధానాలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేసిన కషికిగాను గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లకు 2012 సంవత్సరానికి ఎన్నికల సంఘం అవార్డులు దక్కాయి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జనవరి 25న ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.

ఆసియా నోబెల్ ప్రెజ్ ఏర్పాటు
తైవాన్ వ్యాపారవేత్త సామ్యూల్ ఇన్ ఆసియా నోబెల్‌గా పేర్కొనే ట్యాంగ్ ప్రెజ్ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఈయన 101 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించారు. 2014లో ప్రారంభమయ్యే ఈ బహుమతిని ప్రతి రెండేళ్లకోసారి ఇస్తారు. నిరంతర అభివద్ధి’, ‘జీవ ఔషధ తయారీ’, ‘చైనా భాష చరిత్ర అధ్యయనం’, ‘చట్టబద్ధ పాలనఅనే నాలుగు విభాగాల్లో జాతీయతతో సంబంధం లేకుండా ఎవ్వరికైనా అందజేస్తారు. ప్రతి కేటగిరీలో విజేతకు 1.7 మిలియన్ డాలర్లు ఇస్తారు. ప్రస్తుతం నోబెల్ విజేతలకు 1.2 మిలియన్ డాలర్లు ఇస్తున్నారు.

రాష్ట్ర మహిళా రైతుకు అంతర్జాతీయ అవార్డు
తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని మాచవరం పంచాయతీ పరిధి కోఠివారి అగ్రహారానికి చెందిన గరిమెళ్ల మైథిలి అంతర్జాతీయ స్థాయి మహిళా రైతు అవార్డుకు ఎంపికయ్యారు. సేద్యంలో విస్తరణ ప్యూహాలు, జీవన విధానం పెంపుదలఅంశం ఆధారంగా మైథిలిని నాగపూర్‌లోని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి నలుగురు ఈ అవార్డుకు ఎంపిక కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళా రైతు విభాగంలో మైథిలి మాత్రమే ఎంపికయ్యారు.

గుళ్లపల్లికి నౌమన్ అవార్డు
ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ అధ్యక్షుడు డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావును ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆఫ్తమాలజీ జీ ఓ హెచ్ నౌమన్అవార్డుతో సత్కరించింది. జనవరి 19న గుళ్లపల్లి ఈ అవార్డును స్వీకరించారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆఫ్తమాలజీ మాజీ అధ్యక్షుడు, ప్రఖ్యాత జర్మనీ నేత్ర వైద్యుడు నౌమన్ పేరుతో ఇచ్చే ఈ పురస్కారాన్ని నేత్ర సంరక్షణలో అత్యుత్తమ కషికి గుర్తింపుగా గుళ్లపల్లి ఎన్ రావుకు అందించారు.

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
2013 సంవత్సరానికి 58వ ఫిల్మ్ ఫేర్ అవార్డులను జనవరి 21న ముంబైలో ప్రదానం చేశారు.వివరాలు..
ఉత్తమ చిత్రం-బర్ఫీ
ఉత్తమ నటుడు-రణ్‌బీర్ కపూర్ (చిత్రం: బర్ఫీ)
ఉత్తమ నటి-విద్యాబాలన్ (చిత్రం: కహానీ)
ఉత్తమ దర్శకుడు- సుజోయ్ ఘోష్ (చిత్రం: కహానీ)
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు- యశ్ చోప్రా (మరణానంతరం).

కృషి కర్మన్ అవార్డులు
ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 15కషి కర్మన్అవార్డులు ప్రదానం చేశారు. అవార్డులు పొందిన రాష్ట్రాలు: మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, నాగాలాండ్, మణిపూర్. పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలు పెంచినందుకు ఉత్తరప్రదేశ్ (తణధాన్యాలు), బీహార్ (ధాన్యం), జార్ఖండ్ (పప్పు ధాన్యాలు), హర్యానా (గోధుమ) బహుమతులు పొందాయి. తమిళనాడుకు చెందిన టి. అమలరాణి, పి. సొలైమలైకు ఉత్తమ రైతు అవార్డులు దక్కాయి.

మలాలాకు ఫ్రాన్స్ పురస్కారం
పాకిస్థాన్ సాహస బాలిక, మానవ హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్‌జై (15)కు ఫ్రాన్స్ ప్రతిష్టాత్మక పురస్కారం సైమన్ డీ బేవియర్దక్కింది. జనవరి 9న ప్యారిస్‌లో మలాలా తరపున ఆమె తండ్రి జియావుద్దీన్ యూసుఫ్‌జై ఈ అవార్డును అందుకున్నారు. బాలికల చదువు కోసం ప్రచారం చేస్తున్న మలాలాపై గతేడాది పాకిస్థాన్‌లో తాలిబన్లు కాల్పులు జరిపారు.

బెనగల్‌కు అక్కినేని అవార్డు
ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ ‘2012 అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. సామాజిక స్పృహ, మానవ హక్కుల నేపథ్యంలో అంకుర్, భూమిక, త్రికాల్, నిషాన్ వంటి ఎన్నో విలువైన చిత్రాలను ఈయన రూపొందించారు. 2005లో నెలకొల్పిన ఈ అవార్డును తొలిసారి ప్రముఖ బాలీవుడ్ నటుడు దేవానంద్‌కు ప్రదానం చేశారు. 2011లో బాలీవుడ్ నటి హేమమాలినికి ఈ పురస్కారాన్ని అందజేశారు.

ముత్తునాయగం, సారస్వత్‌లకు ఆర్యభట్ట
ప్రతిష్టాత్మక ఆర్యభట్ట అవార్డు 2010, 2011 సంవత్సరాలకు వరుసగా.. ప్రముఖ శాస్త్రవేత్తలు ఏఈ ముత్తునాయగం, వీకే సారస్వత్‌లకు లభించింది. ముత్తునాయగం కేంద్ర సముద్ర అభివద్ధిశాఖ కార్యదర్శిగా, ఇస్రోలో ద్రవీకత ఇంధన వ్యవస్థ కేంద్రం డెరైక్టర్‌గా సేవలందించారు. సారస్వత్ ప్రస్తుతం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) డెరైక్టర్ జనరల్‌గా, రక్షణ శాఖ ప్రధాన శాస్త్ర సలహాదారుగా పనిచేస్తున్నారు. 

No comments: