Monday, June 24, 2013

INTERNATONAL_CURRENTAFFAIRS_2013_TELUGU


ఇరాన్‌ అధ్యక్షుడిగా హసన్‌ రోహనీ విజయం
మితవాద మత గురువు హసన్‌ రోహనీ ఇరాన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జూన్‌ 14న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు 50.68 శాతం ఓట్లు లభించాయి. టె హ్రాన్‌ మేయర్‌ మహ్మద్‌ బఖేర్‌ ఖలీబఫ్‌ 15.76 శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 5.05 కోట్ల మంది (72.2 శాతం) ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలైన ఓట్లలో 50 శాతం పైగా ఓట్లు రోహనీ సాధించడంతో అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ప్రస్తుత అధ్యక్షుడు అహ్మదీ నెజాద్‌ స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం ఎన్నికలు జరిగాయి.

ఈ ఏడాది భారత్‌ వద్ధి 5.7 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వద్ధిరేటు వాస్తవ ప్రాతిపదికన 5.7 శాతం ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. 2014-15లో 6.5 శాతం, 2015-16లో 6.7 శాతం వద్ధిరేటు ఉండొచ్చని పేర్కొంది. ఎగుమతులు, ప్రెవేట్‌ పెట్టుబడులు ఇందుకు ఊతం ఇవ్వగలవని ప్రపంచ ఆర్థిక వద్ధి అవకాశాల (జీఈపీ) నివేదికలో ప్రపంచ బ్యాంక్‌ వివరించింది. దక్షిణాసియా ప్రాంత వద్ధిలో భారత్‌ కీలకపాత్ర పోషించనుందని తెలిపింది. భారీస్థాయిలో ఉన్న కరెంట్‌ అకౌంట్‌ లోటును కట్టడి చేసుకునేందుకు భారత్‌ ఎక్కువగా విదేశీ పెట్టుబడులపై ఆధారపడుతుండటం వల్ల, ఒకవేళ ఇన్వెస్టర్ల సెంటిమెంటు ప్రతికూలంగా మారితే సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. సంపన్న దేశాల్లో పరపతి విధానాలు కఠినం కావడం, రుణ సంక్షోభ భయాలు, రాజకీయ సంక్షోభాలు, దేశీయ సంస్కరణల తీరుపై అసంతప్తి మొదలైనవి ఈ కారణాల్లో ఉండగలవని పేర్కొంది. అదేవిధంగా ఈ ఏడాది ప్రపంచవద్ధి రేటు 2.2 శాతంగా ఉంటుందని, 2015లో 3.3 శాతానికి చేరుకోగలదని ప్రపంచబ్యాంక్‌ అంచనా వేసింది.

2028 నాటికి భారత జనాభా 145 కోట్లు
2028 నాటికి భారత జనాభా 145 కోట్లకు చేరుకుంటుందని ప్రపంచ జనాభా పురోగతి-2012 పునఃసమీక్షపేరుతో జూన్‌ 14న విడుదల చేసిన నివేదికలో ఐక్యరాజ్యసమితి తెలిపింది. దీని ప్రకారం 2028 నాటికి భారత్‌, చైనాలు చెరో 145 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశాలుగా అవతరించనున్నాయి. ఆ తర్వాత చైనాను అధిగమించి భారత్‌ జనాభాలో ప్రథమస్థానానికి చేరుకుంటుందని నివేదిక తెలిపింది. అంతేకాకుండా అభివద్ధి చెందుతున్న దేశాల్లోనే జనాభా పెరుగుదల గణనీయంగా నమోదవుతోంది. వాటిలో సగం ఆఫ్రికా ఖండంలోని దేశాలే. ప్రపంచ జనాభా మరో నెల రోజుల్లో 720 కోట్లకు చేరుతుందని, 2050 నాటికి 960 కోట్లకు చేరనున్నదని ఆ నివేదిక పేర్కొంది. అభివద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో రెండింటిలో ఆయుఃప్రమాణం పెరగనుంది. సగటున ప్రజల ఆయుర్దాయం 2040-50 మధ్యలో 76 ఏళ్లకు, 2095- 2100 నాటికి 82 ఏళ్లకు పెరుగుతుందని ఐరాస తెలిపింది.

అత్యంత వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్‌గా తియాన్హే-2
చైనాకు చెందిన తియాన్హే-2 సూపర్‌ కంప్యూటర్‌ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కంప్యూటర్‌ అని జూన్‌ 17న ప్రకటించిన టాప్‌-500 సర్వే తెలిపింది. ఇది కేవలం సెకను వ్యవధిలో 33,860 లక్షల కోట్ల ఆపరేషన్లు నిర్వహించగలదు. దీని అత్యధిక సామర్థ్యం సెకనుకు 54,900 లక్షల కోట్ల ఆపరేషన్లని ఆ సంస్థ పేర్కొంది. తద్వారా అమెరికాకు చెందిన టైటాన్‌ సూపర్‌ కంప్యూటర్‌ను ఇది అధిగమించింది. దీన్ని తయారు చేయడానికి చైనా ’580 కోట్ల ఖర్చు చేసింది. తియాన్హే-2ను చైనాకు చెందిన నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డిఫెన్స్‌ టెక్నాలజీ తయారుచేసింది. 

ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులోకి ట్వీట్‌
సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ ద్వారా బహుళ ప్రచారం పొందిన ట్వీట్‌ పదం ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ నిఘంటువులో స్థానం దక్కించుకుంది. జూన్‌ 2013 సంచికలో ఈ పదాన్ని నిఘంటువులో చేర్చనున్నారు. ట్వీట్‌కు డిక్షనరీలో చోటు కల్పించడం కోసం రూల్స్‌నే మార్చడం విశేషం. ఆక్స్‌ఫర్డ్‌ నిబంధనల ప్రకారం ఒక కొత్త పదానికి నిఘంటువులో స్థానం కల్పించాలంటే ఆ పదం పదేళ్లపాటు వాడుకలో ఉండాలి. అయితే పదేళ్ల కంటే తక్కువ కాలమే వాడుకలో ఉన్నా సరే ట్వీట్‌కు డిక్షనరీలో చోటు కల్పించారు. ట్వీట్‌ అనే పదం ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో ఉంది. అయితే దీనిని ఒక పక్షి పాటకు అనుబంధంగా ఉంచారు. అయితే ఇప్పుడు ఆ పదానికి అధికారిక నిర్వచనాన్ని డిక్షనరీలో పొందుపరచనున్నారు. ట్వీట్‌తోపాటు డాడ్‌ డాన్సింగ్‌, ఎపిక్‌, ఫిస్కల్‌ క్లిఫ్‌, ఫ్లాష్‌మాబ్‌, ఫాలో, గీకెరీ, పే డే లెండింగ్‌, ద సెలైంట్‌ ట్రీట్‌మెంట్‌, బిగ్‌ డాటా, క్రౌడ్‌ సోర్సింగ్‌, ఈ-రీడర్‌, మౌస్‌ ఓవర్‌, రీడెరైక్ట్‌, స్ట్రీమ్‌ వంటి మరికొన్ని పదాలు కూడా ఈ ఏడాది ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో చోటు సంపాదించాయి.

చైనా ఐదో మానవ సహిత అంతరిక్ష యాత్ర
చైనా ఐదోసారి మనుషులతో కూడిన అంతరిక్ష యాత్రను చేపట్టింది. జూన్‌ 11న గోబీ ఎడారిలోని జియక్వాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి షెంజౌ-10 వ్యోమ నౌకలో ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షానికి పంపింది. వీరితో ఒక మహిళ కూడా ఉంది. వీరు 15 రోజులపాటు అంతరిక్షంలో గడుపుతారు. లాంగ్‌మార్చ్‌-2 ఎఫ్‌ రాకెట్‌ ద్వారా ప్రయోగించిన షెంజౌ-10 వ్యోమనౌక కక్ష్యలో ఉన్న చైనా స్పేస్‌ల్యాబ్‌ తియాంగాంగ్‌-1తో అనుసంధానమైంది. 2020 నాటికి అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న లక్ష్యంలో భాగంగా చైనా ప్రస్తుత యాత్రను చేపట్టింది. 2012 జూన్‌లో చైనా షెంజౌ-9ను పంపింది.

ప్రపంచశాంతి సూచీలో భారత్‌కు 141వ స్థానం
ప్రపంచశాంతి సూచీ (జీపీఐ)లో భారత్‌కు 141వ స్థానం దక్కింది. 162 దేశాలకు చెందిన ర్యాంకులను సిడ్నీ కేంద్రంగా పనిచేసే ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ పీస్‌జూన్‌ 11న విడుదల చేసింది. ఈ రేటింగ్స్‌లో ఐస్‌లాండ్‌, డెన్మార్క్‌, న్యూజిలాండ్‌ మొదటి స్థానాల్లో ఉన్నాయి. యునెటైడ్‌ కింగ్‌డమ్‌ 44, యునెటైడ్‌ స్టేట్స్‌ 99, చైనా 101, రష్యా 155 స్థానాల్లో ఉన్నాయి. భారత్‌ ర్యాంక్‌ తగ్గిపోవడానికి సైనికీకరణ, దేశీయ, అంతర్జాతీయ పోరాటాలు, అవినీతిని కారణాలుగా పేర్కొంది.

పాక్ ప్రధానిగా నవాజ్ ప్రమాణం
పాకిస్థాన్ 27వ ప్రధానమంత్రిగా పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ (63) ఎన్నికయ్యారు. జూన్ 5న పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో ఆయన భారీ మెజార్జీతో విజయం సాధించారు. అనంతరం ప్రెసిడెన్సీలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు జర్దారీ ప్రధాని షరీఫ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. 342 మంది సభ్యులు గల పార్లమెంట్ దిగువ సభలో షరీఫ్‌కు 244 ఓట్లు వచ్చాయి. ఆయన 1990-93, 1997-99 మధ్య కాలంలో పాక్ ప్రధానిగా పనిచేశారు. 1999లో పర్వేజ్ ముషార్రఫ్ తిరుగుబాటుతో ప్రధాని పదవి కోల్పోయిన నవాజ్ దాదాపు 14 ఏళ్ల తర్వాత తిరిగి భారీ మెజార్టీతో అదేపదవికి మూడోసారి ఎన్నికై చరిత్ర సష్టించారు.

ఆయుధ వ్యాపార నియంత్రణ ఒప్పందంపై 60 దేశాలు సంతకాలు
ప్రపంచ ఆయుధ వ్యాపార నియంత్రణ ఒప్పందంపై 60కుపైగా దేశాలు జూన్ 3న సంతకాలు చేశాయి. త్వరలో సంతకం చేస్తానని అమెరికా ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని గత ఏప్రిల్ 2న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ప్రధాన ఆయుధ ఎగుమతిదారులు రష్యా, చైనా.. ప్రధాన దిగుమతి దేశాలు భారత్, ఈజిప్ట్‌లు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఒప్పందం ఆమోదంలో సంతకాలు చేయడం ప్రధానమైన అంశం. ఒప్పందాన్ని 50 దేశాలు ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది. 60 నుంచి 85 బిలియన్ డాలర్ల వరకు ప్రపంచ ఆయుధ వ్యాపారం జరుగుతోంది. యుద్ధ ట్యాంకులు, ఆయుధ పోరాట వాహనాలు, యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు, యుద్ధ నౌకలు, క్షిపణులు, క్షిపణి ప్రయోగ వాహకాలు, చిన్న ఆయుధాలు, తేలికపాటి ఆయుధాలు ఈ ఒప్పందం పరిధిలోకి వస్తాయి. ఒప్పందాన్ని ఆమోదించిన దేశం సంప్రదాయ ఆయుధాలను తరలించడాన్ని ఒప్పందం నిషేధిస్తుంది.

వాన్ -ఇఫ్రా అధ్యక్షుడిగా టోమస్ బ్రూనెగార్డ్
వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పబ్లిషర్స్ (వాన్-ఇఫ్రా) కొత్త అధ్యక్షుడిగా టోమస్ బ్రూనెగార్డ్ ఎన్నికయ్యారు. బ్యాంకాక్‌లో జూన్ 5న జరిగిన వాన్-ఇఫ్రా వార్షిక సమావేశాల్లో స్వీడన్ స్టాంపెన్ మీడియా గ్రూప్ చైర్మన్ బ్రూనెగార్డ్‌ను వాన్-ఇఫ్రా చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. మలయాళ మనోరమ (కేరళ)కు చెందిన జాకోబ్ మాథ్యూ స్థానంలో బ్రూనెగార్డ్ బాధ్యతలు చేపట్టారు. వాన్-ఇఫ్రా అనేది ప్రపంచ వార్తా పత్రికల, వార్తల ప్రచురణకర్తలకు చెందిన ప్రముఖ సంస్థ. ఇందులో 120 దేశాలకు చెందిన 18,000 ప్రచురణకర్తలు, 15,000 ఆన్‌లైన్ ప్రచురణల సంస్థలు, 3000కు పైగా కంపెనీలకు ప్రాతినిధ్యం ఉంది. పత్రిక స్వేచ్ఛ, విలువలతో కూడిన జర్నలిజం, సంపాదకత్వ నీతి, వ్యాపార పెరుగుదల వంటి అంశాలను పరిరక్షించడం, ప్రోత్సహించడం కోసం వాన్-ఇఫ్రా పనిచేస్తుంది. ఈ సంస్థ పారిస్ (ఫ్రాన్స్), డార్మ్‌స్టడ్ (జర్మనీ)లలో ప్రధాన కార్యాలయాలతోపాటు సింగపూర్, భారత్‌లో అనుబంధ కార్యాలయాలు కలిగి ఉంది.

యూఎస్ స్పెల్లింగ్ బీ విజేత అరవింద్ మహంకాళి
అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో హైదరాబాదీ అమెరికన్ అరవింద్ మహంకాళి (13) విజేతగా నిలిచాడు. నెడైల్ (Knaidel) అనే జర్మనీ పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పి అరవింద్ ఛాంపియన్‌షిప్ సాధించాడు. అరవింద్‌కు ట్రోఫీతోపాటు రూ.15 లక్షలు నగదు బహుమతి అందజేస్తారు. రెండు, మూడు స్థానాల్లో కూడా భారతీయ అమెరికన్ విద్యార్థులే నిలిచారు. వరుసగా ఆరోసారి భారత సంతతి విద్యార్థులు ఈ పోటీల్లో గెలిచారు. గతంలో సమీర్ మిశ్రా (2008), కావ్య శివశంకర్ (2009), అనామికా వీరమణి (2010), సుకన్యారాయ్ (2011), స్నిగ్ధ నందిపాటి (2012) విజేతలుగా నిలిచారు.

భారత వృద్ధి అంచనాను 5.3 శాతానికి తగ్గించిన ఓఈసీడీ
ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) 2013 సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 5.3 శాతానికి తగ్గించింది. గతంలో వృద్ధిని 5.9 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఓఈసీడీ మే 29న విడుదల చేసిన ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదికలో భారత జీడీపీ వృద్ధి వచ్చే రెండేళ్లలో క్రమంగా పెరుగుతుందని తెలిపింది. చైనా ఆర్థిక వ్యవస్థ వద్ధి 7.8 శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాదిలో 3.1 శాతం వద్ధి చెందుతుందని తెలిపింది. ఇది 2014లో 4 శాతానికి పెరుగుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2013లో 1.9 శాతం, 2014లో 2.8 శాతం వృద్ధి చెందుతుందని వెల్లడించింది. 
ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ స్థానాన్ని ఆక్రమిస్తుందని కూడా ఓఈసీడీ పేర్కొంది. వచ్చే కొద్ది సంవత్సరాల్లో చైనా, అమెరికాను అధిగమించి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కూడా తెలిపింది.




మే 2013 అంతర్జాతీయం ::.

తొలి పరీక్షలో గట్టెక్కిన వలస సంస్కరణల బిల్లు
అమెరికాలో కీలకమైన వలస సంస్కరణల బిల్లు మొదటి పరీక్షలో గట్టెక్కింది. ఈ బిల్లును సెనేట్ జ్యుడీషియరీ కమిటీ 13-5 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే అధికారక పత్రాలు లేని 2,60,000 మందికి పైగా భారతీయులు సహా కోటీ పది లక్షల మందికి పైగా వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి మార్గం సుగమమవుతుంది. దీంతో హెచ్-1బీ వీసాల సంఖ్య పెరుగుతుంది. సరిహద్దు భద్రత, ఆర్థిక అవకాశాలు, వలస ఆధునికీకరణ చట్టానికి సంబంధించి తీసుకురాబోతున్న సమగ్ర సంస్కరణల బిల్లుకు 300 సవరణలు చేశారు. బిల్లు తర్వాత సెనేట్ ఆమోదానికి వె ళ్తుంది. ప్రధాన భారత ఐటీ కంపెనీల ప్రయోజనాలకు ఇబ్బందులు కలిగించే అంశాన్ని బిల్లులో అలానే ఉంచారు.

ఓక్లహామాలో తీవ్ర టోర్నడో - 24 మంది మృతి
అమెరికాలో ఓక్లహామాలో మే20 న సంభవించిన పెను సుడిగాలి (టోర్నడో) తీవ్ర విధ్వంసం సష్టించింది. దీనివల్ల 24 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. వందలాది ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. గంటకు 320 కి.మీ పైగా వేగంతో గాలులు వీచాయి. స్పానిష్ పదం నుంచి వచ్చిన టోర్నడో పదానికి ఉరుములతో కూడిన తుఫాను అనే అర్థముంది. దీనిని కొందరు ట్విస్టర్, సైక్లోన్ అనే పేర్లతోనూ పిలుస్తారు.

మరిన్ని విశ్వాల ఉనికికి ఆధారాలు లభ్యం!
విశ్వం ఒక్కటే కాకుండా మరిన్ని విశ్వాల ఉనికికి సంబంధించిన ఆధారాలను తొలిసారిగా సంపాదించినట్లు అమెరికాలోని నార్త్‌కరోలినా, కార్నెగీ మెలన్ యూనివర్సిటీల ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ప్లాంక్ వ్యోమనౌక సేకరించిన విశ్వకాంతి (కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్‌గ్రౌండ్-సీఎంబీ) సమాచారం ఆధారంగా పొరుగు విశ్వాలను గుర్తించినట్లు చెబుతున్నారు.

ఎవరెస్టును అధిరోహించిన అక్కా చెల్లెళ్లు
8,848 మీటర్ల ఎత్తులోని ఎవరెస్టు శిఖరాగ్రాన్ని చేరుకొని ఇద్దరు భారతీయ కవల సోదరీమణులు చరిత్ర సృష్టించారు. ఇలాంటి ఘనత సాధించిన తొలి కవలలుగా రికార్డులకెక్కారు. డెహ్రాడూన్‌కు చెందిన 21 ఏళ్ల తాషీ, నాన్సీమాలిక్‌లు జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌తో పాటు పర్వతారోహణలోనూ పలు కోర్సులు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన మీర్జా అలీ, అతని సోదరి సమీనాలు కూడా ఈ సాహసయాత్రలో పాల్గొన్నారు.
రికార్డు స్థాయిలో కరుగుతున్న ఆర్కిటిక్ మంచు
2012లో ఆర్కిటిక్ సముద్ర మంచు రికార్డు స్థాయిలో కరిగిపోయినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ పర్యావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) నివేదికలో తెలిపింది. ఇలాంటి పరిస్థితికి హరికేన్ శాండీవంటి వాతావరణ పరిస్థితులు, వాతావరణ మార్పులు కారణమని వెల్లడించింది.

-2012 సెప్టెంబరులో ఆర్కిటిక్ మంచు ప్రాంత విస్తీర్ణం కేవలం 3.4 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇది 2007 (తక్కువ మంచుప్రాంతంగా రికార్డుకెక్కిన ఏడాది)తో పోలిస్తే 18 శాతం తక్కువ.

- ప్రపంచ సముద్ర మట్టాలు 1880లో ఉన్న దానికంటే ప్రస్తుతం 20 సెం.మీ. మేర ఎక్కువగా ఉన్నట్లు తాజా నివేదిక తెలిపింది.

పాక్ ప్రధాని పీఠంపై నవాజ్! 
పాకిస్థాన్ పార్లమెంటు ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నేతత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ జయకేతనం ఎగురవేసింది. 272 స్థానాలకుగాను 126 సీట్లు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కేవలం 31 స్థానాలకు పరిమితమైంది. మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) 29 సీట్లు గెలుచుకుంది. నవాజ్ షరీఫ్ మూడోసారి పాక్ ప్రధానిగా పగ్గాలు చేపడతారు. భారత్‌తో స్నేహసంబంధాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని నవాజ్ ప్రకటించారు.

- నవాజ్ 1949లో లాహోర్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త కుటుంబంలో జన్మించారు.
- 1985 నుంచి 1990 వరకు పంజాబ్‌కు ముఖ్యమంత్రిగా సేవలందించారు.
- తొలిసారి పాక్ ప్రధానిగా 1990 నుంచి 93 వరకు పనిచేశారు. రెండోసారి 1997-99 మధ్య ప్రధానిగా ఉన్నారు.

మలేసియా ప్రధానిగా నజిబ్
మలేసియా ప్రధాన మంత్రిగా నజిబ్ రజాక్ మే 6న రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మే 5న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికార బరిసన్ నేషనల్ పార్టీకూటమి 222 స్థానాలకు గాను 133 స్థానాలు గెలుచుకుంది. 1957లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 56 ఏళ్లుగా ఈ నేషనల్ ఫ్రంట్ కూటమి అధికారంలో ఉంది.

కారుణ్య మరణాన్ని ఆశ్రయించిన బెల్జియం శాస్త్రవేత్త
బెల్జియం ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (వైద్యం) క్రిస్టియన్ డె దువె(95) కారుణ్య మరణాన్ని పొందాలని నిర్ణయించుకున్నారు. 1975లో సహ బెల్జియన్ అల్బెర్ట్ క్లౌడ్, అమెరికన్ పలాడేతో కలసి వైద్యంలో నోబెల్ బహుమతి పొందారు. బెల్జియంలో కారుణ్య మరణం పొందాల నుకున్న రెండో ప్రముఖ వ్యక్తి దువే. 2008లో రచయిత హుగో క్లౌస్ ఇలాగే మరణించారు. కారుణ్య మరణాలకు చట్టబద్ధత కల్పించిన రెండో దేశం బెల్జియం. ప్రపంచంలో తొలిసారి 2002లో నెదర్లాండ్స్ చట్టబద్ధత కల్పించింది.

బంగ్లాదేశ్ తొలి మహిళా స్పీకర్
బంగ్లాదేశ్ తొలి మహిళా స్పీకర్‌గా డాక్టర్ షిరిన్ షర్మిన్ చౌదురి ఏప్రిల్ 30న ఎన్నికయ్యారు. అబ్దుల్ హామీద్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. అంతేకాకుండా అతి పిన్న వయసులో స్పీకర్‌గా ఎన్నికైన ఘనతను కూడా దక్కించుకున్నారు.




ఏప్రిల్ 2013 అంతర్జాతీయం ::.

ఆగ్నేయాసియాలో 1.3 బిలియన్ మలేరియా కేసులు
ఆగ్నేయాసియాలో 1.3 బిలియన్ల మంది మలేరియా బారినపడనున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్యుహెచ్‌ఓ) ఏప్రిల్ 25న మలేరియా దినోత్సవం సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలో వీరి సంఖ్య 15 శాతంగా ఉంది. ఆఫ్రికా తరువాత అత్యధికంగా ఆగ్నేయాసిలోనే మలేరియా బాధితులున్నారు. ఆగ్నేయాసియాలోని 11 దేశాల్లో మాల్దీవులు తప్ప మిగిలిన 10 దేశాల్లో మలేరియా వ్యాధి ప్రభలుతోంది. 1984 నుంచి మాల్దీవులు మలేరియా లేని దేశంగా ఉంది. భారత్‌లో కూడా మలేరియా ప్రభలుతోందని, ప్రతి ఏటా 700 మరణాలు సంభవిస్తున్నాయని అంచనా. గిరిజనులు, వలస ప్రజలు, ఆగ్రోఫారెస్ట్రీ, జల విద్యుత్ ప్రాజెక్టులు, రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టులు, మైనింగ్, రబ్బరు తోటల్లో పనిచేసే వారికి మలేరియా ఎక్కువగా సోకుతోందని డబ్యుహెచ్‌ఓ పేర్కొంది.

సెర్బియా, కొసావోల మధ్య ఒప్పందం
సెర్బియా, కొసావో ప్రధాన మంత్రులు ఇరుదేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొల్పుకోవాలని ఒప్పందానికి వచ్చారు. ఈ ఒప్పందం యూరోపియన్ యూనియన్ మధ్యవర్తిత్వంలో ఏప్రిల్ 19న బ్రస్సెల్స్‌లో కుదిరింది. కొసావో పార్లమెంట్ ఏప్రిల్ 21, సెర్బియా పార్లమెంట్ ఏప్రిల్ 27న ఒప్పందాన్ని ఆమోదించాయి. అయితే, వేలాది మంది కొసావో సెర్బులు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనకు దిగారు. ఈ ఒప్పందం బాల్కన్ ప్రత్యర్థుల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి ఇ.యు.లో సభ్యత్వానికి మార్గం ఏర్పరుస్తుంది. తిరుగుబాటు కొసావో సెర్బులపై కొసావో అల్బేనియన్ నాయకత్వానికి అధికారాన్ని ఈ ఒప్పందం అప్పగిస్తుంది. దీంతో ఉత్తర కొసావోలో సెర్బియా నియంత్రణ ముగుస్తుంది. ఇందుకు ప్రతిగా మైనారిటీ సెర్బులు కొసావో పరిధిలో స్వతంత్ర ప్రతిపత్తి పొందుతారు. సెర్బియా నుంచి కొసావో 2008లో స్వాతంత్య్రం ప్రకటించుకుంది. దీన్ని సెర్బియా గుర్తించలేదు. అయితే అమెరికాతో 90కి పైగా దేశాలు, యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాల్లో 22 దేశాలు కొసావోను గుర్తించాయి.

ఇటలీ ప్రధానిగా లెట్టా ప్రమాణ స్వీకారం
ఇటలీ కొత్త ప్రధానమంత్రిగా ఎన్రికో లెట్టా (46) ఏప్రిల్ 28న ప్రమాణ స్వీకారం చేసారు. లెట్టా నాయకత్వంలో రెండు నెలల తరువాత కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 2013 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు రాజకీయ పార్టీలు ఆవసరమైన మెజారిటీ సాధించలేదు. కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని లెట్టాకు చెందిన డెమోక్రటిక్ పార్టీ (ిపీడీ), మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనికి చెందిన పీపుల్స్ ఆఫ్ లిబర్టీ (ిపీడీఎల్) పార్టీలు కలిసి ఏర్పాటు చేసాయి.

గోల్కొండ వజ్రానికి రూ. 211 కోట్లు
హైదరాబాద్ నిజాంకు చెందిన గోల్కొండ వజ్రం ఏప్రిల్ 17న న్యూయార్క్‌లో నిర్వహించిన వేలంలో రూ. 211 కోట్ల ధర పలికింది. 34 క్యారెట్ల ఈ ప్రిన్సీవజ్రాన్ని క్రిస్టీస్ సంస్థ వేలం వేసింది. గోల్కొండ గనుల్లో బయట పడ్డ ఈ వజ్రం ఒకప్పుడు హైదరాబాద్ చివరి నిజాం వద్ద ఉండేది.

ఐసీసీ ఉపాధ్యక్షునిగా మిట్టల్
ఇంటర్నేషనల్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఉపాధ్యక్షునిగా భారతీ ఎంటర్‌ప్రెజెస్ సీఈఓ సునీల్ భారతీ మిట్టల్ ఎన్నికయ్యారు. భారత్ నుంచి ఈ పదవి చేపట్టిన మూడో వ్యక్తి మిట్టల్. గతంలో భారత్ రామ్ (1969-17), హరిశంకర్ సింఘానియా (1993-94) ఈ పదవిలో నియమితులయ్యారు. ఐసీసీని 1919లో ఏర్పాటు చేశారు.

టైమ్ ప్రభావశీలుర జాబితాలో చిదంబరం, అమీర్
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100 మంది జాబితాలో భారత ఆర్థిక మంత్రి పి.చిదంబరం, బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌లకు చోటు దక్కింది. అలాగే పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ఇటలీ అధ్యక్షుడిగా నపోలిటానో
ఇటలీ అధ్యక్షుడిగా జియోర్జియో న పోలిటానో ఏప్రిల్ 20న తిరిగి ఎన్నికయ్యారు. ఇటలీ చరిత్రలో రెండుసార్లు వరుసగా ఒకే వ్యక్తి అధ్యక్ష పదవిని చేపట్టడం ఇదే తొలిసారి.

సుదీర్ఘ చర్చా కార్యక్రమంతో గిన్నిస్ రికార్డు
నేపాల్‌కు చెందిన రబీ లమిచానే అనే టీవీ వ్యాఖ్యాత 62 గంటలపాటు టీవీ చర్చా కార్యక్రమం నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డ్స్ కెక్కాడు. ఏప్రిల్ 14లార్డ్ బుద్ద వజ్ బోర్న్ ఇన్ నేపాల్అనే అంశంపై ఆయన ఏకధాటిగా 62 గంటల 12 నిమిషాల పాటు చర్చా కార్యక్రమం నిర్వహించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు 52 గంటలు టీవీ కార్యక్రమం నిర్వహించిన రికార్డు ఉంది.

వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో మదురో విజయం
ఏప్రిల్ 14న జరిగిన వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో తాత్కాలిక అధ్యక్షుడు, యునెటైడ్ పార్టీ అభ్యర్థి నికోలస్ మదురో విజయం సాధించారు. ప్రత్యర్థి హెన్రీక్యూ కాప్రిల్స్‌పై విజయం సాధించారు. ఏప్రిల్ 18 నుంచి ఆరేళ్లపాటు మదురో అధ్యక్షుడిగా కొనసాగుతారు. వెనిజులా అధ్యక్షుడుగా ఉన్న హ్యూగో చావెజ్ మార్చి 5న మరణించడంతో ఆయన స్థానంలో మదురో తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

హతాఫ్ -4ను ప్రయోగించిన పాక్
అణ్వాయుధ సామర్థ్యం గల హతాఫ్-4 బాలిస్టిక్ క్షిపణిని పాకిస్థాన్ ఏప్రిల్ 10న విజయవంతంగా పరీక్షించింది. ఇది 900 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

కెన్యా అధ్యక్షుడిగా కెన్యాట్టా ప్రమాణ స్వీకారం
కెన్యా నాలుగో అధ్యక్షుడిగా ఉరు కెన్యాట్టా ఏప్రిల్ 9న ప్రమాణ స్వీకారం చేశారు. 51 ఏళ్ల కెన్యాట్టా కెన్యాకు తక్కువ వయస్సుగల అధ్యక్షుడు. ఆఫ్రికా అత్యంత ధనవంతుల్లో ఒకరు. మార్చి 4న జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఉన్న రైలా ఒడింగాపై విజయం సాధించారు.

ప్రధాని జర్మనీ పర్యటన
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జర్మనీ పర్యటనలో ఏప్రిల్ 11న భారత్-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల రెండోదఫా సమావేశంలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఉన్నత విద్య, పౌరభద్రత పరిశోధన, గ్రీన్ ఎనర్జీ కారిడార్ల ఏర్పాటు వంటి అంశాలకు సంబంధించిన అవగాహన పత్రాలపై సంతకాలు చేశారు. జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్‌తో 2000లో అంగీకరించిన వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చలు జరిపారు. ఇందులో వాణిజ్యం, ద్వైపాక్షిక పెట్టుబడులు, ఇంధనం, ఇంధన భద్రత, పర్యావరణం, సంస్కతి, విద్యా శిక్షణ పరిశోధన, టెక్నాలజీ రక్షణ వంటి రంగాల్లో ఎంతో ప్రయోజనం చేకూర్చేందుకు ఉన్న అవకాశాలను గుర్తించారు.

ఏటీటీకి- ఐకాస ఆమోదం
ప్రపంచ ఆయుధ వ్యాపార నియంత్రణ ఒప్పందానికి (ఏటీటీ) ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏప్రిల్ 2న ఆమోదం తెలిపింది. ఈ తరహా ఒప్పందం కుదరడం ఇదే తొలిసారి. ఇందుకోసం జరిగిన ఓటింగ్‌లో సాధారణ సభలో 193 దేశాలకుగాను 154 దేశాలు అనుకూలంగా 3 దేశాలు వ్యతికేకంగా ఓటు వేయగా 23 దేశాలు గైర్హాజరయ్యాయి. ఒప్పందం ఉగ్రవాదులు, రాజ్యాంగేతర శక్తుల పట్ల బలహీనంగా ఉందంటూ భారత్, చైనా, రష్యా ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇరాన్, సిరియా, ఉత్తర కొరియాలు వ్యతిరేకంగా, అమెరికా అనుకూలంగా ఓటు వేసాయి. ఈ ఒప్పందం 70 బిలియన్ల అంతర్జాతీయ వ్యాపారాన్ని క్రమబద్దీకరిస్తుంది. ఇందులో తేలికపాటి ఆయుధాల నుంచి యుద్ధ ట్యాంకులు, యుద్ధ నౌకలు వంటి సంప్రదాయ ఆయుధ వ్యాపారం జరుగుతుంది. సరిహద్దులు దాటి ఆయుధాలు వెళ్లడాన్ని నియంత్రిస్తుం ది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న గ్రూపులకు ఆయుధాలను అందకుండా అడ్డుకుంటుంది. అందుకు అవసరమైన అంతర్జాతీయ ప్రమాణాలను నిర్ణయిస్తారు. ఈ ఒప్పందంపై జూన్ 3వరకు సభ్యదేశాలు సంతకం చేయ వచ్చు. సంతకాలు చేసిన 50 దేశాల్లో పార్లమెంట్ ఆమోదం తెలిపిన 90 రోజుల్లో ఒప్పందం అమల్లోకి వస్తుంది.

లెబనాన్ కొత్త ప్రధానిగా తమ్మమ్ సలామ్
లెబనాన్ కొత్త ప్రధానమంత్రిగా తమ్మమ్ సలామ్ ఏప్రిల్ 6న నియమితులయ్యారు. పార్లమెంటు ఆయన నియామకాన్ని మెజారిటీతో ఆమోదించింది. ప్రధాని నజీబ్ మికాతీ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో సలామ్ నియమితులయ్యారు.

స్వల్పంగా అమెరికాలో తగ్గిన నిరుద్యోగిత రేటు
అమెరికాలో నిరుద్యోగిత రేటు మరికాస్తా తగ్గింది. అదనంగా 88 వేల ఉద్యోగాలు లభించడంతో మార్చి నెలకు 7. 6 శాతం నమోదైంది. అంతక్రితం నెల్లో ఇది 7.7 శాతం ఉంది. దేశంలో నిరుద్యోగులు 1.17 కోట్లు ఉన్నారని, నిరుద్యోగిత రేటు 7.6 శాతం ఉందని యూఎస్ శ్రామిక విభాగం వెల్లడించింది. పురుషుల్లో 6.9 శాతం, మహిళల్లో 7 శాతం నిరుద్యోగులున్నారు. అమెరికాలోని ఆసియా వాసుల్లో ఈ నిరుద్యోగిత రేటు 5 శాతం ఉంది. గత పన్నెండు నెలలుగా అమెరికాలో సగటున ప్రతి నెల 1,69,000 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. మార్చిలో ఆరోగ్య సంరక్షణ, వత్తినిపుణులు, వ్యాపార సేవల రంగాల్లో ఉద్యోగాలు పెరగ్గా... రిటైల్ వ్యాపారంలో ఉద్యోగిత తగ్గింది.

మొబైల్ ఫోన్‌కు 40 ఏళ్లు
మొబైల్‌ఫోన్ వాడకం ప్రారంభమై 2013 ఏప్రిల్ 3 నాటికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. తొలిసారి మొబైల్ ఫోన్‌ను అమెరికాలోని న్యూయార్క్‌లో మోటరోలా ఇంజనీర్ మార్టిన్ కూపర్ 1973 ఏప్రిల్ 3న చేసిన కాల్‌తో మొబైల్ ఫోన్ వాడకం మొదలైంది. ఆయన వాడిన మోటరోలా డైనా టీఏసీ పరికరం బరువు 1 కిలో. బ్యాటరీ లైఫ్ 20 నిమిషాలు. రీచార్జ్‌కు పది గంటలు పట్టేది. 1983లో మార్కెట్‌లోకి హ్యాండ్‌సెట్ విడుదలైంది. ఈ సందర్భంగా కూపర్, ఆయన బందాన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ వాషింగ్టన్‌లో డ్రాఫర్ ప్రెజ్‌తో సత్కరించింది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రస్తుతం 6 బిలియన్ల సెల్‌ఫోన్ వాడకందార్లు ఉన్నారు. ఇందులో ఒక బిలియన్ వరకు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు.



మార్చి 2013 అంతర్జాతీయం ::.

దర్బన్‌లో బ్రిక్స్సదస్సు
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా(బ్రిక్స్) దేశాల ఐదో సదస్సు దక్షిణాఫ్రికా నగరం దర్బన్‌లో 2013 మార్చి 26, 27 తేదీల్లో జరిగింది. బ్రిక్స్, ఆఫ్రికా-అభివద్ధి ఏకీకరణ, పారిశ్రామికీకరణ కోసం భాగస్వామ్యంఅనే ఇతివత్తంతో సదస్సు నిర్వహించారు. 100 బిలియన్ డాలర్ల నిధితో బ్రిక్స్ ఆభివద్ధి బ్యాంక్ ఏర్పాటు చేయాలని సదస్సులో నిర్ణయించారు. సభ్యదేశాల్లో పెట్టుబడులు, వ్యాపారం ప్రోత్సహించేందుకు, వ్యాపార సహకారాన్ని పెంచేందుకు బ్రిక్స్ వాణిజ్య మండలిని ప్రారంభించారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందానికి చర్చలను సత్వరం పూర్తి చేయాలని,పటిష్టమైన, సుస్థిర, సమతౌల్య వద్ధిని పెంపొందించేందుకు జి-20 నాయకులు రూపొందించిన అజెండాను కొనసాగించేందుకు సమష్టిగా పనిచేయాలని బ్రిక్స్ దేశాలు నిర్ణయించాయి. బిక్స్ బిజినెస్ ఫోరమ్ సమావేశంలో సమీకత అభివద్ధి, పారిశ్రామికీకరణ కోసం బ్రిక్స్, ఆఫ్రికాల మధ్య మరింత సన్నిహిత భాగస్వామ్యానికి అంగీకరించాయి.

ఆఫ్రికాఖండంలో మౌలిక సదుపాయాల అభివద్ధి, పారిశ్రామికీకరణకు బ్రిక్స్ దేశాలు మరింత చురుకుగా మద్దతునిస్తాయి. ప్రపంచంలో ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్న ఐదు దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలను బ్రిక్స్‌గా పిలుస్తారు. 2001లో ఏర్పడిన బ్రిక్.. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారింది. ప్రపంచ జనాభాలో 40 శాతం బ్రిక్స్ దేశాల్లో ఉంది. ప్రపంచ భూభాగంలో 30 శాతం, జీడీపీలో 25 శాతం వాటా ఈ దేశాలదే. బ్రిక్స్ ఆరో సదస్సును 2014లో బ్రెజిల్‌లో నిర్వహించనున్నారు.

దోహాలో అరబ్ లీగ్ సదస్సు
కతార్ రాజధాని దోహాలో 24వ అరబ్‌లీగ్ సదస్సు 2013 మార్చి 26న జరిగింది. ప్రతిపక్షాలను అణగదొక్కుతుందన్న కారణంగా 2011లో అరబ్ లీగ్ నుంచి సిరియాను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం సిరియా స్థానం లో ఆ దేశ తిరుగుబాటుదారులకు స్థానం కల్పించారు. సిరియా తిరుగుబాటుదారులకు ఆయుధాలతోపాటు అన్ని రకాల మద్దతు తెలపాలని సదస్సు తీర్మానించింది. సిరియన్లపై ప్రభుత్వ సైనిక దాడులను డిక్లరేషన్‌లో సదస్సు ఖండించింది. సిరియా పునర్నిర్మాణానికి ఐక్యరాజ్యసమితి పరిధిలో అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు, సిరియా జాతీయ సంకీర్ణాన్ని, ప్రతిపక్ష దళాలను చట్టబద్దమైన ప్రభుత్వంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజానికి సదస్సు పిలుపునిచ్చింది. అరబ్ తూర్పు జెరూసలెంకు బిలియన్ డాలర్ల నిధి ఏర్పాటుకు సదస్సు అమోదం తెలిపింది. తూర్పు జెరూసలెం రాజధానిగా స్వతంత్ర దేశాన్ని పాలస్తీనీయులు కోరుతున్నారు.పాలస్తీనా భూభాగం, గోలన్ హైట్స్‌లోని అరబ్ భూభాగం నుంచి ఇజ్రాయిల్ వైదొలగడం ద్వారా శాంతికి దారితీసే చర్యలు తక్షణమే చేట్టాలని సదస్సు పిలుపునిచ్చింది. ఈ సదస్సులో 15 అరబ్ దేశాల అధినేతలు పాల్గొన్నారు. 1945లో అరబ్‌లీగ్ ఏర్పడింది.

కొత్త పోప్ ఫ్రాన్సిస్-1
కొత్త పోప్‌గా అర్జెంటీనా మతాధికారి జార్జి మారియో బెర్గోగ్లియో మార్చి 13న ఎన్నికయ్యారు. ఆయనను ఇక నుంచి పోప్ ఫ్రాన్సిస్-1గా వ్యవహరిస్తారు. రెండువేల సంవత్సరాల కేథలిక్ చర్చి చరిత్రలో ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల నుంచి పోప్‌గా ఒక మతాధికారి ఎన్నికవడం ఇదే తొలిసారి. పోప్ బెనెడిక్ట్ తన పదవికి రాజీనామా చేయడంతో కొత్త పోప్ ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికతో 266వ పోప్ అధికారంలోకి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 120 కోట్ల మంది కేథలిక్ క్రెస్తవులకు పోప్ మతాధికారిగా వ్యవహరిస్తారు.

చెనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ బాధ్యతలు
చైనా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్ మార్చి 14న పదవీ బాధ్యతలు స్వీకరించారు. మిలటరీ కమిషన్ చైర్మన్‌గా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. నాలుగు నెలల క్రితం ఆయన చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. మూడువేల మంది సభ్యులు గల చైనా పార్లమెంటు (నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్) జిన్‌పింగ్‌ను దేశాధ్యక్షుడిగా, మిలటరీ కమిషన్ చైర్మన్‌గా ఎన్నుకుంది. చైనా నూతన ప్రధానమంత్రిగా లీ కెకియాంగ్ మార్చి 15న ఎన్నికయ్యారు. కెకియాంగ్ పేరును ప్రధాని పదవికి అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ప్రతిపాదించగా... ఆ దేశ పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ) ఎన్నుకుంది.

మానవాభివద్ధి సూచీలో భారత్‌కు 136వ స్థానం
యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) మానవాభివద్ధి నివేదిక-2013లో భారత్‌కు 136వ స్థానం (గతంలో 134వ స్థానం) లభించింది. యూఎన్‌డీపీ మార్చి 14న ఈ నివేదికను విడుదల చేసింది. ఇందులో 187 దేశాలకు ర్యాంకులు కేటాయించింది. ఈ సూచీలో నార్వే మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో, అమెరికా మూడో స్థానంలో ఉన్నాయి. ఈ నివేదికలో చైనా స్థానం 101. చాద్ (184వ స్థానం), మొజాంబిక్ (185వ స్థానం), కాంగో(186వ స్థానం), నైజర్(186వ స్థానం) చివరి స్థానాల్లో నిలిచాయి. విద్య, ఆరోగ్యం, ఆదాయం అనే మూడు అంశాలాధారంగా మానవాభివద్ధి సూచీని రూపొందిస్తారు.

నేపాల్ ప్రధానిగా రేగ్మీ ప్రమాణం
నేపాల్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖిల్ రాజ్ రేగ్మీ ఆ దేశ తాత్కాలిక ప్రధానిగా మార్చి 14న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. అన్నీ సవ్యంగా సాగితే ఈయన నేతత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం జూన్ 21 నాటికల్లా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు నిర్వహించనుంది.

పూర్తి కాలం కొనసాగిన పాక్ జాతీయ అసెంబ్లీ
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ చరిత్ర సష్టించింది. తొలి సారి పూర్తి కాలం కొనసాగి పాక్ రాజకీయాల్లో మైలురాయిగా నిలిచింది. జాతీయ అసెంబ్లీ లేదా పార్లమెంట్ దిగువ సభ మార్చి 16తో ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకుంది. ఎన్నికల ద్వారా ఎంపికైన సర్కారును సైన్యం లేదా ఇతర రాజకీయ శక్తులు కూలదోయకపోవడం ఆ దేశంలో ఇదే తొలిసారి. ప్రభుత్వ గడువు పూర్తవడంతో ప్రధాని రజా అష్రాఫ్ మంత్రి వర్గం రద్దయింది. పాకిస్థాన్‌లో ఇంతకుముందు 12 జాతీయ అసెంబ్లీలో ఏ ఒక్కటీ పూర్తి కాలం పని చేయకపోవడం గమనార్హం.

చావెజ్ మృతి
లాటిన్ అమెరికా దేశం వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ అనారోగ్యం (కేన్సర్ వ్యాధి) తో మార్చి 5న ఆ దేశ రాజధాని కారకస్‌లో మరణించారు. చావెజ్ 14 సంవత్సరాలపాటు వినిజులా అధ్యక్షుడిగా ఉన్నారు. గతేడాది అక్టోబర్ లో జరిగిన ఎన్నికల్లో మరో ఆరేళ్ల కాలానికి చావెజ్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈయన 1999లో తొలిసారిగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. చావెజ్ 1954 జూలై 28న బరినాస్ (వెనిజులా) లో జన్మించారు. చావెజ్ మృతి నేపథ్యంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు నికోలస్ మదురో తాత్కాలిక అధ్య క్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

కెన్యా నూతన అధ్యక్షుడిగా ఉహురు కెన్యాట్ట
కెన్యా దేశ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఆ దేశ ఉప ప్రధాని ఉహురు కెన్యాట్ట విజయం సాధించారు. మార్చి 9న విడుదలైన ఫలితాల్లో కెన్యాట్టకు 50.07 శాతం ఓట్లు, ఆయన ప్రత్యర్ధి ప్రస్తుత ప్రధాని రైలా ఒడింగాకు 43.28 శాతం ఓట్లు లభించాయి.

ఐఏఈఏ అధిపతిగా అమనో
అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) అధిపతిగా యుకియా అమనో (జపాన్) రెండో సారి ఎన్నికయ్యారు. మార్చి 7న వియన్నాలో జరిగిన ఐఏఈఏ సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. అమనో నాలుగేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు.

ఉత్తర కొరియాపై ఐరాస ఆంక్షలు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మార్చి 7న ఉత్తర కొరియాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఫిబ్రవరిలో నిర్వహించిన అణు పరీక్షలకు ప్రతిగా ప్రతిపాదించిన ఆంక్షల తీర్మానానికి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆ దేశ బ్యాంకింగ్, రాకపోకలు, వాణిజ్యంపై నిషేధం విధిస్తూ ఆంక్షలను మరింత కఠినం చేసింది. ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలో ప్రభుత్వ సైన్స్ అకాడమీ, ట్రేడింగ్ కంపెనీ, కొరియా మైనింగ్ డెవలప్‌మెంట్ ట్రేడింగ్ కార్పొరేషన్ అధిపతి, డిప్యూటీ చీఫ్‌లను చేర్చింది. 2006, 09 సంవత్సరాల్లో అణు పరీక్షలు జరిపిన తర్వాత ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షల కంటే ప్రస్తుత ఆంక్షలు కఠినమైనవి.

మిత్రాకు ప్రతిష్టాత్మక టెడ్ప్రెజ్
ప్రవాస భారతీయ విద్యావేత్త, బ్రిటన్‌లోని న్యూక్యాసిల్ యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సుగతా మిత్రా 2013 ఏడాదికిగాను ఫిబ్రవరి 26న అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రతిష్టాత్మక టెడ్ప్రెజ్ అందుకున్నారు. అవార్డు కింద మిత్రాకు సుమారు రూ. 5.4 కోట్ల (10 లక్షల డాలర్లు) నగదును కూడా బహూకరించారు. భారత్‌లోని మురికివాడల పిల్లలకు కంప్యూటర్ విద్యను అందించేందుకు మిత్రా 1999లో హోల్ ఆన్ ద వాల్అనే కార్యక్రమాన్ని చేపట్టారు. టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్, డిజైన్ (టెడ్) అనే మూడు రంగాల్లో విశేష కషి చేసిన వ్యక్తులను ప్రోత్సహించేందుకు టెడ్ సంస్థ ఏటా ఈ బహుమతిని అందిస్తోంది.

అమెరికా రక్షణమంత్రిగా హేగెల్
అమెరికా నూతన రక్షణ శాఖ మంత్రిగా చక్ హేగెల్ ఫిబ్రవరి 27న ప్రమాణ స్వీకారం చేశారు.

ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా
బిజినెస్ మ్యాగజీన్ ఫోర్బ్స్ మార్చి 4న బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచం మొత్తం మీద అత్యధిక స్థాయిలో 1,426 మంది స్థానాలను పొందగా, 55 మంది భారతీయులకు చోటు లభించింది. భారతీయుల్లో కుబేరుడిగా ముకేష్ అంబానీ మళ్లీ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. తద్వారా వరుసగా ఆరో ఏడాది అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. ముకేష్ సంపద 21.5 బిలియన్ డాలర్లుకాగా, 16.5 బిలియన్ డాలర్ల ఆస్తులతో స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ రెండో ర్యాంక్‌ను పొందారు. విప్రో అధినేత ప్రేమ్‌జీ 11.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. కాగా, ప్రపంచ కుబేరుల్లో మెక్సికన్ వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ (73 బిలియన్ డాలర్లు) వరుసగా నాలుగోసారి అగ్రస్థానాన్ని పొందడం విశేషం. స్లిమ్ తన స్థానాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ (67 బిలియన్ డాలర్లు) రెండో స్థానంలో నిలవగా, స్పెయిన్‌కు చెందిన ఎమనికో ఓర్టెగా (57 బిలియన్ డాలర్లు ) మూడో ర్యాంక్‌ను, వారెన్ బఫెట్ (53.5 బిలియన్ డాలర్లు) నాలుగో స్థానాన్ని పొందారు. ఇక ప్రపంచ ధనవంతుల ర్యాంకింగ్‌లో ముకేష్‌కు 22వ ర్యాంక్ లభించగా, లక్ష్మీ మిట్టల్ 41, ప్రేమ్‌జీ 91వ స్థానాల్లో నిలిచారు.



ఫిబ్రవరి 2013 అంతర్జాతీయం ::.

క్యూబా అధ్యక్షుడిగా రౌల్ కాస్ట్రో
క్యూబా అధ్యక్షుడిగా రౌల్ కాస్ట్రో రెండోసారి ఎన్నికయ్యారు. కాస్ట్రో మరో ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ఉపాధ్యక్షుడిగా మిగేల్ దియాజ్ క్యానల్ నియమితులయ్యారు. గత ప్రభుత్వంలో దియాజ్ విద్యా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

సౌర కుటుంబం వెలుపల చిన్న గ్రహం
సౌర కుటుంబం వెలుపల అతి చిన్న గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు ఫిబ్రవరి 21న కనుగొన్నారు. ఇప్పటివరకు మనకు తెలిసిన 800 పై చిలుకు సౌరకుటుంబేతర గ్రహాల్లో ఇదే అతి చిన్నది. ఇది చంద్రుడి కంటే కొంచెం పెద్దగా, భూమి సైజులో మూడో వంతు ఉంటుంది. సూర్యుని వంటి నక్షత్రం చుట్టూ 13 రోజులకోకసారి పరిభ్రమిస్తుంది. దీనికి కెప్లర్-37బి అనే పేరు పెట్టారు. ఇది భూమికి 210 కాంతి సంవత్సరాల దూరంలో లైరా అనే నక్షత్ర మండలంలో ఉంది.

కిషన్‌గంగనీటిపై తీర్పు
భారత్-పాకిస్థాన్‌ల మధ్య కిషన్‌గంగ జలవిద్యుత్ ప్రాజెక్ట్ విషయంలో తలెత్తిన వివాదానికి నెదర్లాండ్స్‌లో ది హేగ్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు తెరదించింది. ఈ ప్రాజెక్ట్ కోసం కిషన్‌గంగ నది (పాక్‌లో నీలం నది) నీటిని జలవిద్యుత్ ప్లాంటుకు తరలించేందుకు భారత్‌కు హక్కుందని తెలిపింది.

1960లో ఇరు దేశాల మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం- భారత్ కిషన్‌గంగ నది నీటిని జలవిద్యుత్ ఉత్పాదనకు తరలించుకోవచ్చని పేర్కొంది. అదే సమయంలో పాక్ వ్యవసాయ ప్రయోజనాల దష్ట్యా ఈ నదిలో కనీస నీటి ప్రవాహం ఉండేలా చూడాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని పేర్కొంది. ఈ మేరకు ఫిబ్రవరి 18న పాక్షిక తీర్పును ఇచ్చింది. ఇరు దేశాలు నది ప్రవాహానికి సంబంధించిన తాజా గణాంకాలు అందిస్తే.. ఈ ఏడాది చివర్లోగా కనీస నీటి ప్రవాహం స్థాయిని ఖరారుచేస్తూ తుది తీర్పు వెలువరిస్తామని తెలిపింది.

పార్క్ గెయున్ ప్రమాణం
దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలిగా పార్క్ గెయున్ హై ఫిబ్రవరి 25న ప్రమాణ స్వీకారం చేశారు. పార్క్ గెయున్ సైనిక నియంత, ఆ దేశ మూడో అధ్యక్షుడైన దివంగత పార్‌‌క చుంగ్ హే పెద్ద కుమార్తె. ఈమె..ఆసియాలోని నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తి అయిన దక్షిణ కొరియాకు 18వ అధ్యక్షురాలిగా సారథ్యం వహించనున్నారు.

మూడో అణుపరీక్ష జరిపిన ఉత్తర కొరియా
భూగర్భ అణు పరీక్షను విజయ వంతంగా నిర్వహించినట్లు ఉత్తర కొరియా ఫిబ్రవరి 12న ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలు ఉల్లంఘించి జరిపిన ఈ పరీక్షను ఐక్యరాజ్యసమితి, అమెరికా, భారత్ తోపాటు ప్రపంచ దేశాలు ఖండించాయి. 2006, 2009 తర్వాత ఉత్తర కొరియా జరిపిన మూడో అణుపరీక్ష ఇది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.9గా నమోదైంది. దీన్ని నార్‌‌త హంజీయాంగ్ ప్రావిన్‌‌సలోని పుంగ్సీ-రీ న్యూక్లియర్ కాంప్లెక్స్‌లో నిర్వహించారు. గత రెండు పరీక్షల కంటే ప్రస్తుతం జరిపింది చాలా శక్తివంతమైన అణుపరీక్ష. సూక్ష్మీ కరించిన పరికరం ద్వారా నిర్వహించిన మూడోపరీక్షలో విజయం సాధించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. 2006, 09లో కూడా ఇక్కడే అణు పరీక్షలు జరిపింది. 2009లో పరీక్ష తర్వాత ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గట్టి ఆంక్షలు విధించింది.

హతాఫ్-9 క్షిపణిని పరీక్షించిన పాక్
పాకిస్తాన్ అణ్వాయు ధ సామర్థ్యం ఉన్న హతాఫ్ -9 (నాజర్) క్షిపణిని ఫిబ్రవరి 11న విజయవంతంగా పరీక్షిం చింది. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగిం చే ఈ క్షిపణి 60 కిలోమీట ర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఛేదించడంతోపాటు అణ్వాయుధాలను మోసుకుపోగలదు.

నషీద్‌కు భారత దౌత్య కార్యాలయంలో ఆశ్రయం
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ మాలేలోని భారత దౌత్య కార్యాల యంలో ఫిబ్రవరి 13న ఆశ్రయం పొందారు. నషీద్‌కు మాల్దీవుల్లోని కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయన అరెస్ట్ భయంతో భారత్ ఆశ్రయం కోరారు. క్రిమినల్ కోర్‌‌ట జడ్జిని నిర్బంధించిన కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

హతాఫ్-2 అణు క్షిపణిని పరీక్షించిన పాక్
అణు సామర్థ్యం ఉన్న హతాఫ్-2 (అబ్దాలీ) క్షిపణిని పాకిస్తాన్ ఫిబ్రవరి 15న విజయవంతంగా పరీక్షించింది. 180 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి ఛేదించ గలదు. ఇది ఉపరితలం నుంచి ఉపరితలం లోకి ప్రయాణించే బాలిస్టిక్ క్షిపణి. ఇది అణు సంప్రదాయ ఆయుధాలను మోసు కుపోగలదు.

) మధ్యగా ఆ శకలం దూసుకెళ్లింది. ఇది మళ్లీ 2019 ఫిబ్రవరి 15న భూమికి చేరువగా వస్తుంది.

అమెరికాలో నెమోతుఫాను
ఈశాన్య అమెరికాలో మంచు తుఫాను తీవ్ర అంతరాయం కలిగించింది. ఫిబ్రవరి 8న సంభవించిన ఈ తుఫాను తాకిడికి ఐదుగురు మరణించారు. విద్యుత్ సరఫరా, రవాణాకు అంతరాయం కలిగింది. అనేక విమానాలను రద్దు చేశారు. కెనడాతో పాటు న్యూయార్క్, కనెక్టికట్, మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్ రాష్ట్రాలు ఈ తుఫాను ధాటికి గురయ్యాయి. ఈ మంచు తుఫానుకు నెమోఅని పేరు పెట్టారు.

సోలమన్ దీవుల్లో భూకంపం
దక్షిణ పసిఫిక్‌లో సోలమన్ దీవుల్లో ఫిబ్రవరి 68.0 తీవ్రతతో భారీ భూకంపం సంభ వించింది. దీనివల్ల పసిఫిక్ తీరంలో చిన్నపాటి సునామీ అలలు చెలరేగాయి. తొమ్మిది మంది మరణించారు. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. 100 గ్రామాలు సునామీ ధాటికి గురయ్యాయి. సోలమన్ దీవులు రింగ్ ఆఫ్ ఫైర్జోన్‌లో భాగంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడం సంభవిస్తుంటాయి. 2007లో సోలమన్ దీవుల్లో 8.0 తీవ్రతతో సంభవించిన భూకంప ధాటికి 52 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సోలమన్స్‌లో 200 పైగా దీవులున్నాయి. ఈ దీవుల్లో 5,52,000 జనాభా ఉంది.

భారత్-బంగ్లాదేశ్ ఒప్పందాలు
భారత్-బంగ్లాదేశ్ మధ్య నేరస్తుల అప్పగింతపై ఒప్పందం కుదురింది. భారత హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే బంగ్లాదేశ్ పర్యటన సమయంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు జనవరి 28న ఇరు దేశాలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇరు దేశాల్లో చట్టాలను అమలు చేసే సంస్థల మధ్య సహకారాన్ని మరింత పెంచేందుకు, నేరస్థులను నిరోధించడానికి ఇది దోహదపడుతుంది. సవరించిన రవాణా ఒప్పందంపై కూడా ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. దీని వల్ల ఇరు దేశాల మధ్య వీసా ప్రక్రియ మరింత సరళం కానుంది.

అమెరికా విదేశాంగ మంత్రిగా జాన్ కెర్రీ
అమెరికా విదేశాంగ మంత్రిగా సీనియర్ సెనెటర్ జాన్ కెర్రీ ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకారం చేశారు. హిల్లరీ క్లింటన్ స్థానంలో కెర్రీ బాధ్యతలు స్వీకరించారు.

పత్రికా స్వేచ్ఛలో భారత్‌కు 140వ స్థానం
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత్ 140వ స్థానంలో నిలిచింది. రిపోర్టర్స్ విత్ ఔట్ బోర్డర్స్అనే సంస్థ జనవరి 30న విడుదల చేసిన ‘2013 వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్ఈ విషయాన్ని పేర్కొంది. 179 దేశాల్లో ఈ సర్వే చేసింది. దీని ప్రకారం ఫిన్లాండ్, నెదర్లాండ్స్, నార్వేలు మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. తుర్క్‌మెనిస్థాన్, ఉత్తర కొరియా, ఎరిత్రియాలు చివరి మూడు స్థానాల్లో నిలిచాయి.


జనవరి 2013 అంతర్జాతీయం ::.

డబ్ల్యూఈఎఫ్ 43వ వార్షిక సదస్సు
వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 43వ వార్షిక సదస్సు దావోస్ (స్విట్జర్లాండ్) లో జనవరి 23 నుంచి 27వరకు జరిగింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు జరిగిన ఈ సదస్సులో భారత్ నుంచి కేంద్ర మంత్రులు కమల్ నాథ్, ఆనంద్ శర్మ సహా 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సంక్షోభంలో చిక్కుకున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కలిగించేందుకు, ఉపాధి కల్పనకు, అవినీతిపై పోరాటానికి..సువర్ణ త్రిభుజం (గోల్డెన్ ట్రయాంగిల్) ఫార్ములా పాటించాలనే అభిప్రాయాన్ని సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు వ్యక్తం చేశారు.

హెడ్లీకి 35 ఏళ్ల జైలు
26/11 ముంబై దాడుల్లో పాల్గొన్న పాకిస్థాన్ ఉగ్రవాదులకు వ్యూహాత్మక సహకారం అందించిన లష్కరే తోయిబా ఉగ్రవాది, పాకిస్థానీ-అమెరికన్ డేవిడ్ హెడ్లీకి అమెరికాలోని షికాగో కోర్టు జనవరి 2435 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. ముంబైలో 2008 నవంబర్ 26న ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 166 మంది మరణించారు.

ఆహార వ్యర్థాలకు వ్యతిరేకంగా ప్రచారం
ఆహార పదార్థాల వ్యర్థానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం; ఆహార, వ్యవసాయ సంస్థలు సంయుక్తంగా ప్రచారాన్ని చేపట్టాయి. థింక్-ఈట్-సేవ్-రెడ్యూజ్ యువర్ ఫుడ్ ప్రింట్అనే నినాదంతో జనవరి 22న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. వ్యర్థాలుగా వదిలి వేయడం కారణంగా ప్రతి ఏటా 1.3 బిలియన్ టన్నుల ఆహారాన్ని నష్టపోతున్నట్లు, ఇందుకు దారితీస్తున్న అలవాట్లను మార్చే ఉద్దేశంతో ఈ ప్రచారం చేపట్టాయి. ఉత్పత్తి స్థాయిలో అంటే పండే చోట, ప్రాసెసింగ్, పంపిణీ వద్ద ఆహారం అధికంగా వథా అవుతోంది. దీని విలువ ప్రతి సంవత్సరం ఒక ట్రిలియన్ డాలర్లు.

పాదరసం నియంత్రణపై ఒప్పందం
హానికరమైన పాదరసం వినియోగాన్ని పరిమితం చేస్తూ రూపొందించిన ఒప్పందాన్ని 140 దేశాలు అంగీకరించాయి. జెనీవా (స్విట్జర్లాండ్)లో జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారానికి వచ్చాయి. పాదరసం వినియోగంపై ప్రపంచంలో చట్టబద్ధంగా కట్టుబడాల్సిన మొట్ట మొదటి ఒప్పందం ఇదే. దీన్ని మినమటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యురీగా పిలుస్తారు. మినమటా అనేది జపాన్‌లోని పట్టణం. ఇక్కడ దశాబ్దాలుగా ప్రజలు పాదరస ప్రభావానికి తీవ్రంగా గురయ్యారు. విషతుల్యమైన పాదరసాన్ని క్విక్ సిల్వర్‌గా కూడా పేర్కొంటారు. ఇది మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర ముప్పు కలిగిస్తుంది. దీని ప్రభావం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. పిండస్థ శిశువులు, చిన్న పిల్లలకు ఈ ముప్పు తీవ్రంగా ఉంటుంది. మానసిక రుగ్మతలు, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఇది ఎలక్ట్రికల్ స్విచ్‌లు, థర్మామీటర్లు, బల్బులు, ఫేసియల్ క్రీమ్ వంటి వాటిల్లో ఉంటుంది. మైనింగ్, బొగ్గును మండించే విద్యుత్, సిమెంట్ కర్మాగారాల నుంచి ఎక్కువగా విడుదలవుతుంది.

పునర్వినియోగ ఇంధన ప్రపంచ అట్లాస్ ఆవిష్కరణ
పునర్వినియోగ ఇంధనాలపై ప్రపంచ అట్లాస్‌ను అంతర్జాతీయ పునర్వినియోగ ఇంధన సంస్థ (ఐఆర్‌ఈఎన్‌ఏ) జనవరి 13న ఆవిష్కరించింది. ఇది ఆయా దేశాలకు తమ పునర్వియోగ ఇంధన సామర్థ్యానికి సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతుంది. అబుదాబీలో జరిగిన ఐఆర్‌ఈఎన్‌ఏ రెండు రోజుల వార్షిక సమావేశంలో ఈ అట్లాస్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇందులో సౌర, పవన(విండ్) వనరులకు సంబంధించిన సమాచారం ఉంది. అబుదాబీ కేంద్రంగా 2011లో ఐఆర్‌ఈఎన్‌ఏ ఏర్పాటైంది. అన్ని విధాలైన పునర్వియోగ ఇంధన వనరుల సుస్థిర వినియోగానికి ప్రాచుర్యం కల్పించేందుకు ఐఆర్‌ఈఎన్‌ఏ పని చేస్తుంది.

శ్రీలంక కొత్త చీఫ్ జస్టిస్ మోహన్ పీరిస్
శ్రీలంక నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఆ దేశ మాజీ అటార్నీ జనరల్ మోహన్ పీరిస్‌ను దేశాధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే నియమించారు. పీరిస్ ప్రస్తుతం లంక కేబినెట్ న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో పీరిస్‌కు ముందు చీఫ్ జస్టిస్‌గా ఉన్న శిరానీ బండారునాయకేను రాజపక్సే జనవరి 13న పదవి నుంచి తొలగించారు.

రెండోసారి ఒబామా ప్రమాణ స్వీకారం
అమెరికా అధ్యక్షుడిగా బరాక్ హుస్సేన్ ఒబామా జనవరి 20న రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా బాధ్యతల స్వీకరణతో రెండోసారి అమెరికా అధ్యక్షుడైన 21వ వ్యక్తిగా కూడా ఆయన రికార్డు సష్టించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా ఇంతకుముందే గెలిచినప్పటికీ, రాజ్యాంగ ప్రకారం కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం మాత్రం జనవరి 20న జరిగింది. అదే రోజు అమెరికా ఉపాధ్యక్షుడిగా జోయ్ బిడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. బిడెన్ కూడా ఈ పదవిని చేపట్టడం వరుసగా ఇది రెండోసారి.

శ్రీలంక చీఫ్ జస్టిస్ తొలగింపు
శ్రీలంక మొదటి మహిళా చీఫ్ జస్టిస్ శిరానీ బండారునాయకేను ఆ దేశాధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే పదవి నుంచి తొలగించారు. బండారునాయకేపై వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో రాజపక్సే ఈ చర్య తీసుకున్నారు. బండారునాయకేను తొలగించడానికి ఉద్దేశించిన మహాభియోగ తీర్మానాన్ని శ్రీలంక పార్లమెంట్ ఆమోదించింది. ఇందుకోసం జనవరి 11న జరిగిన ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 155 మంది సభ్యులు, వ్యతిరేకంగా 49 సభ్యులు ఓటేశారు.

పర్యావరణ ప్రమాదాలపై డబ్ల్యూఈఎఫ్ నివేదిక
పర్యావరణ ప్రమాదాలను ఎదుర్కోవడంపై రూపొందించిన వార్షిక నివేదికను జెనీవాలోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) జనవరి 8న విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన.. బ్రెజిల్, చైనా, జర్మనీ, ఇండియా, ఇటలీ, జపాన్, స్విట్జర్లాండ్, రష్యా, యూకే, అమెరికా దేశాలకు ర్యాంకులు కేటాయించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఆర్థిక ప్రమాదాలను ఎదుర్కొనే సామర్థ్యంలో భారత్ 9వ స్థానంలోనూ, పర్యావరణ ప్రమాదాలను ఎదుర్కోవడంలో 10వ స్థానంలోనూ ఉంది. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది.

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీకి 18వ స్థానం దక్కింది. ప్రపంచంలో 100 మంది అత్యంత సంపన్నులతో రూపొందించిన ఈ జాబితాను బ్లూమ్‌బర్గ్ జనవరి 2న విడుదల చేసింది. ఇందులో మెక్సికన్ టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం టెల్మెక్స్ చైర్మన్ కార్లోస్ స్లిమ్ అగ్రస్థానంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఫ్యాషన్ రిటైలింగ్ సంస్థ జారా వ్యవస్థాపకుడు ఆమాన్చియో ఓర్టెగా వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్ బఫెట్‌కు నాలుగో స్థానం, ఐకియా వ్యవస్థాపకుడు ఇంగ్వర్‌కాంప్రాద్‌కు అయిదో స్థానం దక్కింది.

స్టేట్ ఆఫ్ పాలస్తీనా
దేశం హోదా కల్పించాలన్న డిమాండ్‌కు ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ మద్దతిచ్చిన నేపథ్యంలో పాలస్తీనా ప్రాధికార సంస్థ అధికారికంగా స్టేట్ ఆఫ్ పాలస్తీనాఅనే పేరును ఖరారు చేసుకుంది. ఇకపై అన్ని అధికార పత్రాల్లో ఈ పేరునే వినియోగించాలని అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఆదేశాలు జారీ చేశారు.
www.sakshieducation.com

No comments: